Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఎట్టకేలకు డ్యామేజ్ కంట్రోల్ చర్యలని మొదలు పెట్టారు. కొన్నాళ్ల క్రితం వారసత్వంపై ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వివాదాన్ని కూల్ చేసే విధంగా ఆయన ఉమెన్స్ డే స్పెషల్ గా ఓ ప్రత్యేకమైన వీడియోను రిలీజ్ చేశారు. మరి ఆ వీడియోలో ఏముంది? వారసత్వం వివాదం సద్దుమణిగినట్టేనా? అనే వివరాల్లోకి వెళ్తే…
ఉమెన్స్ డే స్పెషల్ వీడియోతో డ్యామేజ్ కంట్రోల్ చర్యలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం (Womens Day 2025) సందర్భంగా ‘మెగా ఉమెన్’ (Mega women) పేరుతో ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. అందులో చిరు తల్లి అంజనా దేవి, సోదరీమణులు, సోదరుడు నాగబాబుతో కలిసి ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ వీడియోలో చిరంజీవి తన ఎర్లీ లైఫ్ కు సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు. అందులో తనకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడే ఒళ్లంతా మసి పూసుకోవడం వల్ల, తనను చూసి అమ్మ గుర్తుపట్టలేదని, వీడు మా అబ్బాయి కాదు అని చెప్పేసిందని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక తనను తాళ్లతో కట్టేసిందని అన్నారు.
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తమ ఇంట్లో స్పెషల్ కిడ్ అని, అతను సరిగ్గా తినకపోవడం వల్ల అమ్మ నాన్న బాగా గారాబం చేసేవారని నాగబాబు చెప్పుకొచ్చారు. అలాగే ఈ వీడియోలో చిరంజీవి చిన్న వయసులోనే అనారోగ్యం కారణంగా తన సోదరి చనిపోవడం వంటి విషయాలను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి ఇద్దరు సోదరీమణులు కూడా తల్లితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని, ఆమె తమకు ఇచ్చే సపోర్ట్ ని వెల్లడిస్తూ ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. ఉమెన్స్ డే సందర్భంగా విడుదలైన మెగా ఉమెన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోని చూసిన చాలా మంది చిరంజీవి డ్యామేజ్ కంట్రోల్ చర్యలు మొదలు పెట్టారని కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం అంతకుముందు చిరంజీవి వారసత్వంపై చేసిన కామెంట్స్ వివాదాస్పదం కావడమే.
వారసత్వంపై చిరంజీవి కామెంట్స్ వివాదం
‘బ్రహ్మా ఆనందం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా హాజరైన చిరంజీవి, ఆ ఈవెంట్లో వారసుడు కావాలంటూ చేసిన కామెంట్స్ నేషనల్ వైడ్ గా తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈవెంట్లో చిరంజీవి తన మనవరాళ్ల గురించి ప్రస్తావిస్తూ ఇంట్లో ఉంటే ఉమెన్స్ హాస్టల్ లా ఉంటుందని, దానికి తను వార్డెన్ లా ఫీల్ అవుతానని కామెంట్ చేశారు. అంతేకాకుండా రాంచరణ్ కి వారసత్వం కోసం ఈసారి వారసుడిని కనమని సలహా ఇచ్చానని అన్నారు. ఆయన ఫన్నీగా ఈ కామెంట్స్ చేసినప్పటికీ తీవ్ర స్థాయిలో వివాదం చెలరేగింది.
ఇప్పుడు ఉమెన్స్ డే సందర్భంగా ఈ స్పెషల్ వీడియోని రిలీజ్ చేసి వివాదాన్ని కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మెగాస్టార్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పైగా “నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు” అంటూ చిరు చేసిన పోస్ట్ కూడా అందుకేననే కామెంట్స్ విన్పిస్తున్నాయి. ఇప్పటిదాకా వివాదంపై స్పందించని చిరు, సైలెంట్ గా వుమెన్స్ డేను వాడుకుని కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రయత్నించారు అంటున్నారు.
నా నిజ జీవితాన్ని, నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన
నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ
మహిళా దినోత్సవ ♀ శుభాకాంక్షలు. 💐🙏#HappyWomensDay pic.twitter.com/j5qtSrtIAC— Chiranjeevi Konidela (@KChiruTweets) March 7, 2025