Dasari Narayana Rao: టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు దర్శకతీరుడు దాసరి నారాయణరావు. ఈయన నటుడిగా, దర్శకుడుగా, నిర్మాతగా పలు సినిమాల తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఎందరో నటులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఈయనకే దక్కుతుంది. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల మనసును తాకాయి. ప్రస్తుతం ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జరిగే ఎక్కించిన సినిమాలు ప్రేక్షకులు మనసులో ఇప్పటికీ అలానే ఉండిపోయాయి. ఆయన చనిపోయి ఇన్నేళ్లు అయిన తర్వాత ఆయన బాల్యం గురించి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
దాసరి బాల్యం కన్నీళ్లమయం…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎందరో డైరెక్టర్లు ఉన్నా కూడా దాసరి నారాయణరావు కు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.. మోహన్ బాబు లాంటి ఎంతోమంది స్టార్ హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసిన మహనీయుడు. ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత ఆయన జీవితం పూర్తిగా మారిపోయింది. కానీ అంతకుముందు ఆయన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించారని గతంలో కొన్ని సందర్భాలలో బయటపెట్టారు. ఆయన బాల్యంలో తినడానికి కూడా తిండి లేకపోవడంతో ఆకలి తప్పులతో కడుపు నింపుకోవాల్సి వచ్చిందని, గతంలో ఓ ఇంటర్వ్యూలో దాసరి నారాయణరావు అన్నారు..
ఈయన బాల్యంలో ఉన్నప్పుడు వాళ్ళ పెద్ద నాన్నకు పొగాకు వ్యాపారం ఉండేదట. కుటుంబమంతా ఆ వ్యాపారంలో వచ్చిన లాభాలతో సంతోషంగా గడిపేవారు.. ఓ సందర్భంలో పొగాకు మొత్తం అగ్గి కి ఆహుతి అవడంతో కుటుంబం రోడ్డున పడింది. అప్పట్లో ఇన్సూరెన్సులు ఉండేవి కాదు. దాంతో ఆర్థికంగా చాలా దెబ్బతిన్నారు దాసరి కుటుంబం . ఆ కష్టకాలంలోనే పొలాలు కూడా అమ్మేయాల్సి వచ్చింది.. వాళ్ళ నాన్న కాలంలో బడికి వెళ్లి ఎవరు చదివింది లేదు. దాసరిని పై చదువులు చదివించాలని వాళ్ళ నాన్న ఎన్నో కలలు కనేవాడట. అలా ఆరో తరగతి కొచ్చేసరికి వారి ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింది. స్కూలు ఫీజు మూడుంపావలా కట్టడానికి కూడా డబ్బులేక ఆయన్ను బడి మాన్పించేశారు. ఆ తర్వాత పరిస్థితి దయనీయంగా మారడంతో వడ్రంగి పనికి అసలు నీ పంపించేవారట.. నెల అంతా వడ్రంగి పని చేస్తే వచ్చే జీతం ఒక్క రూపాయి. ఆరో తరగతి వరకు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతూ వచ్చిన దాసరికి ఆ తర్వాత చదువు కష్టంగా మారింది. ఆయనకు పాఠాలు చెప్పే ఒక మాస్టర్ సాయంతో పై చదువులు పూర్తి చేశారని గతంలో ఓ ఇంటర్వ్యూలో దాసరి అన్నారు. అలా సినిమాల్లోకి రావాలని ఆసక్తి ఉండడంతో ఇటుగా అడుగులు వేసి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఒక్కో మెట్టు ఎదుగుతూ నెంబర్ వన్ దర్శకుడుగా పేరు పొందారు.
Also Read :కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో శృతి హాసన్ పెళ్లి ఫిక్స్..?
దాసరి తెరకెక్కించిన చిత్రాలు..
రచయితగా, దర్శకుడుగా, నిర్మాతగా రాణించారు. ఆయన ఇప్పటివరకు తెరికెక్కించిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి అని చెప్పడంలో సందేహం లేదు. ఎందరో హీరోలను హీరోయిన్లను తన సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత ఆయనదే.. ఎక్కువ సినిమాలు తీసిన దర్శకుడిగా గిన్నిస్ బుక్ రికార్డ్స్ లోకి ఎక్కారు.. వరుసగా 6 సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులను దక్కించుకున్నా.. తన సినిమాలతో సామాజిక రుగ్మతలను ప్రశ్నించినా.. అది ఆయనకే చెల్లుతుంది… ప్రస్తుతం ఆయన మనమధ్య లేకున్నా కూడా ఆయన సినిమాలతో మరోసారి గుర్తు చేసుకుందాం..