BigTV English

Shaheen Khan: చిరునవ్వుతో బ్యూటీ గుర్తుందా.. ఇప్పుడెలా మారిందో చూడండి

Shaheen Khan: చిరునవ్వుతో బ్యూటీ గుర్తుందా.. ఇప్పుడెలా మారిందో చూడండి

Shaheen Khan: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు అందించిన చిత్రాల్లో చిరునవ్వుతో ఒకటి. వేణు తొట్టెంపూడి హీరోగా నటించిన ఈ చిత్రానికి జి. రాంప్రసాద్ దర్శకత్వం వహించాడు. 2000లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఈ సినిమాలోని డైలాగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. సాంగ్స్ కూడా సూపర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.


ఇక ఈ చిత్రంలో వేణు సరసన షహీన్ ఖాన్ నటించగా.. ప్రత్యేక పాత్రలో ప్రేమ నటించింది. వేణు, ప్రేమ ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఈ సినిమా తరువాత షహీన్ కు మంచి గుర్తింపు వచ్చింది. వరుస ఆఫర్లు వచ్చినా ఆమె కేవలం మూడు సినిమాలకే పరిమితమయ్యింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో షహీన్ కేవలం మూడు సినిమాల్లో మాత్రమే నటించింది.

ఇండస్ట్రీకి వచ్చిన రెండేళ్లకే షహీన్ .. సినిమాలకు గుడ్ బై చెప్పింది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన షహీన్ .. చిరునవ్వుతో సినిమాతోనే ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇక ఇదే సినిమా తమిళ్, కన్నడ రీమేక్ లో కూడా ఆమె హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కాకుండా ఆమె డార్లింగ్ డార్లింగ్ అనే సినిమాలో నటించి మెప్పించింది. నిజం చెప్పాలంటే.. చిరునవ్వుతో సినిమాలో సంధ్య పేరునే ఆమె సొంత పేరుగా మారిపోయింది. అప్పట్లో షహీన్ కన్నా సంధ్యగానే ఆమె గుర్తింపు తెచ్చుకుంది.


కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే వ్యాపారవేత్తను పెళ్ళాడి సినిమాలకు స్వస్తి చెప్పింది. ప్రస్తుతం ఆమె విదేశాల్లో సెటిల్ అయ్యినట్లు తెలుస్తోంది. షహీన్ కు ఒక కుమార్తె కూడా ఉంది. సోషల్ మీడియా వచ్చాక ఆమె తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది. షహీన్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అంతే అందాన్ని మెయింటైన్ చేస్తుంది. ఇప్పటికీ హీరోయిన్ లానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ముందు ముందు ఈమె మళ్లీ నటించే అవకాశం ఉందేమో చూడాలి.

Tags

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×