Unstoppable 2 : బాహుబలి తర్వాత కన్ఫ్యూజ్ అవ్వలేదా ? బాలయ్య-ప్రభాస్ వీడియో వైరల్ ..

Unstoppable 2 : బాహుబలి తర్వాత కన్ఫ్యూజ్ అవ్వలేదా ? బాలయ్య- ప్రభాస్ వీడియో వైరల్ ..

prabhas unstoppable full episode
Share this post with your friends

prabhas unstoppable full episode

Unstoppable 2 : ప్రభాస్ ..బాలయ్య.. ఈ క్రేజీ కాంబో స్క్రీన్ మీద అయితే ఇంతవరకు కనిపించలేదు కానీ బుల్లి తెర పై అన్ స్టాపబుల్ 2 షో లో సందడి చేసిన విషయం తెలిసిందే. రెండు పార్ట్స్ గా వచ్చిన ఈ ఎపిసోడ్ 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దాటేసింది. డార్లింగ్ ఫ్యాన్స్ అంటే మజాకానా.. ప్రభాస్ ఉంటే చాలు అది ఏ ఈవెంట్ అయినా హైలెట్ అవ్వాల్సిందే అని మరోసారి ఈ ఎపిసోడ్ తో నిరూపించారు. మనం “ఆహా” ఓటీటీలో చాలా వరకు వీళ్ళిద్దరి మధ్య ముచ్చట్లు చూసాము. అయితే ఈ ఎపిసోడ్స్ లో కొన్ని సంభాషణలను కట్ చేశారు. అలా కట్ చేసిన క్లిప్స్ ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా నెట్టింట వైరల్ అయ్యాయి. రీసెంట్ గా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

బాలయ్య ప్రభాస్ ను అతని కెరియర్ గురించి అడిగిన కొన్ని ప్రశ్నలకు ప్రభాస్ తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. ఒక సినిమా ఇచ్చిన సక్సెస్ తో పాటు యాక్టర్ ఎటువంటి కష్టాలు ఎదుర్కొంటాడు? ఎటువంటి సవాళ్లను ఫేస్ చేస్తాడు? వాటి నుంచి ఎలా బయటకు వస్తారు అనే విషయంపై అటు బాలయ్య ఇటు ప్రభాస్ ల మధ్య డీప్ కాన్వర్జేషన్ జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్ లో క్లిప్ ని తీసేసారు. ఇప్పుడు ఆ అన్ సీన్ వీడియో లీక్ అవడం.. డార్లింగ్ ఫ్యాన్స్ దాన్ని కూడా బాగా వైరల్ చేయడం జరిగిపోయాయి. మరి ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందామా.

బాలకృష్ణ అడిగే ప్రశ్నలకు ప్రభాస్ ఎంతో బ్యాలెన్స్ డ్ గా సమాధానం ఇవ్వడమే కాకుండా తనపై వస్తున్న విమర్శల గురించి కూడా చాలా కూల్ గా స్పందించాడు. ఇక బాలయ్య మధ్యలో తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ జోకులతో కడుపుబ్బ నవ్వించాడు. ఇలా మధ్యలో చాలా సీరియస్ గా వచ్చిన డిస్కర్షన్ ఏంటంటే.. బాహుబలి తర్వాత ప్రభాస్ కెరియర్ లో చోటు చేసుకున్న మార్పులు, మూడవ సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకొని బాహుబలితో పాన్ ఇండియన్ స్టార్ ఎదిగి ఆ తర్వాత వచ్చిన ఫెయిల్యూర్స్ ను ప్రభాస్ ఎలా తీసుకున్నాడు అన్న విషయాన్ని బాలయ్య ప్రశ్నించాడు.

బాహుబలి వరకూ ఎవ్వరు ఆపేవారు లేరు. కానీ ఆ తరువాత.. నీ మైండ్ సెట్ ఏంటి? బాహుబలి తర్వాత ఎటు స్టెప్ వేయాలి అని డౌట్ గా అనిపించలేదా? కన్ఫ్యూజ్ అవ్వలేదా? అని బాలయ్య అడగడంతో ప్రభాస్ నవ్వుతూ కన్ఫ్యూజ్ అవ్వలేదు అని సమాధానమిచ్చాడు. బాహుబలి తర్వాత సాహో, రాధే శ్యామ్ మూవీస్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. బాలయ్య అదే విషయాన్ని తిరిగి ప్రస్తావించి ఆ తర్వాత ప్రభాస్ ఆలోచన ఎలా ఉంది అని ప్రశ్నించాడు.

బాహుబలి తర్వాత ఇండియా మొత్తానికి నచ్చే విధంగా ఎటువంటి సినిమాలు చేయాలి? కమర్షియల్ మూవీస్ చేయాలా ? లేక మామూలుగానే ఉండాలా? రిజల్ట్ అనేది ఎటు పోతుందో అర్థం కాలేదు.. అని ప్రభాస్ తన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా వెల్లడించారు. దానికి బాలయ్య నీకేం ఒక మూవీ నీల్ డైరెక్ట్ చేస్తున్నాడు మరొకటి నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక మారుతితో మరో మూవీ ఉండనే ఉందిగా.. ఇది నిజంగా మంచిదే ఎందుకంటే మిగతా రెండు సినిమాలు ఎటువైపు ఉన్నాయో నాకు తెలియదు గానీ మారుతి మూవీ తో నువ్వు మళ్ళీ నీ ఒరిజినల్ సైడ్ కి వచ్చేస్తున్నావు ..అని అన్నారు.

ఇలా బాలయ్య ప్రభాస్ మధ్య జరిగిన ఈ కొన్ని సన్నివేశాలని అప్పట్లో అన్ స్టాపబుల్ ఎపిసోడ్ లో చూపించలేదు. ప్రభాస్ తన కెరియర్ గురించి, మూవీస్ గురించి , సక్సెస్ గురించి కంటే కూడా తన నుంచి అభిమానులు ఏం ఆశిస్తున్నారు అనే విషయంపైనే ఎక్కువ ఫోకస్ పెడతారు అనేది మరొకసారి ప్రభాస్ మాటల్లో స్పష్టమైంది. అందుకే ప్రభాస్ ని అభిమానులు డార్లింగ్ అని పిలిచేది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Rahane in Test World Cup : ఇంగ్లండ్‌లో రహానే టాప్-5 మ్యాచెస్.. టెస్ట్ వరల్డ్ కప్‌లో అదరగొట్టేస్తాడా..?

Bigtv Digital

Husband Name : మొగుడ్ని పేరుతో పిలిస్తే ఆయుక్షీణమా.?

BigTv Desk

BJP : వేదికపై తెలంగాణ వ్యతిరేకి!.. నల్లారిపై కిరికిరి..

Bigtv Digital

Tirupati: కారుపై పెట్రోల్ పోసి నిప్పు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవ దహనం

Bigtv Digital

Meditate:- భగవంతుడి కోసం ధ్యానం ఎందుకు చేయాలి?

Bigtv Digital

Telangana Elections : పోలింగ్ 70.74 శాతం.. సీఈవో వికాస్ రాజ్ వెల్లడి..

Bigtv Digital

Leave a Comment