Director Arun Roy : టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది అనే వార్త బయటకు వచ్చేలోపే మరో ఇండస్ట్రీలో కూడా ప్రముఖ డైరెక్టర్ కన్నుమూశారు. తాజాగా ప్రముఖ బెంగాలీ డైరెక్టర్ అరుణ్ రాయ్ (Director Arun Roy) 56 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మృతి చెందారు.
గత కొన్నాళ్లుగా క్యాన్సర్, తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో పోరాడుతున్న ఆయన గురువారం ఉదయం ఆర్జి కర్ అనే హాస్పిటల్ లో తుది శ్వాస విడిచినట్టు నటుడు, డాక్టర్ కింజల్ నందా వెల్లడించారు. రాయ్ (Director Arun Roy) దర్శకత్వంలో రూపొందిన ‘హీరాలాల్’ సినిమాతో నందా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక తాజాగా ఈ డైరెక్టర్ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు అన్న వార్త తెలిసిన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
డైరెక్టర్ రాయ్ (Director Arun Roy) చారిత్రాత్మక, బయోపిక్ సినిమాలతో బాగా పాపులర్ అయ్యారు. ఆయన భౌతికకాయాన్ని హరిదేవ్ పూర్ లో ఉన్న ఆయన ఇంటికి తీసుకెళ్లి, అభిమానుల సందర్శనార్థం అక్కడే స్టూడియోలో ఉంచారు. రాయ్ చివరగా ‘బాఘా జతిన్’ అనే సినిమాను చేశారు. అరుణ్ రాయ్ దర్శకత్వం వహించిన ‘బాఘా జతిన్’ 2023లో విడుదలైంది. శ్రీజ దత్ ఈ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆమెకు తొలి సినిమాలోనే దేవ్‌తో కలిసి పని చేసే గోల్డెన్ అవకాశం వచ్చింది. ఇందు బాలగా కొత్త నటి శ్రీజ నటన అందరినీ ఆకట్టుకుంది. ఇక ఆయనతో కలిసి పని చేసిన పలువురు నటీనటులతో పాటు దర్శకుకు కూడా రాయ్ కి నివాళులు అర్పిస్తున్నారు.
అయితే ‘బాఘా జతిన్’ సినిమా షూటింగ్ టైంలోనే రాయ్ (Director Arun Roy)కి క్యాన్సర్ ఉన్నట్టుగా తెలిసింది. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ఆయన రెండు సినిమాల షూటింగ్లను పూర్తి చేశారు. గత 14 ఏళ్లలో ఆయన కేవలం ఐదు సినిమాల చేయడం విశేషం. అయితే క్యాన్సర్ చికిత్స కోసం ఆసుపత్రిలో గత కొన్ని రోజుల నుంచి చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటీలేటర్ పై ట్రీట్మెంట్ చేశారు. తాజాగా ఆయన చివరి శ్వాస విడిచారు.
రాయ్ (Director Arun Roy) అసలు పేరు అరుణవ రాయచౌధురి. నిజానికి ఆయన కెరీర్ మొదట్లో ‘మాణిక్’ వంటి సీరియల్స్‌కి స్క్రిప్ట్‌లు రాశారు. తన తొలి చిత్రం ‘ఎగారో’కి దర్శకత్వం వహించే ముందు ఆయన ఎలాంటి ఫిల్మ్ స్కూల్‌కు వెళ్లలేదు. కనీసం ఎవరికీ అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా సహాయం చేయలేదు. అయినప్పటికీ ‘ ఎగారో ‘, ‘ హీరాలాల్ ‘, ‘8/12 (బినయ్ బాదల్ దినేష్)’, ‘ బాఘా జతిన్ ‘ వంటి అద్భుతమైన సినిమాలను తీశారు. ఆయన కుమారుడు రణదీప్ ‘పౌలోమి బోస్’ చిత్రంలో తన నటనతో అరంగేట్రం చేసాడు.
ఇక మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ లేడీ డైరెక్టర్ అపర్ణ మల్లాది 54 ఏళ్ల వయసులో చివరి శ్వాస విడిచారు. ఆమె కూడా గత గత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతుండడం గమనార్హం. ఈ ఇద్దరు దర్శకులకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.