Bahubali: మన తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది రాజమౌళి అన్నది అక్షర సత్యం. ఆయన తీసిన బాహుబలి సినిమాకి ముందు సినిమా తరువాత అని చెప్పుకునే విధంగా తెలుగు ఇండస్ట్రీ మారిపోయింది. ఈ సినిమా తర్వాత నుంచి వరుసగా పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా అందాల నటి అనుష్క హీరోయిన్ గా, రూపుదిద్దుకున్న సినిమా బాహుబలి. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే.. టీవీల్లో వస్తే ఇప్పటికీ ఫ్యాన్స్ కన్నార్పకుండా చూస్తారంటే.. ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్తను మూవీ టీం ప్రకటించింది. దాదాపు పదేళ్ల తర్వాత ఈ సినిమా రీ- రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అది ఎప్పుడు అన్నది చూసేద్దాం..
రీ రిలీజ్ అప్పుడే …
ప్రభాస్ బాహుబలి సినిమా రీ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండు నడుస్తోంది. బడా హీరోల సినిమాలు మరోసారి థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అందులో భాగంగా అక్టోబర్ 2025 లో బాహుబలి మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. ఈ వార్త తెలుసుకున్న అభిమానులు ఎప్పుడెప్పుడు బాహుబలి సినిమాను థియేటర్లో చూస్తామని ఎదురుచూస్తున్నారు. మరోసారి ప్రభాస్, అనుష్కల జంటను వెండితెరపై చూడబోతున్నాం అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిగా ఉన్నారు.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అనేక రికార్డులను సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా 650 కోట్లు వసూలు చేసింది. 4000 స్క్రీన్ లలో విడుదలయ్యి, తెలుగులో 1600, హిందీలో 1500, తమిళంలో 350, మలయాళంలో 225 స్క్రీన్ లలో ప్రజెంట్ చేసిన సినిమాగా రికార్డు నెలకొల్పింది. బాహుబలి పాన్ ఇండియా సినిమాగా మన ముందుకు వచ్చి ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పుడు మరోసారి రీ రిలీజ్ అయ్యి ఎటువంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.
వెండితెర అద్భుతం మరోసారి రానుంది ..
బాహుబలి ది బిగినింగ్ మాహిష్మతి రాజ్యం, బాహుబలి గా ప్రభాస్, భల్లాలదేవుడిగా రానా దగ్గుపాటి, దేవసేనగా అనుష్క అవంతికగా తమన్న, రాజమాతగా రమ్యకృష్ణ తమదైన నటనతో అద్భుతంగా పాత్రలలో ఇమిడిపోయారని చెప్పొచ్చు. ఈ సినిమాలో నాజర్, సత్యదేవ్, సుదీప్ వంటి నటులు సహాయక పాత్రల్లో నటించి మెప్పించారు. ఈ సినిమా విజయానికి సంగీతం ఓ కారణం. ఈ మూవీలో బ్యాక్ గ్రౌండ్, దీవర పాట, మమతల తల్లి, మనోహరీ వంటి సూపర్ హిట్ ఆల్బమ్ ను ఎం ఎం కీరవాణి అందించారు. ఈ సినిమా విజయానికి యాక్షన్ సీక్వెల్స్ కూడ ఓ భాగమయ్యాయి. పీటర్ హీన్ 2000 మంది స్టెంట్ మెన్స్ తో ఏనుగులతో భారీ యాక్షన్ సీన్స్ ను ఇందులో రూపొందించారు. బాహుబలి రెండు భాగాలుగా మన ముందుకు వచ్చింది. ఈ సినిమా పోస్టర్ గిన్నిస్ రికార్డు నెలకొల్పింది 2017 జూన్ 27న ఆడియో లాంచ్ సందర్భంగా, అతి పెద్ద పోస్టర్ ను కొచ్చి లో ఏర్పాటు చేశారు. అది గిన్నిస్ రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా మహాభారతం నుండి కథ తీసుకున్నట్లు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. బాహుబలి రీ రిలీజ్ అయ్యాక ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Retro: రెట్రో సునామీ మొదలైంది.. విడుదల ముందే రికార్డులు.. సూర్య విశ్వరూపం..!