Dada Saheb Phalke: గత రెండు రోజుల నుండి సోషల్ మీడియాని షేక్ చేస్తున్న న్యూస్ ఏంటంటే రాజమౌళి (Rajamouli) డైరెక్షన్లో ఎన్టీఆర్ (NTR ) దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ లో ఫాల్కే పాత్రలో నటిస్తున్నారని సోషల్ మీడియాలో ఎన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయో చెప్పనక్కర్లేదు.. రాజమౌళి డైరెక్షన్లో మేడ్ ఇన్ ఇండియా అనే పేరుతో దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారంటూ సోషల్ మీడియా మొత్తం కోడై కూయడంతో తాజాగా ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు దాదాసాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్.. మరి ఇంతకీ ఆయన ఏమని క్లారిటీ ఇచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం.. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ గా ఉన్న దాదాసాహెబ్ ఫాల్కే అంటే తెలియని వారు ఉండరు. ముఖ్యంగా ఇండియాలో సినిమాలు రావడానికి కారణమే దాదాసాహెబ్ ఫాల్కే గారు. అంతేకాదు ఈయన్ని భారతీయ సినిమా పితామహుడు అని కూడా అంటారు.
దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తో రాజమౌళి.
అలా ఈయన సినీ రంగానికి చేసిన కృషికి గానూ ఈయన పేరిట దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులను ఇవ్వడం కూడా మొదలుపెట్టారు కేంద్ర ప్రభుత్వం. అయితే దాదాసాహెబ్ పాల్కే 1913లో హరిచంద్ర అనే మూవీని తీశారు. ఈయన కేవలం డైరెక్టర్ గానే కాకుండా ప్రొడ్యూసర్ గా, ఎడిటర్ గా,స్క్రీన్ రైటర్ గా,మేకప్ ఆర్టిస్ట్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా,ఆర్ట్ డైరెక్టర్ ఇలా సినిమాలకు సంబంధించిన ప్రతి ఒక్క విభాగంలో వర్క్ చేశారు. అయితే అలాంటి దాదాసాహెబ్ ఫాల్కే సినిమా రంగానికి చేసిన సేవలన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం రాజమౌళి మేడ్ ఇన్ ఇండియా అనే సినిమా ద్వారా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వినిపించాయి. అంతేకాదు ఈ బయోపిక్ లో ఎన్టీఆర్ ఫాల్కే పాత్రలో నటించబోతున్నారని కూడా వార్తలు వినిపించాయి.అయితే గత రెండు రోజులు నుండి సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వార్తలపై తాజాగా క్లారిటీ వచ్చింది.
పుకార్లపై స్పందించిన ఫాల్కే మనవడు.
ఈ వార్తలపై తాజాగా స్పందించిన ఫాల్కే మనవడు చంద్రశేఖర్ అసలు మా దగ్గరికి రాజమౌళి రాలేదని, మా తాత బయోపిక్ ఆయన తీయడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ఒక బయోపిక్ తీయాలి అంటే ఆ కుటుంబ సభ్యుల నుండి వారికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించాలి. కానీ అలా జరగలేదు. మమ్మల్ని రాజమౌళి సంప్రదించలేదు. అలాగే గత మూడు సంవత్సరాల నుండి దాదాసాహెబ్ ఫాల్కే గురించి అమీర్ ఖాన్ బృందం పరిశోధన చేస్తున్నారు. అమీర్ ఖాన్ మమ్మల్ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఈ బయోపిక్ పై మూడు సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి.కానీ రాజమౌళి బృందం ఇప్పటివరకు మమ్మల్ని కలవలేదు అంటూ దాదాసాహెబ్ ఫాల్కే మనవడు చంద్రశేఖర్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈయన క్లారిటీతో రాజమౌళి ఎన్టీఆర్ కాంబోలో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ రాబోతోంది అనే వార్తలు రూమర్లే అని తేలిపోయాయి.
Samantha: అమ్మను గుర్తు చేసుకుని స్టేజ్‌పైనే ఎమోషనల్ అయిన సమంత