RCB VS CSK Fans: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament )
నేపథ్యంలో… చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇప్పటికే టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈనెల మూడవ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజెస్ బెంగళూరు ( CSK VS RCB )మధ్య చిన్న స్వామీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. అయితే మ్యాచ్లో చివరి వరకు వచ్చి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోయింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోయిన నేపథ్యంలో… చిన్న స్వామి స్టేడియం బయట రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు రచ్చ రచ్చ చేశారు.
Also Read: SRH VS DC: ఉప్పల్ లో ఆగిపోయిన మ్యాచ్ .. కావ్య పాప పూజలు.. మ్యాచ్ రద్దు అయితే SRH ఇంటికేనా
చిన్న పెద్ద అని తేడా లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించిన అభిమానులను ఒక ఆట ఆడుకున్నారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్యాన్స్. ఇందులో ముఖ్యంగా విరాట్ కోహ్లీ అభిమానులు అయితే… ఓవర్ యాక్టింగ్ చేశారు. మహిళలని చూడకుండా రెచ్చిపోయారు. ఓ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానిని ఏకంగా 500 మంది రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు అభిమానులు ఆట ఆడుకున్న వీడియో కూడా వైరల్ గా మారింది. అయితే బెంగళూరు అభిమానులు ఎంత రెచ్చిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అభిమానులు కూడా.. గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.
బెంగళూరు అభిమానులకు వార్నింగ్ ఇచ్చిన లేడీ ఫ్యాన్
ఈ నేపథ్యంలోనే చిన్న స్వామి స్టేడియం బయట.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు కొంతమంది అత్యుత్సాహానికి పాల్పడ్డారు. బుల్లెట్ బైక్ పైన వెళ్తున్న ఇద్దరు లేడీ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను… ట్రోలింగ్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో విసిగిపోయిన బైక్ నడుపుతున్న చెన్నై అభిమాని… ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. దాదాపు 100 మంది వరకు ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు ఒంటి చేత్తో వార్నింగ్ ఇచ్చారు ఆ లేడీ ఫ్యాన్.
ఒరేయ్ మీకు ఒక కప్పు కూడా లేదు… మాకు ఇప్పటికే ఐదు కప్పులు వచ్చాయి… దమ్ముంటే ఈసారి కప్పు కొట్టి చూడండి రా… అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. దీంతో కాస్త భయపడిపోయారు బెంగళూరు అభిమానులు. అదే సమయంలో అక్కడికి… ఓ ట్రాఫిక్ పోలీస్ వచ్చి బెంగళూరు అభిమానులకు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు అలాగే చెన్నై ఫ్యాన్స్… ఆ అమ్మాయి తోపురా అంటున్నారు. అంతమంది బెంగళూరు అభిమానులు ఉన్న సింగిల్ హ్యాండ్ తో అందరినీ తరిమేసిందని చెబుతున్నారు.
Also Read: Kavya Maran – Run-Out: రేయ్ వెళ్ళి వాడిని వేసేయండిరా.. కావ్య పాప రియాక్షన్ అదుర్స్
— Out Of Context Cricket (@GemsOfCricket) May 5, 2025