Black Pepper: నల్ల మిరియాలు ఆహారంలో రుచిని పెంచడానికి ఉపయోగిస్తారు. మిరియాల పొడిని జోడించడం వల్ల ఆహారం రుచి మెరుగుపడుతుంది. నల్ల మిరియాలు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల అనేక శారీరక ప్రయోజనాలు కలుగుతాయి. నల్ల మిరియాలు బరువు తగ్గడం నుండి జీర్ణక్రియను మెరుగుపరచడం వరకు ప్రతిదానిలో ప్రయోజనకరంగా ఉంటాయి. మిరియాల్లో ఉండే అనేక రకాల పోషకాలు, ఔషధ గుణాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న నల్ల మిరియాలను ఎలా ఉపయోగించాలి. వీటికి సంబంధించిన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల మిరియాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
నల్ల మిరియాలు జీర్ణ ఎంజైమ్‌లను సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. అంతే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గ్యాస్ , అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందించడంలో సహాయపడతాయి. తరుచుగా నల్ల మిరియాలు వంటకాల్లో ఉయోగించడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి.
పోషకాలను బాగా గ్రహించడం:
నల్ల మిరియాలు ముఖ్యంగా పసుపుతో కలిపి తీసుకుంటే పోషకాల శోషణను పెరుగుతుంది. అంతే కాకుండా ఇది మీ శరీరానికి అవసరమైన పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది. ఫలితంగా పోషకాల శోషణ మెరుగుపడేందుకు ఎక్కవ అవకాశాలు కూడా ఉన్నాయి.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది:
నల్ల మిరియాలు జీవక్రియను పెంచుతాయి. తద్వారా బరువు తగ్గడంలో ఇవి సహాయపడతాయి. ఇవి శరీరంలోని కొవ్వును కరిగించడంలో కూడా సహాయపడతాయి. బరువు తగ్గాలని అనుకునే వారు తినే ఆహారంలో మిరియాలను ఎక్కువగా వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది:
బ్లాక్ పెప్పర్‌లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా ఇవి వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి.
పెయిన్ రిలీఫ్:
బ్లాక్ పెప్పర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంది. ఇది కీళ్ల నొప్పులు, కండరాల నొప్పి తో పాటు తలనొప్పి వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
చర్మానికి మేలు చేస్తుంది:
నల్ల మిరియాలు యాంటీఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది మొటిమలు, ముడతలు , ఇతర చర్మ సమస్యలతో పోరాడటానికి సహాయపడతాయి. చర్మ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారు నల్ల మిరియాలను తీసుకోవడం మంచిది.
జలుబు, దగ్గు నుండి ఉపశమనం:
నల్ల మిరియాలు జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందించడంలో సహాయపడతాయి. తేనెతో కలిపి మిరియల పొడి తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
నల్ల మిరియాలు ఎలా తీసుకోవాలి ?
మీరు వివిధ వంటలలో నల్ల మిరియాలు ఉపయోగించవచ్చు.
దీన్ని టీలో కలుపుకుని కూడా తాగవచ్చు.
తేనెతో కలిపి కూడా తినవచ్చు.
Also Read: ఇవి వాడారంటే.. తెల్లజుట్టు రానే రాదు
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.