Chiranjeevi: ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోలుగా, హీరోయిన్లుగా ఎదిగిన వారిపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. పైగా అలాంటి వారే చాలామంది ఇన్‌స్పిరేషన్ కూడా అవుతారు. ప్రతీ జెనరేషన్‌లో అలాంటి స్టార్ ఒక్కరైనా ఉంటారు. మునుపటి జెనరేషన్‌కు అలాంటి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిన హీరో చిరంజీవి. ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి మెగాస్టార్‌గా మారారు చిరంజీవి. అప్పటినుండి ప్రేక్షకుల మనసులో ఆయన మెగాస్టార్‌గానే నిలిచిపోయారు. ఇప్పటికే భారీ ఫ్యాన్ బేస్‌తో తెలుగులో సాటిలేని హీరోగా వెలిగిపోతున్నారు చిరు. అలాంటి ఈ స్టార్ హీరో.. అసలు తన కెరీర్ ఎక్కడ మలుపు తిరిగింది అనే విషయాన్ని తాజాగా బయటపెట్టారు.
అదే మలుపు
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారన్న విషయం అందరికీ తెలుసు. కానీ అసలు ఆయన సినీ ప్రయాణం ఎక్కడ మొదలయ్యింది అనే విషయం మాత్రం చాలామందికి తెలియదు. కాలేజ్‌లో చదువుతున్న రోజుల్లోనే నటన అంటే చిరంజీవికి విపరీతమైన ఆసక్తి ఉండేది. అందుకే అప్పట్లోనే కాలేజ్ స్టేజ్‌పై జరుగుతున్న నాటకాల్లో యాక్టర్‌గా కనిపించేవారు చిరు. తాను బీకామ్ చదువుతున్న రోజుల్లో ఒక నాటకంలో నటించినందుకు కాలేజ్.. తనకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ కూడా అందించింది. 1974 – 75లో జరిగిన ఈ ఘటన తన జీవితాన్నే మార్చేసిందని తాజాగా బయటపెట్టారు చిరంజీవి. ఇది చూసిన ప్రేక్షకులు.. అప్పటికీ, ఇప్పటికీ ఆయన బెస్ట్ యాక్టర్‌గానే వెలిగిపోతున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాలేజ్‌లో నాటకం
అసలు కాలేజ్‌లో నాటకం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అప్పుడు తన మైండ్‌లో ఏం రన్ అయ్యింది అనే విషయాన్ని తాజాగా ఒక వీడియోలో వివరించారు చిరంజీవి. ‘‘ఆరోజు అసలు కాలేజ్‌లో నేను ఆ స్టేజ్ ఎక్కకపోయింటే ఏమయ్యిండేది అని నేను ఆలోచిస్తూ ఉంటాను. అసలు నేను నా కలలకు భయపడి ఉంటే ఏమయ్యిండేది అని ఆలోచిస్తూ ఉంటాను. నేను ఆంధ్రప్రదేశ్‌లోని చిన్న గ్రామం అయిన మొగల్తూరు నుండి పెద్ద కలలతో ఇండస్ట్రీకి వచ్చానని మీలో చాలామందికి తెలుసు. కాలేజ్‌లో చేసిన ఒక చిన్న నాటకంతో సినిమాల్లో నా ప్రయాణం మొదలయ్యింది. అప్పుడు లైట్లు లేవు, ఫ్రేమ్ లేదు. నా మనసులో కల మాత్రమే ఉంది. అదే నా మొదటి అడుగు’’ అని గుర్తుచేసుకున్నారు మెగాస్టార్.
Also Read: ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ సినిమాలు ఒకేసారి రిలీజ్ కావడంపై నాని రియాక్షన్
టర్నింగ్ పాయింట్
‘వేవ్స్’ (Waves) అనేది కూడా ఇలాంటి పెద్ద పెద్ద కలలు ఉన్న చాలామందికి ఒక మొదటి అడుగు లాంటిదే అని చెప్పుకొచ్చారు చిరంజీవి. ‘‘ఇక్కడ కలలు నిజమవుతాయి. టాలెంట్‌కు అవకాశాలు వస్తాయి. మీకు ఇప్పుడే అర్థం కాకపోయినా ఇది మీకు ఒక టర్నింగ్ పాయింట్ కావచ్చు’’ అంటూ యువతను ప్రోత్సహించారు. మొత్తానికి టాలెంట్ ఉన్నా కూడా గ్లామర్ ప్రపంచంలో తమ ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టాలో, ఎక్కడ నుండి మొదలుపెట్టాలో తెలియని వారికి ‘వేవ్స్’ అనేది ఒక ప్లాట్‌ఫామ్ కావాలని చిరు తెలిపారు. అలా టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు అందించడం కోసమే ఆయన ‘వేవ్స్’తో చేతులు కలిపారు.
Actor @KChiruTweets shares how #WAVES can help dreams take flight — and why it could be a life-changing platform for many.#WAVES2025 #WAVESIndia #WAVESummit #WAVESummitIndia #WAVESBazaar #WaveX #ConnectingCreatorsConnectingCountries @AshwiniVaishnaw @Murugan_MoS… pic.twitter.com/yLYs4tYdQh
— Ministry of Information and Broadcasting (@MIB_India) April 22, 2025