Malavika Mohanan: పాన్ ఇండియా స్టార్లుగా పేరు తెచ్చుకున్న తర్వాత హీరోలు చేసే ప్రతీ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉంటాయి. ప్రస్తుతం ప్రభాస్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రభాస్ ఏ సినిమాలో నటించినా అది హిట్ అని ఫ్యాన్స్ ముందుగానే ఫిక్స్ అయిపోతున్నారు. అలాగే ‘రాజా సాబ్’పై కూడా చాలామందికి నమ్మకం ఉంది. ఇప్పటివరకు ఏ స్టార్ హీరోను హ్యాండిల్ చేయలేదు కాబట్టి మారుతీ దర్శకత్వంలో ఈ మూవీ ఎలా ఉంటుందో అని కొందరిలో ఆందోళన కూడా ఉంది. వాటన్నింటికి ఒక క్లారిటీ ఇస్తూ అసలు ‘రాజా సాబ్’ ఎలా ఉంటుందో వివరించింది హీరోయిన్ మాళవికా మోహనన్ (Malavika Mohanan).
మంచి ఛాలెంజ్
తమిళ, మలయాళ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన మాళవికా మోహనన్.. ‘రాజా సాబ్’తో తెలుగులో డెబ్యూకు సిద్ధమయ్యింది. తాజాగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడం, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్‌తో నటించడంపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. అంతే కాకుండా తనకు ఎదురైన కొత్త ఛాలెంజ్‌ల గురించి కూడా మాట్లాడింది. ‘‘ప్రతీ కొత్త ఇండస్ట్రీ ఛాలెంజ్‌లాగానే ఉంటుంది. కానీ అది మంచి ఛాలెంజే. ఆ ఇండస్ట్రీలో అందరూ చెప్పే రూల్స్‌తో పాటు ఎవరూ చెప్పని రూల్స్ గురించి కూడా తెలుస్తుంది. అదంతా కొత్త ప్రాంతం, కొత్త కల్చర్. నేను చిన్నప్పటి నుండి సినిమాల్లోనే ఉన్నాను కాబట్టి కొత్త ప్రాంతానికి అలవాటు పడడం నాకు ఈజీ’’ అని చెప్పుకొచ్చింది మాళవికా.
హీరోయిన్‌గా ప్రాధాన్యత
‘‘నాకు తెలుగు అంటే చాలా ఇష్టం. రాజా సాబ్ (Raja Saab) అనేది ఒక హారర్ కామెడీ. నేను ముందెప్పుడూ ఈ జోనర్‌లో నటించలేదు కాబట్టి చాలా ఎగ్జైటెడ్‌గా ఉంది. ఇందులో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటంటే మామూలుగా సినిమాల్లో హీరోలకు ప్రాధాన్యత ఉంటుంది. హీరోయిన్ల పాత్ర చాలా చిన్నగా ఉంటుంది. కానీ రాజా సాబ్‌లో అలా కాదు. ఈ సినిమాలో హీరోయిన్ ప్రతీ ప్లేస్‌లో ఉంటుంది. మంచి పాత్రతో పాటు మంచి సీన్స్ కూడా ఉంటాయి. ఇలాంటి పెద్ద సినిమాల్లో అలాంటి పాత్రలు ఉండడం అనేది అరుదు. నాకు నా పాత్ర చాలా నచ్చింది. దర్శకుడు మారుతీ కూడా చాలా మంచివారు. నేను బాహుబలికి పెద్ద ఫ్యాన్. ప్రభాస్‌తో ఎప్పటినుండో పనిచేయాలని అనుకున్నాను’’ అని వివరించింది మాళవికా మోహనన్.
Also Read: టాలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్స్ అంతా ఔటేనా.?
‘సలార్’లో ఛాన్స్
‘‘ముందుగా సలార్‌లో కూడా హీరోయిన్‌గా తీసుకోవడానికి చర్చలు జరిగాయి. కానీ ఆ చర్చలు సఫలం కాలేదు. డిసప్పాయింట్ అయ్యాను. కానీ కొన్ని నెలల్లోనే నాకు రాజా సాబ్ ఆఫర్ వచ్చింది. ప్రభాస్ (Prabhas) చాలా సపోర్ట్ చేస్తాడు. సౌకర్యంగా ఫీలయ్యేలా చేస్తాడు. తన మాటల్లో మంచితనం ఉంటుంది. చాలా ఫుడ్ పంపిస్తాడు. గ్రాండ్‌గా చాలా బిర్యానీతో వెల్‌కమ్ చెప్తాడు. నాకు మాత్రమే కాదు.. నా టీమ్ మొత్తానికి ఫుడ్ పంపించాడు. తన కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. దశాబ్దంగా తన కామెడీ టైమింగ్‌ను మిస్ అవుతున్నాం’’ అని ‘రాజా సాబ్’ ఎక్స్‌పీరియన్స్ గురించి చెప్పుకొచ్చింది మాళవికా.