Bandla Ganesh: కొందరు హీరోహీరోయిన్లు మాత్రమే కాదు.. దర్శక నిర్మాతలు కూడా ఏం చేసినా సెన్సేషనే. అలాంటి నిర్మాతల్లో బండ్ల గణేశ్ ఒకరు. ఒకప్పుడు సినిమా ఈవెంట్స్‌లో హీరోల స్పీచ్‌ల కోసం ప్రేక్షకులు ఎదురుచూసేవారు. ఆ తర్వాత దర్శకుల స్పీచ్‌ల కోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు. అలాంటి ప్రేక్షకులు నిర్మాతల స్పీచ్‌ల కోసం ఎదురుచూసేలా చేసే క్రెడిట్ చాలావరకు బండ్ల గణేశ్‌కే దక్కుతుంది. యాక్టర్‌గా ఉన్నప్పుడు కంటే నిర్మాతగా మారిన తర్వాతే బండ్ల గణేశ్‌కు మరింత క్రేజ్ పెరిగింది. అందుకే ఆయన ఎప్పుడు ఏం చేసినా ప్రేక్షకులు చాలా ఆసక్తిగా చూస్తుంటారు. తాజాగా పాదయాత్ర చేస్తానంటూ షాకింగ్ ప్రకటన ఇచ్చారు బండ్ల గణేశ్.
భక్తియాత్రకు సిద్ధం
బండ్ల గణేశ్ ప్రస్తుతం షాద్ నగర్‌లో తన నివాసంలో ఉంటున్నారు. అయితే ఆ నివాసం నుండే తన పాదయాత్ర మొదలుకానున్నట్టు తెలుస్తోంది. షాద్ నగర్ నుండి ఏకంగా తిరుమల వరకు ఆయన పాదయాత్ర కొనసాగనున్నట్టు సమాచారం. ఇది పాదయాత్ర కాదని.. భక్తియాత్ర అని తన ఫాలోవర్స్ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కానీ ఈ విషయంపై బండ్ల గణేశ్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. మొత్తానికి గత కొన్నిరోజులుగా సైలెంట్‌గా ఉన్న బండ్ల గణేశ్.. చాలాకాలం తర్వాత బయటికి వచ్చి ఈ పాదయాత్రతో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారనున్నారని తెలుస్తోంది.
సోషల్ మీడియాలో హైలెట్
సినిమా ఈవెంట్స్‌లో మాత్రమే కాదు.. సోషల్ మీడియాలో కూడా బండ్ల గణేశ్ కామెంట్స్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. రాజకీయాల్లో మాత్రమే కాదు.. సినీ పరిశ్రమలో కూడా ఎలాంటి హైలెట్ విషయం జరిగినా.. దానిపై సోషల్ మీడియాలో తన స్టైల్‌లో స్పందించడం బండ్ల గణేశ్‌కు అలవాటు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను ఎవరైనా ఏమైనా అంటే.. దాని ఫస్ట్ రియాక్షన్ బండ్ల గణేశ్ నుండే వస్తుంది. అలా చాలాసార్లు ఆయన సోషల్ మీడియా పోస్టులు హైలెట్ అయ్యాయి. ఇప్పటికీ సినీ పరిశ్రమలో జరిగే హైలెట్ విషయాల గురించి ఆయన ఎప్పుడెప్పుడు స్పందిస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తుంటారు. బండ్ల గణేశ్‌కు సోషల్ మీడియాలో ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి.
Also Read: పోసానికి ఏం అవ్వలేదు.. అంత డ్రామాలే.. డాక్టర్లు ఏం అన్నారంటే.?
సెకండ్ ఇన్నింగ్స్ కోసమే
గత కొన్నిరోజులుగా బండ్ల గణేశ్ (Bandla Ganesh) రాజకీయాల్లో అంత యాక్టివ్‌గా లేరు. ఇక సినిమాల నిర్మాణాన్ని పక్కన పెట్టి దాదాపు పదేళ్లు అవుతోంది. అందుకే షాద్ నగర్ నుండి తిరుమల పాదయాత్రతో మరోసారి తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలని బండ్ల గణేశ్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.. పాదయాత్ర పూర్తయిన తర్వాత ఒక స్టార్ హీరోతో ఆయన సినిమాను నిర్మించనున్నారని సమాచారం. ఈ విషయం విన్న ప్రేక్షకులు ఈ ప్రాజెక్ట్ గురించి ఎగ్జైట్మెంట్‌తో ఉన్నారు. ఇక బండ్ల గణేశ్ తిరిగి రాజకీయాల్లో వస్తే తన ప్రత్యర్థులపై వేసే కామెంట్స్ మామూలుగా ఉండవని, వాటికోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఫ్యాన్స్ అంటున్నారు.
బండ్ల వారి భక్తి యాత్ర..
నిర్మాత బండ్లగణేష్ త్వరలో హైదరాబాద్ షాద్‌నగర్‌లోని తన నివాసం నుండి తిరుమలకు పాదయాత్ర చేపట్టనున్నారు.
బండ్ల అటు రాజకీయాల్లో యాక్టివ్ కానున్నారని.. ఇటు నిర్మాతగానూ ఓ స్టార్ హీరో సినిమా నిర్మాణానికి సన్నాహాలు చెస్తున్నట్లు సమాచారం..#bandlaganesh… pic.twitter.com/mvwV70wuCQ
— SZN (@Suzenbabu) March 1, 2025