BigTV English

Balakrishna : బాలయ్య ఖాతాలో అరుదైన రికార్డు… 60లోనూ అన్ స్టాపబుల్

Balakrishna : బాలయ్య ఖాతాలో అరుదైన రికార్డు… 60లోనూ అన్ స్టాపబుల్

Balakrishna : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నారు. 60 ఏళ్ల వయసులోనూ అన్ స్టాపబుల్ అన్నట్టుగా వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య తాజాగా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) మూవీతో మరో అరుదైన ఫీట్ సాధించారు. దీంతో బాలయ్య ఖాతాలో అరుదైన రికార్డు పడినట్టుగా అయింది.


‘డాకు మహారాజ్’ అరుదైన ఘనత

నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. ఈ మూవీ ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాలయ్య అభిమానులు ఆశించే యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు, ఆయనను సరికొత్త అవతారంలో చూపించడం ప్రేక్షకులకు ఈ మూవీ బాగా నచ్చేసింది. దీంతో ఈ సినిమా నాలుగు రోజుల్లోనే 100 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి రికార్డును క్రియేట్ చేసింది. ఈ మూవీతో వరుసగా 4 బాలయ్య సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేరడం విశేషం.


ఇప్పటికే బాలయ్య హీరోగా నటించిన అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరగా, తాజాగా ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) కూడా 100 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి బాలయ్య ఖాతాలో అరుదైన రికార్డును సృష్టించింది. నిజానికి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలలో వరసగా నాలుగు సినిమాలు 100 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిన ఒకే ఒక్క హీరో నందమూరి బాలకృష్ణ మాత్రమే కావడం విశేషం. ఇక రీసెంట్ గా ‘డాకు మహారాజ్’ మూవీ ఈవెంట్లో సెకండ్ ఇన్నింగ్స్ వేరే లెవెల్ లో ఉంటాయి అంటూ తనదైన స్టైల్ లో పంచ్ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా ఒక లెక్క, డాకు మహారాజ్ తర్వాత మరొక లెక్క అంటూ అభిమానులకు నెక్స్ట్ నుంచి మాస్ పీస్ట్ ఉండబోతుందని మాటిచ్చారు బాలయ్య.

100 కోట్ల క్లబ్ లో ‘డాకు మహారాజ్’

బాలయ్య హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj). ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ – ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇందులో బాబీ డియోల్, ఊర్వశి రౌతెల, సచిన్ ఖేడ్కర్, చాందిని చౌదరి కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయింది.

మొదటి రోజే 56 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాలయ్య కెరీర్ లోనే హైయ్యెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది ‘డాకు మహారాజ్’. ఇక సంక్రాంతి సెలవులు కొనసాగుతుండడంతో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. నాలుగు రోజుల్లోనే ‘డాకు మహారాజ్’ 105 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది అనే విషయాన్ని చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది. ఇక డాకు మహారాజ్’ మూవీ హిట్ అవ్వాలంటే 160 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది. ఈ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను బాలయ్య రీచ్ కావాలంటే, మరో రెండు లేదా మూడు రోజులు పట్టే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

Related News

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Siva Jyothi: గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి..దయచేసి దిష్టి పెట్టకండి అంటూ!

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Big Stories

×