BigTV English
Advertisement

Dwayne Johnson: వరల్డ్‌లోనే రిచ్ నటుడు.. ఆస్తుల విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా.?

Dwayne Johnson: వరల్డ్‌లోనే రిచ్ నటుడు.. ఆస్తుల విలువ ఎన్ని వందల కోట్లో తెలుసా.?

Dwayne Johnson: తాజాగా ప్రపంచంలోనే అత్యంత ధనికుడు అయిన నటుడు ఎవరు అని ఫోర్బ్స్ మ్యాగజిన్ ఒక లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో నాలుగేళ్ల తర్వాత ఒక అమెరికన్ నటుడు టాప్ స్థానానికి చేరుకున్నాడు. నాలుగేళ్లుగా హాలీవుడ్‌లో, ఇతర ఫారిన్ భాషల్లో ఫామ్‌లో ఉన్న నటీనటులు ఈ లిస్ట్‌లో టాప్ స్థానంలో కనిపించేవారు. కానీ ఇన్నాళ్ల తర్వాత డ్వేన్ జాన్సనే అందరికంటే అత్యంత ధనికుడు అని తెలిసి తన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. అంతే కాకుండా తనకు ఉన్న ఆస్థుల విలువ చూసి షాకవుతున్నారు. ర్యాన్ రెనోల్డ్స్, జెర్రీ సీన్‌ఫీల్డ్ లాంటి టాప్ నటీనటులను వెనక్కి నెట్టిన డ్వేన్ జాన్సన్ ఆస్థుల విలువ ఎంతో మీరే చూసేయండి.


హీరోయిన్స్ కూడా

డ్వేన్ జాన్సన్ గతేడాది కొన్ని పెద్ద పెద్ద డీల్స్‌ను సైన్ చేశాడు. ‘రెడ్ వన్’, ‘మోనా 2’ లాంటి సినిమాలతో బాగానే సంపాదించాడు. దీంతో మొత్తం తన ఆస్థుల విలువ 88 మిలియన్ డాలర్లు.. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.760 కోట్లకు పైగానే వెనకేసుకున్నాడు డ్వేన్. ఈ డబ్బుతో ప్రపంచాన్నే కొనేయొచ్చేమో అని ప్రేక్షకులు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇక ఫోర్బ్స్ రిచ్ టాప్ 20 హాలీవుడ్ యాక్టర్స్ లిస్ట్‌లో ఈ ఏడాది ముగ్గురు హీరోయిన్స్ కూడా యాడ్ అవ్వడం విశేషం. వారే నికోల్ కిడ్‌మ్యాన్, మరిస్కా హర్గిటే, స్కార్లెట్ జాన్సన్. ఇక వీరందరితో పోలిస్తే స్కార్లెట్ జాన్సన్ వయసు చాలా తక్కువ. కొందరు హీరోలకు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లు ఉన్నా కూడా ఈ లిస్ట్‌లో యాడ్ అవ్వలేకపోయారు.


అప్‌కమింగ్ సినిమాలు

డ్వేన్ జాన్సన్ ప్రస్తుతం మార్టిన్ స్కార్సెస్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇందులో లియోనార్డో డిక్రాపిషోతో పాటు ఎమిలీ బ్లంట్ కూడా లీడ్ రోల్స్‌లో కనిపించనున్నారు. ‘ఏ24’ అనే మూవీ కోసం కూడా డ్వేన్ ఎదురుచూస్తున్నాడు. వీటితో పాటు ఒక బయోపిక్‌లో కూడా డ్వేన్ నటిస్తున్నాడు. 1990ల్లో మార్షల్ ఆర్ట్స్‌లో ప్రతిభ కనబరిచి ప్రపంచం మొత్తం తనవైపు తిరిగి చూసేలా చేసుకున్న మార్క్ కెర్ అనే వ్యక్తి బయోపిక్‌లో డ్వేన్ జాన్సర్ హీరోగా నటిస్తున్నాడు. దీనికి ‘స్మాషింగ్ మెషీన్’ అనే టైటిల్ ఫిక్స్ చేయగా బెన్నీ సాఫ్డీ దీనిని డైరెక్ట్ చేస్తున్నాడు.

Also Read: ఆ అయిదుగురు స్టార్స్ ఒకప్పుడు స్టార్ యాక్టర్స్ అని తెలుసా.?

పూర్తి లిస్ట్

కొన్ని సినిమాలకు రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటాలు తీసుకోవడం వల్ల కూడా కొందరు హీరోల సంపాదన పెరిగింది. ఇక ఫోర్బ్స్ టాప్ 10 రిచ్ నటుల కేటగిరిలో నిలిచిన వారు ఎవరో, వారి ఆస్థుల విలువ ఎంతంటే..
డ్వేన్ జాన్సన్ – 88 మిలియన్ డాలర్లు (రూ.760 కోట్లు)
ర్యాన్ రెనోల్డ్స్ – 85 మిలియన్ డాలర్లు (రూ.740 కోట్లు)
కెవిన్ హార్ట్ – 81 మిలియన్ డాలర్లు (రూ.700 కోట్లు)
జెర్రీ సెన్ఫీల్డ్ – 60 మిలియన్ డాలర్లు (రూ. 520 కోట్లు)
హ్యూ జ్యాక్‌మ్యాన్ – 50 మిలియన్ డాలర్లు (రూ.410 కోట్లు)
బ్రాడ్ పిట్ – 32 మిలియన్ డాలర్లు (రూ.280 కోట్లు)
జార్జ్ క్లూనీ – 32 మిలియన్ డాలర్లు (రూ.280 కోట్లు)
నికోల్ కిడ్‌మ్యాన్ – 31 మిలియన్ డాలర్లు (రూ.270 కోట్లు)
ఆడమ్ సాండ్లర్ – 26 మిలియన్ డాలర్లు (రూ.220 కోట్లు)
విల్ స్మిత్ – 26 మిలియన్ డాలర్లు (రూ.220 కోట్లు)

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×