Boycott Bhairavam : తెలుగు సినిమా పరిశ్రమకి మరియు రాజకీయాలు ఈ రెండింటికి ఒక అవినాభావ సంబంధం ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ రాష్ట్ర రాజకీయాలతో కంప్లీట్ గా ముడిపడి ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరో కావడం. ఒకప్పుడు కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంది. సినిమాకు సరైన టిక్కెట్ రేట్లు లేవంటూ వాపోయింది. దానివలన ఎక్కువగా పవన్ కళ్యాణ్,నాని వంటి హీరోలు మాట్లాడటం వలన ఆ సినిమాలను బాయ్ కాట్ చేయాలి అంటూ అప్పట్లో కొంతమంది సోషల్ మీడియాలో కూడా మాట్లాడేవారు ఇప్పుడు మరోసారి అదే ట్రెండ్ మొదలవుతుంది.
బాయ్ కాట్ భైరవం
బాయ్ కాట్ భైరవం అని ఆంధ్ర ప్రదేశ్ లో ట్రెండ్ అవుతుంది. కారణం… భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ విజయ్ కనకమేడల… స్పీచ్ అని చెప్పాలి. ధర్మం కాపాడటానికి సంవత్సరం క్రితం ఒకడు వచ్చాడు అంటూ పవన్ కళ్యాణ్ గురించి ఇన్ డైరెక్ట్ గా మాట్లాడాడు. అలానే మా సినిమాల్లో కూడా ధర్మాన్ని కాపాడ్డానికి ఒకరు వస్తారు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే సినిమాలకు రాజకీయాలకు సంబంధం లేదు అని చెబుతూనే ఇలా సినిమా ఈవెంట్స్ లో రాజకీయ ప్రస్తావన తీసుకువస్తున్నారు అంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే ఇఫ్పుడు బాయ్ కాట్ భైరవం అని ట్రెండ్ చేసేది యాంటి పవన్ ఫ్యాన్స్.
Also Read : Khaleja 4k : సామి శిఖరం… ఎవ్వరూ ఊహించలేరు… రీ రిలీజ్‌కు ఎన్ని స్క్రిన్స్ అంటే..?
మారని తీరు
మామూలుగా పవన్ కళ్యాణ్ కొన్ని సినిమా ఈవెంట్లకు హాజరైనప్పుడు రాజకీయ ప్రస్తావన తీసుకుని వచ్చేవాళ్ళు. ముఖ్యంగా సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా ఈవెంట్ కి వచ్చి పవన్ కళ్యాణ్ సినిమా గురించి తక్కువ శాతం మాట్లాడి ఎక్కువగా రాజకీయాల గురించే మాట్లాడటం మొదలుపెట్టారు. అది చాలామందికి అలవాటుగా మారిపోయింది. విశ్వక్సేన్ నటించిన లైలా సినిమా ఈవెంట్ లో కూడా 30 ఇయర్స్ పృథ్వి రాజకీయ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆ సినిమా కూడా బాయ్ కాట్ లైలా అంటూ కొన్ని సౌండ్స్ వినిపించాయి. ఇప్పుడు తాజా భైరవం సినిమా కూడా అదే పరిస్థితి ఎదురవుతుంది. ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతుందో కొన్ని రోజుల్లో తెలియనిది. అయితే వీటన్నిటికీ ఎండింగ్ ఉంటుందా లేకపోతే ఇలానే రాజకీయ ప్రస్తావన తీసుకొస్తారా అనేది ఆలోచించాల్సిన విషయం.
Also Read : Ajay Bhupathi : సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరో, బాధ్యతలు చేపట్టిన అజయ్ భూపతి