BigTV English

Samantha: ఎన్నిసార్లు అదే ప్రశ్న అడుగుతారు.. నా కండీషన్ బాలేదు

Samantha: ఎన్నిసార్లు అదే ప్రశ్న అడుగుతారు.. నా కండీషన్ బాలేదు

Samantha: స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఏడాది గ్యాప్ తరువాత సామ్ ఇప్పుడు  భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేయడం మొదలుపెట్టింది. ఇంకోపక్క తన మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటూనే ఉంది.   నిత్యం ఏదో ఒక వార్తలో సామ్ పేరు గట్టిగా వినిపిస్తూనే ఉంటుంది. ఒకవేళ రాకపోయినా..  ఆమె సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ఈ చిన్నది సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో బిజీగా మారింది.


ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తరువాత .. సామ్ నటించిన సిరీస్ సిటాడెల్. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నవంబర్ 7 నుంచి అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ లో అమ్మడు సూపర్ స్పై గా కనిపించనుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన సామ్..  ఒకపక్క ప్రెస్ మీట్స్, ఇంటర్వూస్ ఇస్తూనే.. సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్స్ చేస్తుంది.

Bloody Beggar Trailer: బ్లడీ బెగ్గర్.. బకరా ఎలా అయ్యాడు.. ?


తాజాగా సిటాడెల్ సిరీస్ గురించి అభిమానులతో మాట్లాడానికి చిట్ చాట్ చేసింది సామ్ . ఇక ఈ చిట్ చాట్ లో ఒక నెటిజన్ సమంత బరువు గురించి మాట్లాడాడు. ఒకప్పుడు ఎంతో అందంగా, ముద్దుగా కనిపించే సామ్.. మయోసైటిస్ తరువాత బరువు తగ్గుతూ వచ్చింది. చక్కనమ్మ చిక్కినా అందమే కానీ, సామ్ మరీ సన్నబడింది.  ఒకప్పుడు ఉన్న రూపు రేఖలు కూడా మారిపోయాయి. ఇక అదే ఆవేదనను ఒక అభిమాని ఆమె ముందు వెళ్లబుచ్చాడు. దయచేసి బరువు పెరగండి అని ప్రశ్నించాడు.

ఇక దానికి సామ్ అసహనం వ్యక్తం చేసింది. ” అందరూ ఇదే ప్రశ్న.. ఎన్నిసార్లు అడుగుతారు. నాకున్న కండీషన్ బాలేదు. నేను కఠినమైన యాంటీ ఇన్ఫలమేటరీ డైట్ లో ఉన్నాను.  ఆ పరిస్థితి అలానే ఉంది. నాకు తగ్గ బరువు నేను ఉన్నాను. నా ఆరోగ్యం బావుండాలి అంటే నేను ఇంతే బరువులో ఉండాలి. దయచేసి ఇతరులను జడ్జ్ చేయకండి.. జీవించనివ్వండి” అని చెప్పుకొచ్చింది.  ప్రస్తుతం సామ్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి సిటాడెల్ హనీ బన్నీ సిరీస్ తో సామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×