Dulquer Salmaan: తెలుగు హీరో అయినా కూడా రానాకు ప్రతీ ఇండస్ట్రీ నుండి ఫ్రెండ్స్ ఉన్నారు. పైగా వారందరూ రానాను సొంత మనిషిలాగా ఫీలవుతారు. అందుకే రానా హోస్ట్‌గా ప్రారంభమయిన ‘ది రానా దగ్గుబాటి షో’ కోసం అన్ని భాషల నుండి సెలబ్రిటీలు వస్తున్నారు. అందరి ఇంటర్వ్యూలు తీసుకుంటూ, వారి పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ విషయాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాడు. అలాగే ‘ది రానా దగ్గుబాటి షో’ నుండి తాజాగా రిలీజ్ అయిన ఎపిసోడ్‌కు గెస్టులుగా దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరీ వచ్చారు. ఈ ఎపిసోడ్ వల్ల మొదటిసారి దుల్కర్ సల్మాన్, రానాల మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ బాండింగ్ గురించి ప్రేక్షకులకు తెలిసింది.
ఒకే స్కూల్‌లో
రానా హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడంటే ఆ టాక్ షో కచ్చితంగా హిట్ అవ్వాల్సిందే. అసలైతే స్టార్ హీరోల కేటగిరిలో ఉండి కూడా ముందుగా హోస్టింగ్ వైపు అడుగులేసింది రానానే. అలాగే అమెజాన్ ప్రైమ్‌తో కలిసి ‘ది రానా దగ్గుబాటి షో’ (The Rana Daggubati Show) అనే కొత్త టాక్ షోను ప్రారంభించాడు. అందులో గెస్టులుగా దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరీ రాగా వారితో కూడా కబుర్లు చెప్తూ ప్రేక్షకులకు కొత్త విషయాలు తెలిసేలా చేశాడు. దుల్కర్, రానా ఒకే స్కూల్‌లో చదువుకున్నారని ఈ ఎపిసోడ్ ద్వారా బయటపడింది. ‘‘నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు. నువ్వు 8వ తరగతిలో ఉండుంటావు కదా’’ అని తనను మొదటిసారి చూసిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు దుల్కర్ సల్మాన్.
Also Read: ఆ రూమర్స్‌లో నిజం లేదు.. చిరు, ఓదెల మూవీపై నిర్మాత ఇంట్రెస్టింగ్ అప్డేట్
ప్రశంసల వర్షం
రానా మాత్రం తాను వరుసగా ఫెయిల్ అయ్యి 6వ తరగతిలో ఉండుంటానని జోక్ చేశాడు. ఇక రానా హీరోగా నటించిన ‘విరాట పర్వం’ షూటింగ్ సమయంలో కొచ్చిలో ఉన్న తన ఇంటికి వచ్చినట్టుగా దుల్కర్ గుర్తుచేసుకున్నాడు. ‘‘మొదటిసారి రానా మా ఇంటికి వచ్చి అమ్మను కలిశాడు. అమ్మను బాగా నచ్చేశాడు’’ అని తెలిపాడు. ‘లీడర్’లాంటి సినిమాతో రానా డెబ్యూ చేయడం అనేది చాలా ధైర్యమైన నిర్ణయమని దుల్కర్ ప్రశంసించాడు. అంతే కాకుండా రానాకు స్టార్‌డమ్ అంటే ఎప్పుడూ నచ్చదని, దాని వెంట పరిగెత్తడని అన్నాడు. రానా కూడా దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరో అయినప్పుడే తను స్పెషల్‌గా చేస్తాడని నమ్మానని చెప్పుకొచ్చాడు.
‘కాంతా’తో కలిసి
ఇటీవల దుల్కర్, రానా (Rana) కలిసి ‘కాంతా’ (Kaantha) అనే మూవీలో నటిస్తున్నట్టుగా ప్రకటించారు. ఆ సినిమాకు సంబంధించిన విషయాలను కూడా దుల్కర్ పంచుకున్నాడు. ‘‘కాంతా సినిమా ఎన్నో ఏళ్లుగా మేకింగ్‌లో ఉంది. దాని గురించి మా మధ్య ఎన్నో చర్చలు, మనస్పర్థలు, గొడవలు కూడా జరిగాయి. మేము సాధారణంగా గొడవలు పడము. కానీ ఏం జరిగినా వెంటనే దానిని పక్కన పెట్టేసి ముందుకు వెళ్లిపోతుంటాం’’ అని దుల్కర్ తెలిపాడు. ‘కాంతా’లో రానా హీరోగా నటించడం మాత్రమే కాకుండా తానే ఈ సినిమాను నిర్మిస్తున్నాడు కూడా. ఈ సినిమా తమ ఫ్రెండ్‌షిప్‌ను టెస్ట్ చేయడంతో పాటు తమరిని మరింత దగ్గర చేసిందని అన్నాడు రానా.