BigTV English

Sai Pallavi: ఆ సినిమా వదిలేసి మూడు రోజులకే పారిపోవాలనుకున్నా.. షాకింగ్ విషయం బయటపెట్టిన సాయి పల్లవి

Sai Pallavi: ఆ సినిమా వదిలేసి మూడు రోజులకే పారిపోవాలనుకున్నా.. షాకింగ్ విషయం బయటపెట్టిన సాయి పల్లవి

Sai Pallavi: ఆన్ స్క్రీన్ పాత్రలతో మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ తన క్యారెక్టర్‌తోనే ప్రేక్షకులకు దగ్గరయిన నటీనటులు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. సాయి పల్లవి అనగానే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. తన స్టోరీ సెలక్షన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ ఫ్యాన్స్‌తో ఉండే పద్ధతి కూడా అలాగే ఉంటుంది. తను నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయేమో కానీ.. అందులో తన పాత్రలు మాత్రం ఆడియన్స్‌ను ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. తాజాగా తను ఒక సినిమా సెట్ నుండి మూడు రోజులకే పారిపోవాలి అనుకున్న విషయాన్ని తాజాగా బయటపెట్టింది.


నటన గుర్తుండిపోతుంది

‘ప్రేమమ్’ అనే మలయాళ చిత్రంతో హీరోయిన్‌గా అడుగుపెట్టింది సాయి పల్లవి (Sai Pallavi). అందులో తను చేసిన మలర్ పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. అలాంటి తను మెల్లగా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో కూడా అడుగుపెట్టింది. ఇక్కడ కూడా ఎనలేని సక్సెస్ చూసింది. తాజాగా శివ కార్తికేయన్ హీరోగా నటించిన ‘అమరన్’ (Amaran)లో హీరోయిన్‌గా నటించి అందరినీ ఆకట్టుకుంది. అందులో మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో శివకార్తికేయన నటన ఎలా అయితే గుర్తుండిపోతుందో.. ఇందు రెబెక్కా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి నటన అంతకంటే ఎక్కువే గుర్తుండిపోతుంది. అలాంటి సాయి పల్లవి తాజాగా తనకు ఎదురైన ఒక చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.


Also Read: అనుష్క బర్త్‌ డేకు స్పెషల్ సర్‌ప్రైజ్ రెడీ.. ‘ఘాటీ’ నుండి కీలక అప్డేట్

అసౌకర్యంగా అనిపించింది

తమిళంలో హీరో సూర్య సరసన ‘ఎన్‌జీకే’ (NGK) మూవీలో నటించింది సాయి పల్లవి. ఆ సినిమాలో సూర్య భార్యగా తనకు మంచి పేరొచ్చింది. ‘ఎన్‌జీకే’ను సెల్వరాఘవన్ డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమా సెట్‌లో అడుగుపెట్టినప్పుడు తనకు మొదట్లో చాలా అసౌకర్యంగా అనిపించిందని చెప్పుకొచ్చింది సాయి పల్లవి. అందుకే మూడు రోజుల తర్వాత సినిమా వదిలేసి వెళ్లిపోదామనుకున్నానని బయటపెట్టింది. ‘‘నేను మొదట్లో ఎన్‌జీకే సెట్‌లో అడుగుపెట్టినప్పుడు నాకు ఆరోగ్యం బాలేక అలా అనిపించిందో ఏంటో తెలియదు కానీ చాలా అసౌకర్యంగా అనిపించింది. ప్రతీ షాట్ తర్వాత సెల్వ సార్‌కు అది నచ్చిందో లేదో సరిగా చెప్పకపోయేవాడు’’ అని వివరించింది సాయి పల్లవి.

ధనుష్ ధైర్యం చెప్పాడు

‘ఎన్‌జీకే’ సినిమాలో తన పర్ఫార్మెన్స్ బాగుందో లేదో తెలియక చాలా ఇబ్బందిపడేదాన్ని అని గుర్తుచేసుకుంది సాయి పల్లవి. అప్పటికే ‘మారి 2’ విడుదల అయిపోయింది కాబట్టి ధనుష్ తనకు తరచుగా ఫోన్ చేసేవాడని, అప్పుడు తన మానసిక పరిస్థితిని తనతో షేర్ చేసుకున్నానని తెలిపింది. ‘‘ధనుష్ నాకు ఫోన్ చేసి సెల్వా షూటింగ్‌లో ఏంటి పరిస్థితి అని అడిగేవాడు. నేను నా భయాలు చెప్పుకుంటే తను నాకు ధైర్యం చెప్పేవాడు. ఏం భయపడకు. ఆయన నీ సహనాన్ని పరీక్షిస్తున్నాడు అనేవాడు’’ అని చెప్పింది. అలా తను ఎంత టాలెంటెడ్ అయినా కూడా ఎప్పటికప్పుడు తనను ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నంలోనే ఉంటుంది సాయి పల్లవి.

Related News

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Big Stories

×