Nayanthara: మామూలుగా డాక్యుమెంటరీలు తెరకెక్కిస్తున్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో కనిపించే ప్రతీ వ్యక్తి దగ్గర అనుమతి తీసుకోవాలి. అలాగే ప్రతీ సినిమా, అందులోని సీన్ విషయంలో కూడా అందరి దగ్గర అనుమతి తీసుకుంటూ రావాలి. అలాగే అందరి అనుమతితో నయనతార (Nayanthara) కూడా తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌పై డాక్యుమెంటరీ తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. అదే ‘నయనతార బియాండ్ ది ఫెయిరీటైల్’. తాజాగా దీని చుట్టూ మరొక కాంట్రవర్సీ క్రియేట్ అయ్యిందని వార్తలు వైరల్ అవుతుండగా మేకర్స్.. దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాము డబ్బులు డిమాండ్ చేయలేదంటూ ఓపెన్ స్టేట్‌మెంట్ విడుదల చేశారు.
అంతా అబద్ధం
‘నయనతార బియాండ్ ది ఫెయిరీటైల్’ డాక్యుమెంటరీలో ధనుష్ అనుమతి లేకుండా ‘నానుమ్ రౌడీ దాన్’ షూటింగ్ ఫోటోలను ఉపయోగించినందుకు తను లీగల్‌గా నోటీసులు పంపించాడు. డబ్బులు కూడా డిమాండ్ చేశాడు. ఈ కాంట్రవర్సీ చాలాకాలం పాటు నడిచింది. ఇప్పటికీ ఈ గొడవకు ఫుల్ స్టాప్ పడలేదు. ఇదే సమయంలో ‘చంద్రముఖి’ సినిమా నుండి ఒక సీన్‌ను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారని, దానికి కూడా నయనతార అసలు అనుమతి తీసుకోలేదని వార్తలు వైరల్ అయ్యాయి. ఈ విషయంలో ‘చంద్రముఖి’ మేకర్స్ కూడా రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో రచ్చ మొదలయ్యింది. దానిపై వారే స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
Also Read: ఆ సినిమా వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను, అప్పుడే నిర్ణయించుకున్నాను.. మీనాక్షి కామెంట్స్
అనుమతి ఇచ్చాం
‘నయనతార బియాండ్ ది ఫెయిరీటైల్’ (Nayanthara Beyond The Fairytale) డాక్యుమెంటరీని తన సొంత నిర్మాణ సంస్థ అయిన రౌడీ పిక్చర్స్ నిర్మించింది. అయితే ‘చంద్రముఖి’ని నిర్మించిన శివాజీ ప్రొడక్షన్స్.. రౌడీ పిక్చర్స్ నుండి డబ్బులు డిమాండ్ చేసిన విషయాన్ని కొట్టిపారేసింది. ఈ డాక్యుమెంటరీలో తమ సినిమాకు సంబంధించిన సీన్‌ను ఉపయోగించుకోవడానికి అనుమతి ఇచ్చామని స్వయంగా ప్రకటించింది. నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా అందించామని తెలిపింది. ఆ సీన్‌ను ఉపయోగించడం వల్ల రౌడీ పిక్చర్స్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని క్లారిటీ ఇచ్చింది. ఇంకా ఈ విషయంపై క్లారిటీ కావాలంటే స్వయంగా తమతోనే డీల్ చేసుకోమని చెప్పింది శివాజీ ప్రొడక్షన్స్.
కాస్త రిలీఫ్
నయనతార డాక్యుమెంటరీకి మరొక లీగల్ నోటీసు అందిందని వార్తలు బయటికి రాగానే ఫ్యాన్స్‌లో కంగారు మొదలయ్యింది. ఈ డాక్యుమెంటరీలో ఎన్నో ప్రొఫెషనల్, పర్సనల్ విషయాలను పంచుకొని అభిమానులను హ్యాపీ చేసింది నయన్. అలాంటిది దీని చుట్టూ ఇన్ని కాంట్రవర్సీలు ఎందుకు క్రియేట్ అవుతున్నాయని ఫీలయ్యారు. మొత్తానికి కోలీవుడ్‌లో వినిపిస్తున్న వార్తలు అబద్ధాలు అని తెలియగానే కాస్త రిలీఫ్ ఫీలవుతున్నారు. ‘నయనతార బియాండ్ ది ఫెయిరీటైల్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఫ్యాన్స్‌ను మాత్రం మెప్పించగలిగినా మామూలు ప్రేక్షకులు మాత్రం దీనిపై ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. ఇది డాక్యుమెంటరీలాగా లేదని, అసలు ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏముందని నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నయన్ లైఫ్‌లో ప్రేక్షకులకు తెలియని కొత్త విషయాలు ఏమీ లేవని డాక్యుమెంటరీ ద్వారా ప్రూవ్ అయ్యింది.
Chandramukhi team claiming ₹5⃣ cr compensation from Nayanthara netflix documentary is UNTRUE✖️ pic.twitter.com/FD7VfdCc4X
— Manobala Vijayabalan (@ManobalaV) January 6, 2025