BigTV English

Ajay Bhupathi: ‘మంగళవారం’ డైరెక్టర్‌ అజయ్ భూపతికి అరుదైన ఘనత

Ajay Bhupathi: ‘మంగళవారం’ డైరెక్టర్‌ అజయ్ భూపతికి అరుదైన ఘనత

Ajay Bhupathi: కొన్ని సినిమాలు ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి హిట్లు కొడుతుంటాయి. అలాంటి హిట్లు కొట్టి ఎన్నో అవార్డులను కూడా కైవసం చేసుకుంటుంటాయి. ఈ కోవలోకి ఇప్పటికి ఎన్నో సినిమాలు వచ్చాయి. గతేడాది వచ్చిన ‘బలగం’ ముఖ్య నిదర్శనం.


ఒక చిన్న సినిమాగా.. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతో మంది ప్రేక్షకుల్ని ఏడిపించింది. అందులో ఉండే డెప్తె ఎమోషన్‌కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. దర్శకుడు వేణు ఒక సామన్య కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి.. తన సినిమాని ఎలా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారో పసిగట్టి తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అంతేకాకుండా సినిమాతో సహా, డైరెక్టర్‌గా కూడా ఎన్నో అవార్డులను సొంతం అందుకున్నాడు.

అయితే ఇప్పుడు ఇదే బాటలోకి మరో డైరెక్టర్ వచ్చాడు. అతడే డైరెక్టర్ అజయ్ భూపతి. ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే ఎనలేని క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ అప్పట్లో ఎంతో మంది ఆడియన్స్‌ మనసులను దోచేసుకుంది. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. ఇందులో కార్తీకేయ, పాయల్ రాజ్‌పుత్ హీరో హీరోయిన్‌గా రొమాంటిక్ సీన్లతో బాగా రెచ్చిపోయారనే చెప్పాలి.


Also Read: పాయల్ రాజ్‌పుత్ ‘మంగళవారం’ మూవీ అరుదైన రికార్డ్.. ఏ హీరోకి ఇది సాధ్యం కాదు..!

అయితే ఆ తర్వాత దర్శకుడు గతేడాది మరొక సినిమాతో వచ్చి అదరగొట్టేశాడు. ఆ సినిమానే ‘మంగళవారం’. ‘ఆర్ఎక్స్ 100’ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ నటించిన ఈ మూవీ గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను సైతం రాబట్టింది.

అయితే ఇప్పుడీ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు అజయ్ భూపతికి అరుదైన అవార్డు లభించింది. 8వ ‘ఇండియన్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డుకు ఉత్తమ దర్శకుడిగా ఆయన ఎంపికయ్యారు. మంగళవారం సినిమాకి గానూ ఆయన ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని అజయ్ తాజాగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×