BigTV English

Tamanna Bhatia-Vijay Varma Dating: తమన్నాతో డేటింగ్ ఎప్పుడు మొదలైందో చెప్పిన విజయ్ వర్మ.. మరి పెళ్లి సంగతేంటి?

Tamanna Bhatia-Vijay Varma Dating: తమన్నాతో డేటింగ్ ఎప్పుడు మొదలైందో చెప్పిన విజయ్ వర్మ.. మరి పెళ్లి సంగతేంటి?

tamanna


Vijay Varma-Tamannaah Bhatia Dating: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ తమన్నా ఎంతో మంది తెలుగు స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు ఇలా చాలామంది యంగ్ హీరోలతో జోడీ కట్టి అలరించింది.

దాదాపు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 16ఏళ్లుకు పైగా అవుతున్నా.. ఆమె క్రేజ్ ఎక్కడా తగ్గలేదు. అంతేకాదు రోజు రోజుకు ఆమె మరింత అందంగా మెరిసిపోతోంది. అందం, అభినయంతో సినీ ప్రియుల్ని ఎంతగానో మెప్పించింది. అయితే టాలీవుడ్‌లో సినిమా ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్‌కి మకాం మార్చింది ఈ బ్యూటీ.


అక్కడ కూడా పలు సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంది. అయితే అదే సమయంలో ఓ నటుడితో ప్రేమలో పడింది. గత కొంతకాలంగా ఈ మిల్కీ బ్యూటీ ఆ వ్యక్తితో ప్రేమాయణం చేస్తుంది. అయితే ఆ నటుడు మరెవరో కాదు.. బాలీవుడ్ హీరో విజయ్ వర్మ.

వీరిద్దరూ గతకొంత కాలం నుంచి డేటింగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కెమెరాలకు చిక్కుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. ప్రస్తుతం ఈ జంట డీప్ లవ్‌లో మునిగి తేలుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజాగా నటుడు విజయ్ వర్మ.. తమన్నాతో డేటింగ్ ఎప్పుడు మొదలైందో చెప్పాడు.

Also Read: ఈ రోజు టీవీల్లో సందడే సందడి.. ఏకంగా 60కి పైగా సినిమాలు ప్రసారం.. ఇదిగో ఫుల్ లిస్ట్

విజయ్ వర్మ – సారా అలీ ఖాన్ హీరో హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘మర్డర్ ముబారక్’. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో విజయ్ తమ డేటింగ్‌పై మాట్లాడాడు. ఈ మేరకు తమన్నాతో డేటింగ్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

లస్ట్ స్టోరీ 2 మూవీ చేసినప్పటికీ.. షూటింగ్ సమయంలో తమ మధ్య ఎలాంటి డేటింగ్ మొదలు కాలేదని అన్నాడు. ఈ మూవీ షూటింగ్ తర్వాత ఓ పార్టీ జరిగిందని.. అయితే ఆ పార్టీకి కేవలం నలుగురు మాత్రమే హాజరయ్యారని అన్నాడు. ఇక ఆ సమయంలో తమన్నాతో ఎక్కువ సమయం గడపాలని అనిపించిందని.. ఆ విషయాన్ని ఆమెకు చెప్పానని తెలిపాడు.

ఆ తర్వాత నుంచి తమ ఫస్ట్ డేట్‌కి 20 నుంచి 25 రోజులు పట్టిందని చెప్పుకొచ్చాడు. ఇకపోతే తమన్నా కూడా విజయ్ వర్మను బాగా ఇష్టపడుతోంది. లస్ట్ స్టోరీస్ 2లో విజయ్‌తో కలిసి బోల్డ్ సన్నివేశాల్లో నటించినప్పటికీ.. తనకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని గతంలో తెలిపింది. అంతేకాకుండా విజయ్ ఉన్నంత సేపు ఎంతో సంతోషంగా ఉన్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ జంట పీకల్లోతు ప్రేమలో ఉన్నారు.

Also Read: కామెడీ పాఠాలు చెప్పడానికి ఓటీటీలోకి ‘సుందరం మాస్టర్’ వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే

అయితే ఇంతటి ప్రేమలో ఉన్న ఈ జంట మరి ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో అని అంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాదిలో వీరి వివాహం జరిగే అవకాశముందని చాలా మంది చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు ఈ ఏడాది వివాహబంధంతో ఒక్కటయ్యారు. త్వరలో తమన్నా కూడా తన ప్రియుడు విజయ్ వర్మతో ఏడడుగులు వేయబోతునట్లు గుస గుసలు వినిపిస్తున్నాయి.

Tags

Related News

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big TV Kissik Talks: తిండి లేకుండా బస్టాండ్ లో పడుకున్నాం – జబర్దస్త్ సౌమ్య రావు

Big Stories

×