Manchu Vishnu: సినీ పరిశ్రమలో, రాజకీయాల్లో ఎవరు ఎవరిని ఎందుకు టార్గెట్ చేస్తారు అనే విషయాలకు పెద్దగా కారణాలు ఉండవు. అలాగే తాజాగా మంచు విష్ణు, తను నిర్మిస్తూ నటిస్తున్న ‘కన్నప్ప’ సినిమా.. ఈ రెండూ వైసీపీకి టార్గెట్ అయ్యాయి. మంచు విష్ణు కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ‘కన్నప్ప’. ఈ మూవీకి ఇప్పటికే సరిపడా హైప్ క్రియేట్ అయ్యింది. దేశవ్యాప్తంగా ఎంతోమంది స్టార్లను ఈ సినిమా కోసం ఒక దగ్గరకు చేర్చాడు మంచు విష్ణు. దాంతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ మూవీలో గెస్ట్ రోల్ చేస్తుండడంతో మరింత బజ్ పెరిగింది. ఇలాంటి సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను అందించాలనుకున్న మంచు విష్ణకు వైసీపీ సెగ తగిలింది.
ట్వీట్ వల్లే
‘కన్నప్ప’ (Kannappa) సినిమాను సమ్మర్‌లోనే విడుదల చేయాలని మంచు విష్ణు నిర్ణయించుకున్నాడు. జులైలో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడు. అసలు విడుదల తేదీ డిసైడ్ చేయక ముందే ‘కన్నప్ప’ నుండి వరుసగా అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీలో ఏయే స్టార్లు ఏయే పాత్రల్లో కనిపించనున్నారో రివీల్ అయ్యింది. దాంతో పాటు టీజర్ కూడా వచ్చేసింది. అంతే కాకుండా ‘కన్నప్ప’ మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా అప్పుడే ప్రారంభించేశాడు మంచు విష్ణు. అందులో భాగంగానే ఈ మూవీ నుండి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. అయితే ఈ సినిమా నుండి మరొక అప్డేట్ ఇస్తానంటూ మంచు విష్ణు (Manchu Vishnu) చేసిన ట్వీట్.. వైసీపీ నేతలకు నచ్చలేదు.
మనసుకు దగ్గరయ్యింది
‘నా మనసుకు చాలా దగ్గరయ్యింది. నేను ఈరోజు ఇలా ఉండడానికి కారణమయ్యింది. అదేంటో రేపు ఉదయం 11 గంటలకు తెలుస్తుంది. సిద్ధంగా ఉండండి’ అంటూ ‘కన్నప్ప’ గురించి ఏదో ఆసక్తికర అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నించాడు మంచు విష్ణు. అంతా ఓకే కానీ తను ఎంచుకున్న సమయం మాత్రం వైసీపీ నేతలకు నచ్చలేదు. అసలు ‘కన్నప్ప’ సినిమాకు, మంచు విష్ణుకు, వైసీపీ నేతలకు ఏంటి సంబంధం అని ప్రేక్షకులు సైతం సందేహం పడుతున్నారు. అయితే దాని వెనుక పెద్ద కథే ఉంది. 11 అనే నెంబర్ గత కొన్నాళ్లు వైసీపీ నేతలను వెంటాడుతోంది. ఆ నెంబర్ వింటేనే పార్టీ నేతలకు కోపం వస్తోంది.
Also Read: రామ్ నన్ను బ్లాక్ చేశాడు.. బిగ్ బాస్ బ్యూటీ ఆవేదన
ట్రోల్ చేయడానికే
2019 ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీకి 151 స్థానాలు దక్కాయి. కానీ 2024లో మాత్రం వారికి 11 సీట్లు మాత్రమే దక్కాయి. అప్పటినుండి వైసీపీని అంతా ఈ 11 నెంబర్‌తోనే ఏడిపించడం మొదలుపెట్టారు. అలా వైసీపీ ఫాలోవర్స్‌కు 11 అనేది దురదృష్టకర నెంబర్‌గా మారిపోయింది. అందుకే మంచు విష్ణు కూడా ఉదయం 11 గంటలకు ‘కన్నప్ప’ అప్డేట్ అనగానే ఒక వైసీపీ ఫాలోవర్‌కు నచ్చలేదు. ‘వేరే టైమ్ దొరకలేదా మీకు? కరెక్ట్‌గా 11 గంటలకు రిలీజ్ చేయాల్సిన పని ఏంటి? మా జగనన్నను ట్రోల్ చేయాలనే ఉద్దేశ్యం లేకపోతే తప్పా! ఇలాగే ఎగరండి మేం వచ్చాక మేమేంటో చూపిస్తాం’ అంటూ మంచు విష్ణుకు ట్విటర్‌లో వార్నింగ్ ఇచ్చాడు ఒక వైసీపీ ఫాలోవర్.
పగులుతాది రా మీకు 😡
వేరే టైమ్ దొరకలేదారా మీకు?
కరెక్ట్ గా 11 గంటలకు రిలీజ్ చేయాల్సిన పని ఏంటి? మా జగనన్నను ట్రోల్ చేయాలనే ఉద్దేశం లేకపోతే తప్పా!!
ఇలాగే ఎగరండి మేమొచ్చాక చూపిస్తాం మేమేంటో 😡😡#BoycottKannappa https://t.co/laeccAfQ5E
— Ranganath Reddy (@RangannaYCP) April 22, 2025