Dil Raju – NTR..ఏ హీరో అయినా.. దర్శకుడైనా.. నిర్మాత అయినా తాము తెరకెక్కించే సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ సినిమాని చేస్తూ ఉంటారు. ఒకసారి మనం అనుకున్న అంచనాలు రెట్టింపవచ్చు లేదా ఆశలు నిరాశ అవ్వచ్చు. అందుకే ఒక్కొక్కసారి ఏ సినిమా హిట్ అవుతుందో.. ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో చెప్పలేని పరిస్థితి.అలా హిట్ అవుతుందనుకున్న సినిమాలు ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) వరుసగా బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ ఇవ్వడంతో.. ఎన్టీఆర్ (NTR) తో సినిమా అనగానే అందరికీ అంతకు మించి అంచనాలు పెరిగిపోయాయి.
ఎన్టీఆర్ మూవీ ఫ్లాప్..
టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు(Dil Raju)నిర్మాణంలో.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన చిత్రం ‘రామయ్య వస్తావయ్యా’. సమంత(Samantha ), శృతిహాసన్ (Shruti Hassan) ఇందులో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో జరిగిన పగను తీర్చుకోవడానికి ప్రస్తుతం విలన్ ఇంట్లో ఉండే హీరోయిన్ కి దగ్గరవడం , ఆ తర్వాత విలన్ ని చంపడం.. ఇలాంటి ఒక రెగ్యులర్ పాయింట్ తో ఈ సినిమాను డైరెక్టర్ తెరకెక్కించారు. కానీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులకు ఎక్కలేదు. దీంతో ఫ్లాప్ గా నిలిచింది. ఇక ఇన్నేళ్ల తర్వాత కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక ఇంటర్వ్యూలో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ సినిమా ఫ్లాప్ అవడం వెనుక ఉన్న అసలు విషయాన్ని తెలిపారు. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం.
ALSO READ:Ajith Kumar.. హీరో అజిత్ కారుకి యాక్సిడెంట్..!
రామయ్య వస్తావయ్యా ఫ్లాప్ పై స్పందించిన దిల్ రాజు..
‘రామయ్య వస్తావయ్యా ‘సినిమా ఫలితం గురించి దిల్ రాజు మాట్లాడుతూ.. “రామయ్య వస్తావయ్యా సినిమా డిజాస్టర్ అయ్యింది. నేను , హరీష్ మధ్యాహ్నం రెండు గంటలకు కలిసి హీరో దగ్గరకు వెళ్ళాము. మూడింటికి కూర్చున్నాము. ఎందుకు ప్లాపు అయ్యింది. అసలు ఎందుకు మనం ఇలాంటి సినిమా తీశామని, మేము ముగ్గురం కలిసి ఆరు గంటల పాటు డిస్కస్ చేసుకున్నాము . ప్లాప్ సినిమా అని తెలిసిన తర్వాత నాలుగు గోడల మధ్య మాట్లాడుకున్న మేము.. బయటకు వచ్చి మా సినిమా పోయింది అని రెండో రోజే చెప్పలేము కదా.. దీంతో ఒక సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందని డిస్కస్ చేసుకొని.. అలాంటి తప్పులు మళ్ళీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాము. అలాగే సినిమా ఫ్లాప్ అయినా సరే హిట్టనే ప్రమోట్ చేస్తారు. కలెక్షన్లు రావడం కోసం, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ సేఫ్ అవ్వడానికి.. అయితే ఆ స్ట్రాటజీ ఇప్పటికి జరుగుతూనే ఉంది” అంటూ దిల్ రాజు తెలిపారు. ఇక దిల్ రాజు ఇటీవలే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక ఇదే సంక్రాంతికి ఆయన నిర్మించిన రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్ (Game Changer) మాత్రం డిజాస్టర్ గా నిలిచింది . ఇక ఈ సినిమా రెండవ రోజే టాక్ పూర్తిగా పడిపోవడం గమనార్హం. ఇక మరొకవైపు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్నారు. అటు డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో సినిమా చేస్తున్నారు.