Yatra 2 Movie : పక్కా వ్యూహంతో.. ఎన్నికలకు ముందు యాత్ర -2 రిలీజ్..

Yatra 2 Movie : పక్కా వ్యూహంతో.. ఎన్నికలకు ముందు యాత్ర -2 రిలీజ్..

yatra 2 movie
Share this post with your friends

yatra 2 movie

Yatra 2 Movie : తెలుగు రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్న తరుణం.. ఎటు చూసినా ఎన్నికల ప్రచారాలు.. ఎత్తుకు పైఎత్తులు అన్నట్లు సాగుతోంది వ్యవహారం. రావణకాష్టంలో ఆజ్యం పోయడానికి అన్నట్టు సినీ ఇండస్ట్రీ కూడా తమ వంతు టాలెంట్ చూపించడానికి ముందుకు వస్తుంది. గత ఎన్నికలకు ముందు ఆంధ్రాలో తలపడుతున్న రెండు అగ్ర పార్టీల కు సంబంధించి సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే కదా. ఈసారి కూడా ఎన్నికలు అన్నారో లేదో రెండు పార్టీలకు సంబంధించిన మూవీలు రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాయి.

ప్రచారం ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో సినిమా అంతకంటే ఇంపాక్ట్ చూపిస్తుంది అని నమ్ముతున్నారో ఏమో రాజకీయ నాయకులు కూడా వీటికి సైలెంట్ గా సమ్మతి తెలుపుతున్నారు.2019 లో ఎన్నికలకు ముందు వచ్చిన యాత్ర చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందులో ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ప్రస్థానం హైలైట్ చేయడం జరిగింది. తిరిగి యాత్ర -2తో ఇప్పుడు ఎన్నికల ముందు మరోసారి మహీ వి రాఘవ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు.

యాత్రలో మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్ర పోషించారు. ఇప్పుడు యాత్ర 2 కంప్లీట్ గా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కబోతున్న సంగతి ఫస్ట్ లుక్ తోనే క్లియర్గా అర్థం అవుతుంది. ఇక ఈ మూవీలో జగన్ సీఎం ఎలా అయ్యారు అనే విషయంపై ఎక్కువ ఫోకస్ చేస్తారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో జగన్ పాత్ర ను రంగం ఫేమ్ జీవా పోషిస్తున్నారు. అలాగే యాత్ర 2 మూవీలో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ కోసం బాలీవుడ్ ఫేమస్ యాక్టర్ మహేష్ మంజ్రేకర్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మహేష్ మంజ్రేకర్.. ఇతను బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా పలు రకాల నెగిటివ్ షేడ్స్ క్యారెక్టర్స్ లో నటించారు. జూనియర్ ఎన్టీఆర్ అదుర్స్ చిత్రంలో చారి చేతులో బలైపోతాడు చూడండి ఒక విలన్.. అదేనండి బాబా బాయ్.. అతనే ఈ మహేష్ మంజ్రేకర్. ఇప్పుడు యాత్ర 2 లో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ పోషించబోతున్నాడు. మరి చంద్రబాబు నాయుడు నిజ జీవితంలో ఎలా ఉంటారు అనేదానికి తగినట్టుగా మహేష్ ఎంత వరకు నటిస్తాడో చూడాలి.

ఎన్నికలకు ముందుగా అంటే ఫిబ్రవరి 8 , 2024కి ఈ చిత్రం థియేటర్లలో విడుదలయ్యే విధంగా ప్లానింగ్ చేస్తున్నారు. అయితే ఇంచుమించు ఇదే నేపథ్యంలో సాగే ఆర్జీవి చిత్రాలు వ్యూహం నవంబర్ 10, శపథం జనవరి 25న విడుదల అవ్వనున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇందులో మొదటి పార్ట్ అయిన వ్యూహంలో వైయస్సార్ పాదయాత్ర హైలెట్ చేయడం ఇక సెకండ్ పార్ట్ శపథంలో రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎటువంటి సన్నివేశాలను ఎదుర్కోవాల్సి వచ్చింది.. క్రమంగా ముఖ్యమంత్రిగా ఎలా ఎదిగారు అనే విషయాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు.కంటెంట్ ఒకటే అయిన ఈ రెండు చిత్రాలు ఒకదానిపై ఒకటి ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి చూడాలి. అలాగే వీటి ఇంపాక్ట్ రాబోయే ఎన్నికల పై ఎంతవరకు ఉంటుంది అన్న విషయం కూడా తేలాల్సి ఉంది.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Samantha : హెల్త్ సమస్యపై సమంత భావోద్వేగం..ఇంటర్వ్యూలో ఏడ్చేసిన సామ్

BigTv Desk

NTR 31: ‘సాహో’ హీరోయిన్‌తో ఎన్టీఆర్‌!

Bigtv Digital

Natural star NewYear treat : నేచుర‌ల్ స్టార్ న్యూ ఇయ‌ర్ ట్రీట్‌

Bigtv Digital

Vande Bharat Express: మోదీ రాక.. తిరుపతికి త్వరగా.. ఖరీదెంత? ప్రత్యేకతలేంటి?

Bigtv Digital

Diwali Movies 2023 : దీపావళికి తుస్సుమన్న డబ్బింగ్ టపాసులు..

Bigtv Digital

Michaung Landfall: మిగ్ జాం తుపాన్.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు

Bigtv Digital

Leave a Comment