OTT Movie : హాలీవుడ్ సినిమాలలో టైటానిక్ హీరోయిన్ అంటే చిన్న పిల్లలతో సహా గుర్తుపెట్టుకున్నారు. అంతలా ఈ అమ్మడు ప్రేక్షకుల గుండెల్లో ఒక చెరగని ముద్ర వేసుకుంది. అయితే ఈమె నటించన మరో సినిమాకి కూడా ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
1958లో, పశ్చిమ జర్మనీలో, 14 ఏళ్ల మైఖేల్ బెర్గ్ అనే యువకుడు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు 36 ఏళ్ల హన్నా ష్మిట్జ్ (కేట్ విన్స్‌లెట్) అనే మహిళ అతనికి సహాయం చేస్తుంది. ఆమె అతన్ని ఇంటికి తీసుకెళ్లి వైద్యం అందిస్తుంది. మైఖేల్ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత, హన్నాకు కృతజ్ఞతలు చెప్పడానికి మళ్ళీ ఆమె ఇంటికి తిరిగి వస్తాడు. ఇక వీరిద్దరూ ఒక లవ్ స్టోరీని నడుపుతారు. ఏకాంతంగా గడుపుతూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారు. ఈ సంబంధంలో హన్నా మైఖేల్‌ను పుస్తకాలు చదవమని ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా ఆమెకు అతను పుస్తకాలు బిగ్గరగా చదివి వినిపిస్తుంటాడు. అయితే హన్నా ఒక రోజు హఠాత్తుగా అదృశ్యమవుతుంది. మైఖేల్‌ను గందరగోళంలో వదిలేస్తుంది.
కొన్ని సంవత్సరాల తరువాత మైఖేల్ ఒక న్యాయవిద్యార్థిగా ఉంటాడు. 1960లలో నాజీ యుద్ధ నేరాల విచారణలో భాగంగా, హన్నా ఒక నాజీ రహస్య ఏజెంట్ అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు అతను తెలుసుకుంటాడు. ఈ విచారణ సమయంలో, హన్నా ఒక రహస్యాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నట్లు మైఖేల్ గుర్తిస్తాడు. ఆమెను కొంతమంది ఈ కేసులో ఇరికిస్తారు. హన్నానిరక్షరాస్యత కారణంగా ఆమె నేరాన్ని ఒప్పుకోవడానికి దారితీస్తుంది. మైఖేల్ కి ఈ విషయం తెలిసినప్పటికీ ఏం చేయలేకపోతాడు. ఈ కేసులో హన్నాకి జైలు శిక్ష పడుతుంది. చివరికి వీళ్ళు మళ్ళీ కలసుకుంటారా ? హన్నా జీవితం జైలులోనే ముగుస్తుందా ? మైఖేల్ ఆమెకోసం ఏం చేస్తాడు ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : సైకో ప్లే బాయ్ చేతికి చిక్కి అల్లాడే అమ్మాయిలు… ఒళ్లు గగుర్పొడిచే సీన్స్ ఉన్న సైకో కిల్లర్ మూవీ
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘ది రీడర్’ (The Reader). 2008 లో వచ్చిన ఈ సినిమాకి స్టీఫెన్ డాల్డ్రీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ బెర్న్‌హార్డ్ ష్లింక్ రాసిన నవల ఆధారంగా రూపొందింది. ఇందులో కేట్ విన్స్‌లెట్, రాల్ఫ్ ఫియన్స్, డేవిడ్ క్రాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. కేట్ విన్స్‌లెట్ ఈ చిత్రంలో హన్నా ష్మిట్జ్ పాత్రకు ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.