World No Tobacco Day 2025: ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం 2025 ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పొగాకు తీసుకోవడం వల్ల కలిగే వ్యాధులు, మరణాలను అరికట్టడానికి 1987 లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. మొదటిసారిగా, అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని 1988 మే 31న జరుపుకున్నారు. దీని తర్వాత .. ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం ప్రారంభించారు. ఇదిలా ఉంటే ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం 2025 చరిత్ర, ప్రాముఖ్యతను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 31న జరుపుకుంటారు. పొగాకు వినియోగం వల్ల కలిగే హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, పొగాకు మానేయడానికి వారిని ప్రేరేపించడం ఈ దినోత్సవ ఉద్దేశ్యం.
పొగాకు రహిత దినోత్సవ చరిత్ర:
పొగాకు తీసుకోవడం వల్ల కలిగే వ్యాధులు, మరణాలను అరికట్టడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) 1987 లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. మొదటిసారిగా, అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని 1988 మే 31న జరుపుకున్నారు. దీని తర్వాత, ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం ప్రారంభించారు.
పొగాకు నిరోధక దినోత్సవం యొక్క ప్రాముఖ్యత:
1. పొగాకు వల్ల ప్రపంచంలో ప్రతి సంవత్సరం 8 మిలియన్లకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి.
2. ఈ రోజు పొగాకు ప్రమాదాల గురించి, క్యాన్సర్, గుండె జబ్బులు, స్ట్రోక్, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు వంటి దాని సంబంధిత వ్యాధుల గురించి అవగాహన కల్పించడం.
3. ఇది ముఖ్యంగా యువత , పిల్లలకు పొగాకుకు దూరంగా ఉండాలనే సందేశాన్ని ఇస్తుంది.
ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం 2025 యొక్క థీమ్:
WHO ప్రతి సంవత్సరం ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవానికి ఒక థీమ్‌ను నిర్దేశిస్తుంది. 2025 సంవత్సరానికి ఇతివృత్తం “పొగాకు ఉత్పత్తుల ఆకర్షణను తగ్గించడం”.
Also Read: తలస్నానం చేస్తున్నప్పుడు జుట్టు రాలుతోందా ? అస్సలు ఇలా చేయొద్దు
పొగాకు వాడకం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలు:
ఊపిరితిత్తులు, నోరు, గొంతు, కడుపు మొదలైన వాటికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.
గుండె సంబంధిత వ్యాధులు కూడా రావచ్చు.
శ్వాస సమస్యలు ఉంటాయి.
పొగాకు వాడకం వల్ల పురుషులు, స్త్రీలలో సంతానోత్పత్తి సమస్యలు వస్తాయి.
అకాల మరణం సంభవించే ప్రమాదం ఉంది.