Balakrishna: కొందరు దర్శకులు, హీరోల కాంబో అయినా.. హీరో, హీరోయిన్ కాంబో అయినా ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. ఇక తాజాగా ఒక హీరో, మ్యూజిక్ డైరెక్టర్ కాంబోను టాలీవుడ్ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడుతున్నారు. అదే తమన్, బాలయ్య కాంబో. గత కొన్నాళ్లుగా బాలకృష్ణ హీరోగా సినిమా వస్తుందంటే చాలు.. దానికి తమనే మ్యూజిక్ డైరెక్టర్ అని ప్రేక్షకులు బ్లైండ్‌గా ఫిక్స్ అవ్వాల్సిందే. పైగా తమన్ కూడా తనకు నమ్మి వచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకొని బాలయ్యకు బాగా దగ్గరయ్యాడు. ఇటీవల వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘డాకు మహారాజ్’ మూవీ సక్సెస్ మీట్‌లో తమన్‌కు ఏకంగా కొత్త పేరు పెట్టారు బాలయ్య.
నందమూరి తమన్ కాదు
బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన సినిమానే ‘డాకు మహారాజ్’. బాలయ్య సినిమా అంటే ప్రేక్షకులు ఏమేం ఆశిస్తారో అవన్నీ ఈ సినిమాలో యాడ్ చేసి క్లీన్ హిట్ అందుకున్నాడు బాబీ. అయితే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్‌గా తమన్ ఎంపికయ్యాడు. వీరి కాంబోలో వచ్చిన చాలావరకు సినిమా కావడంతో ‘డాకు మహారాజ్’ మ్యూజిక్ కూడా అందరికీ నచ్చుతుందని ముందే ఫిక్స్ అయిపోయారు. అదే నిజమయ్యింది. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తనకు తండ్రి లేడని, బాలయ్యనే తన తండ్రిలాగా భావిస్తానని ఎమోషనల్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు తమన్ (Thaman). అంతే కాకుండా తన పేరు ఇప్పటినుండి నందమూరి తమన్ అని తెలిపాడు.
బాండింగ్ బాగుంది
‘డాకు మహారాజ్’ సూపర్ సక్సెస్ కావడంతో మూవీ టీమ్ ఒక సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. అందులో తమన్ పేరు నందమూరి తమన్ కాదు అని, ఎన్‌బీకే తమన్ అని కొత్తగా నామకరణం చేశారు బాలయ్య. దీంతో బాలయ్య, తమన్ బాండ్ చూస్తుంటే చాలా బాగుందని చాలామంది ప్రేక్షకులు ఫీలవుతున్నారు. ఇదిలా ఉండగా తాను చేసే ప్రతీ సినిమాను ఒక ఛాలెంజ్‌లాగా తీసుకొని చేస్తానని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. ‘డాకు మహారాజ్’తో బాబీ తనలోని నట విశ్వరూపాన్ని బయటికి తీసుకొచ్చాడని ప్రశంసించారు. జనవరి 12న విడుదలయిన ‘డాకు మహారాజ్’ (Daaku Maharaj) మూవీ ఇప్పటికీ పాజిటివ్ రివ్యూలతో దూసుకుపోతోంది.
Also Read: ధైర్యంగా ముందడుగు వేశాను, ఇదంతా నా అదృష్టంగా భావిస్తున్నాను.. పూజా కామెంట్స్
బాబీకి అవకాశం
యంగ్ డైరెక్టర్లను నమ్మి ఛాన్సులు ఇవ్వడం బాలకృష్ణ (Balakrishna)కు కొత్తేమీ కాదు. అలా ‘డాకు మహారాజ్’ కోసం బాబీని నమ్మారు. బాబీకి ఇదివరకే పలువురు సీనియర్ హీరోలను డైరెక్ట్ చేసిన అనుభవం ఉంది. అలా బాలయ్యను కూడా ఈ మూవీ కోసం బాగానే హ్యాండిల్ చేశారు. విడులదయిన మొదటి రోజు నుండే ‘డాకు మహారాజ్’ స్టోరీ రొటీన్‌గా ఉన్నా బాలయ్య సినిమాలో ఎలాంటి అంశాలు ఉండాలని ప్రేక్షకులు కోరుకుంటారో.. అవన్నీ ఇందులో ఉన్నాయని పాజిటివ్ రివ్యూలు అందించారు ప్రేక్షకులు. అలా చాలామంది నందమూరి ఫ్యాన్స్ ఈ సినిమాను థియేటర్లలో చూడడానికి ముందుకొస్తున్నారు. అలా ఇప్పటివరకు ఈ సినిమాకు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి.