BigTV English

Sithara Entertainments : సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సినిమా చేయనున్న తమిళ స్టార్ డైరెక్టర్.?

Sithara Entertainments : సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సినిమా చేయనున్న తమిళ స్టార్ డైరెక్టర్.?

Sithara Entertainments : సితార ఎంటర్టైన్మెంట్స్… తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌస్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ ఒకటి. ఈ బ్యానర్ ప్రముఖ బ్యానర్ హారిక హాసిని క్రియేషన్స్ కి అనుసంధానంగా క్రియేట్ చేయబడింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన జులాయి సినిమాతో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ తర్వాత కేవలం దర్శకుడు త్రివిక్రమ్ తో మాత్రమే హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ సినిమాలు చేయడం మొదలుపెట్టింది. ఈ బ్యానర్లో అజ్ఞాతవాసి సినిమా మినహాయిస్తే మిగతా సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. మంచి లాభాలను తీసుకొని వచ్చాయి. ఈ బ్యానర్ కి అనుసంధానంగా వచ్చిన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కూడా అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఈ బ్యానర్ కి కూడా మంచి ప్రాముఖ్యత ఉంది. జెర్సీ లాంటి నేషనల్ అవార్డు ఫిలిం ఈ బ్యానర్ లోనే వచ్చింది.


యంగ్ దర్శకులకు వరుస అవకాశాలు 

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ వేల్యూ ఉంది. ఈ బ్యానర్ లో ఒక సినిమాను చేస్తే ఆ సినిమాను ప్రేక్షకులు వద్దకు తీసుకెళ్లడానికి నిర్మాత నాగ వంశీ చాలా కష్టపడతారు. కొంతమంది మీడియా వాళ్లతో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం నాగ వంశీకి మాత్రమే దక్కింది. ఇక రీసెంట్ గా మ్యాడ్ స్క్వేర్ సినిమా కూడా ఈ బ్యానర్ నుంచి రిలీజ్ అయింది. ఈ సినిమా విషయంలో కూడా అనేక విమర్శలు, నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. వీటన్నిటికీ ప్రెస్ మీట్ పెట్టు మరి కలెక్షన్స్ అడ్డుపెట్టి చాలామంది మీడియా ప్రముఖులను ఎదుర్కొన్నాడు నాగ వంశీ. ఇక ప్రస్తుతం ఈ బ్యానర్లో నిర్మితమవుతున్న కింగ్డమ్ సినిమా ఈ నెల 30న విడుదలకు సిద్ధంగా ఉంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి.


తమిళ దర్శకుడు తో సినిమా

ఇకపోతే కేవలం తెలుగు దర్శకులు మాత్రమే కాకుండా తమిళ్ దర్శకులతో కూడా పనిచేసే ప్లాన్ చేస్తున్నాడు నాగ వంశీ. ఇదివరకే వెంకి అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, ధనుష్ వంటి హీరోలతో సినిమాలు నిర్మించాడు. ఇక తాజాగా సూర్య హీరోగా మరో సినిమా నిర్మిత అవుతున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే సూర్యతోపాటు కార్తీక్ సుబ్బరాజు కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఒక సినిమాను చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ కథకు సరిపోయే తెలుగు హీరో కోసం ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ హౌస్ ఎదురు చూస్తుంది. ఈ ప్రాజెక్టు మొదలయ్యేలోపు కార్తీక్ సుబ్బరాజు ఒక ఇండిపెండెంట్ ఫిలిం చేసే అవకాశం ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రాజెక్టు గురించి అధికార ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.

Also Read : Coolie in 100 Days : తమిళ సినిమా అంటే భలే హై క్రియేట్ చేస్తాడు ఈ బక్కోడు

Related News

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Kissik Talks Promo : మహేష్ విట్టా లవ్ స్టోరిలో ఇన్ని ట్విస్టులా..ఆ ఒక్క కోరిక తీరలేదు..

Ritu Chaudhary : చెప్పు రీతు నువ్వు నన్ను మోసం చేయలేదా? రీతుకి కళ్యాణ్ తో బంధం తెగిపోయిందా?

Bigg boss emmanuel : నా బాధ మీకు తెలియదు, రోజు దుప్పటి కప్పుకుని ఏడుస్తాను

Big Stories

×