అయితే ఈ రెండు థియేటర్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడుకి చెందినవైనప్పటికి రెవెన్యూ అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించి థియేటర్లను సీజ్ చేశారు. భారీ కలెక్షన్స్ వస్తున్న నేపథ్యంలో ఈ విధంగా థియోటర్లు సీజ్ చేయడం వల్ల సినిమాకి, కలెక్షన్స్‌కి గట్టి దెబ్బపడుతోందని అల్లు అర్జున్ ఫాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా సరే తాళాలు తీయాలి, సినిమా ప్రదర్శించాని అల్లు అభిమానులు థియేటర్ దగ్గర గొడవకు దిగారు. నిర్భందనలు అమలు చేయకపోతే తమ పార్టీకి సంబంధించిన వారు, ఎవరైనా సరే కఠినంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే..
ఇదిలా ఉంటే.. పుష్ప పార్ట్ 2 రిలీజ్ కు ముందు నుంచే..అల్లుఅర్జున్ కి ఊహించని ఎదురు దెబ్బ తగులుతున్నాయి. టికెట్ల ధర పెంపుపై హైకోర్టులో పిటిషన్. ఈ సందర్భంగా మరో నాలుగు ప్రశ్నలు. బెనిఫిట్ షో డబ్బులు ఎక్కడికెళ్తాయి? ఇక డిసెంబర్ 5- 23 వరకూ ఇన్ని రోజుల పాటు.. ధరల పెంచడం ఎలా సాధ్యం? వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టామంటున్నారు కదా? ఆ మొత్తానికి లెక్కలేవి? ఇన్నేసి సబ్సిడీలు పొందుతున్న ఈ సినిమా తెలంగాణలో 20 శాతం మేర షూటింగ్ జరుపుకుందా? అంటూ హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి.
ఇవన్నీ ఇలా ఉంటే ప్రీమియర్ షో రోజు సంధ్యా థియేటర్ కి స్వయానా అల్లు అర్జున్ వెళ్లడంతో.. అక్కడ తొక్కిసలాట జరిగి.. రేవతి అనే వివాహిత మరణించడంతో పాటు ఆమె కొడుకు శ్రీ తేజ్ తీవ్ర గాయాలపాలై ప్రస్తుతం కోమాలోకి వెళ్లడం. అలా వెళ్లడంతో ప్రస్తుతం ఆ ఇంట్లో తీవ్ర విషాదకరమైన వాతావరణం.
Also Read: బన్నీకి 15 ఏళ్లు రాజయోగం… పుష్ప 2 రిలీజ్ తర్వాత జ్యోతిష్యం చెప్పిన వేణు స్వామి..!
ఒక పక్క ఈ సినిమా కారణంగా ఒక చావు నమోదైతే.. మీరు సంబరాలు జరుపుకుంటారా? అంటూ సోషల్ మీడియాలో బీభత్సమైన చర్చ. అప్పటికి మైత్రీ మూవీస్ బాలుడి చికిత్స బాధ్యతలు మొత్తం తాము తీసుకుంటామని ప్రకటించినా.. పరిస్థితిలోని తీవ్రత ఎంత మాత్రం తగ్గలేదు. ఈ దుర్ఘటనకు అల్లు అర్జునే కారణమంటూ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 105 ప్రకారం కేసు నమోదు కాగా.. ఇది రుజువైతే పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం కనిపించడం మరో వివాదాస్పద అంశం.
ఇవిలా ఉంటే.. సినిమా బాగుంది బాగలేదు. అన్నది మరో హాట్ టాపిక్. ఒక రెండు మూడు ఎపిసోడ్లు తప్ప సినిమా పెద్ద బాగాలేదనీ. ఈ మాత్రం సినిమాకు ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేయడం దండగమారి వ్యవహారమంటూ మరో రచ్చ రచ్చ.
పాన్ ఇండియా లెవల్లో పుష్ప సినిమా ప్రదర్శితమవుతున్న హాళ్లు పూర్తి ఖాళీగా కనిపిస్తున్నాయంటూ ఇంకో ఇష్యూ. సినిమా బాగాలేదు కాబట్టే.. ఇలా జరిగిందంటూ.. కొందరు యాంటీ పుష్పరాజ్ వాయిస్ వినిపిస్తూ గొడవ గొడవ.
ఆఖరికి అల్లు అర్జున్‌కి పుష్ప సినిమా ద్వారా జాతీయ ఉత్తమ నటుడు కావడం కూడా వివాదాస్పదంగా మారింది. ఆ టైంలో వచ్చిన పాజిటివ్ కేరెక్టర్ జై భీమ్ కి ఇవ్వాల్సింది స్మగ్లర్ పుష్పరాజ్ కేరెక్టర్ కి అవార్డు ఇవ్వడమేంటని తీవ్ర స్థాయిలో దుమారం చెలరేగింది.
ఎప్పుడైతే అల్లు అర్జున్ నంధ్యాల వెళ్లి వైసీపీ లీడర్ కి సపోర్ట్ చేశాడో.. అనాటి నుంచి అల్లు అర్జున్ ఆయన నటించిన పుష్పరాజ్ సినిమా రాజకీయ రంగు పులుముకుని.. తద్వారా జనసేన లీడర్ల నుంచి వార్నింగులు రావడం వరకూ వివాదాల పంరంపర ఆగనే లేదు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ఒక సినిమా కారణంగా ఒక నిండు ప్రాణం బలికావడమే అత్యంత విషాదకరమైన వివాదంగా మారింది. మరి ఈ కేసు నుంచి అల్లు అర్జున్ ఎలా బయట పడ్డా.. మృతురాలి ఇంట్లో నెలకొన్న విషాదం.. మాత్రం ఎవ్వరూ పూడ్చలేనిది. ఆ ప్రాణం తిరిగి తీసుకురాలేనిది. ఈ సినిమా మా ఇంటి వినాశనానికే వచ్చిందా? అంటూ.. మృతురాలి అత్తయ్య అనడం అత్యంత బాధాకరం.
ఇంటి వారసుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి వైద్యానికి ఎంత మాత్రం సహకరించడం లేదని. అతడు ఇప్పటికీ కోమాలో ఉన్నాడనీ అంటున్నారు వైద్యులు. అప్పటికీ తమపై పడ్డ నింద తుడుచుకోడానికి.. చిత్ర బృందం.. బాలుడున్న ఆస్పత్రికి వెళ్లినా.. ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ పూడ్చలేరన్న అభిప్రాయం వెలువడుతోంది సర్వత్రా.