BigTV English
Advertisement

ENE2: టీమ్ కన్యరాశి తిరిగి వస్తుంది.. గ్యాంగ్స్ తో రెడీగా ఉండండ్రా కుర్రాళ్లు..?

ENE2: టీమ్ కన్యరాశి తిరిగి వస్తుంది.. గ్యాంగ్స్ తో రెడీగా ఉండండ్రా కుర్రాళ్లు..?

ENE2: జీవితంలో ప్రతి మనిషికి అవసరమైనది డబ్బు అయితే .. అంతకు మించింది స్నేహం. ఫ్రెండ్స్ లేని మనిషి ఉండడు అంటే అతిశయోక్తి లేదు.  చిన్నతనం నుంచి చివరివరకు కలిసి ఉండే స్నేహాలు ఉండడం ఎంతో అదృష్టం. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అలాంటి స్నేహాలను పరిచయం చేసిన సినిమాల్లో ఈ నగరానికి ఏమైంది ఒకటి. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆసమయంలో భారీ బ్లాక్ బస్టర్ అవ్వలేదు కానీ.. అదే ఈ సమయంలో రిలీజ్ అయ్యి ఉంటే కనుక  రికార్డ్ కలక్షన్స్  రాబట్టేది అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.


విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం 2018 లో రిలీజ్ అయ్యి ఒక మోస్తరుగా విజయాన్ని అందుకుంది. నలుగురు స్నేహితుల జీవితాల్లో జరిగిన సంఘటనలు, కాలేజ్ లైఫ్, ఎలాంటి పరిస్థితిలో కూడా వదిలి వెళ్ళకూడదు అని, జీవితం ఎప్పుడు ఒకలా  ఉండదు అని..  మనసుకు ఏది అనిపిస్తే అది చేయాలని, నచ్చిన వర్క్ చేయాలనీ..  ఇలా ఈ సినిమా కుర్రాళ్లకు ఎంతో నేర్పింది.

Samantha: ఎన్నిసార్లు అదే ప్రశ్న అడుగుతారు.. నా కండీషన్ బాలేదు


ఇక సినిమా చూసాకా ఆ నలుగురు స్నేహితులను తమ గ్యాంగ్ లో చూసుకున్నవారు కూడా లేకపోలేదు. అంతగా కుర్రాళ్లను మెప్పించిన సినిమా ఈ నగరానికి ఏమైంది. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే..  అభినవ్ కామెడీ మరో ఎత్తు. ఇప్పటికీ  ఇన్స్టాగ్రామ్ మీమ్స్ లో ఆ డైలాగ్స్ లేకుండా   రోజు గడవదు అని చెప్పొచ్చు.  ఇక ఈ సినిమాకు సీక్వెల్ తేవాలని ఫ్యాన్స్ అందరూ ఎప్పటినుంచో తరుణ్ భాస్కర్ ను అడుగుతున్నారు. ఆయన కూడా ఈ నగరానికి ఏమైంది 2 ఉంటుందని చెప్పుకొచ్చాడు కానీ, పట్టాలెక్కింది లేదు.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ నగరానికి ఏమైంది 2 సెట్స్ మీదకు వెళ్లనుందట. 35 చిన్న సినిమా కాదు చిత్రాన్ని నిర్మించిన ఎస్ ఒరిజినల్స్  ఈ సినిమాను నిర్మిస్తుంది. త్వరలోనే అధికారిక ప్రకటన  రానుంది. ఈ విషయం తెలియడంతో అభిమానులు ఎగిరి గంతులు వేస్తున్నారు. టీమ్ కన్యరాశి తిరిగి వస్తుంది.. గ్యాంగ్స్ తో రెడీగా ఉండండ్రా కుర్రాళ్లు.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అప్పుడంటే విశ్వక్ సేన్  కొత్త కుర్రాడు. ఇప్పుడు అతడు స్టార్ హీరోగా మారాడు.  మరి ఈ సీక్వెల్ కు విశ్వక్ ఒప్పుకుంటాడా.. ? లేక ఆ ప్లేస్ ను మరో హీరో రీప్లేస్ చేస్తాడా.. ? అనేది  తెలియాల్సి ఉంది.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×