Erica Fernandez: తలరాతలు ఎలా ఉంటే మన జీవితం అలా కొనసాగుతుంది అని చాలామంది నమ్ముతారు. అయితే తలరాతల సంగతి పక్కన పెడితే, జీవితంలో ముందడుగు వేయడం కోసం పెళ్లి అనే బంధంలోకి ఎంతోమంది అడుగుపెడుతున్నారు. అయితే ఆ వివాహ బంధంలో సంతోషంగా ఉన్నారా అంటే అదీ లేదు. కొన్ని జంటలు ఎంతో అన్యోన్యంగా ఉంటాయి. మరికొన్ని జంటలను చూస్తే పెళ్లి అంటేనే భయం వేస్తుంది. ఇంకొంతమంది రిలేషన్షిప్ లో ఉన్నప్పుడే ఎదుటి వారి అసలు వ్యక్తిత్వాలు తెలుసుకొని బంధాన్ని బ్రేకప్ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తనను జీవితాంతం బాగా చూసుకుంటాడని నమ్మిన ఒక హీరోయిన్ అతడితో రిలేషన్షిప్ కొనసాగించడం మొదలుపెట్టింది. ఇక అతడిని పూర్తిగా నమ్మిన ఈమెకు తర్వాత అతడి వైలెంట్ వ్యక్తిత్వం బయటపడడంతో ఒక్కసారిగా నివ్వెరపోయింది. ఇక అతడి బంధాన్ని తట్టుకోలేకపోయింది. అతనే సర్వస్వం అనుకున్న ఈమెను అతడు శారీరకంగా హింసించేవాడట. అన్నింటినీ ఓర్చుకొని చివరికి అతడితో తెగదంపులు చేసుకుంది. మరి ఇన్ని కష్టాలు అనుభవించిన ఆమె ఎవరో కాదు ప్రముఖ తమిళ్ బ్యూటీ ఎరికా ఫెర్నాండెజ్ (Erica Fernandez)
తొలిసారి నోరు విప్పిన నటి..
అటు బుల్లితెర ఇటు వెండితెర రంగాలలో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈమె ‘ఐన్తు ఐన్తు ఐన్తు’అని సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తమిళ్ తో పాటూ కన్నడ భాషల్లో కూడా నటించి తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకుంది. తెలుగులో ఆది సాయికుమార్ (Adi Sai Kumar) నటించిన ‘గాలిపటం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె గత కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరమైంది. మళ్లీ ఎప్పుడెప్పుడు తెరపైకి వస్తుందా అని అభిమానులు కూడా ఎదురు చూస్తున్న వేళ.. సడన్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చి తాను అనుభవిస్తున్న నరకం గురించి చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.
ALSO READ:Bollywood: మద్యానికి బానిసైన స్టార్ హీరో చెల్లెలు..రోజూ 9 గంటలు నరకం అంటూ..!
హింసాత్మక బంధాన్ని భరించలేకపోయాను..
ఇంటర్వ్యూలో భాగంగా ఎరికా ఫెర్నాండెజ్ మాట్లాడుతూ.. “నేను ఎంతో కాలంగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను. ఆ సమయంలో ముందుకు వెళ్లలేకపోయాను. నా ఈ కెరియర్ లో వచ్చిన కష్టాలు, హెచ్చుతగ్గులు, నమ్మక సమస్యలు ఇలాంటి ఎన్నో చూశాను. అవన్నీ కూడా అనుభవాలుగా నన్ను మార్చేశాయి. నేను చాలా హింసాత్మక సంబంధాన్ని అనుభవించాను. శారీరకంగా వేధింపులు కూడా ఎదుర్కొన్నాను అయితే ఆ సమయంలో నేను దీని గురించి చెప్పాలని అనుకోలేదు. ఎందుకంటే ఒక నటిగా ఉన్నప్పుడు ప్రతి విషయం కూడా ఒక వార్త గానే మారుతుంది. ఇక పోలీసుల వద్దకు వెళ్తే మీడియాలోకి వస్తుంది. ఆపై విచారణ కొంతమంది పబ్లిసిటీ కోసం ఇలా చేస్తుంది అంటారు.. ఇలాంటివన్నీ నాకు అవసరం లేదనిపించే నేను పోలీసుల వద్దకు వెళ్లలేదు.”
న్యాయ వ్యవస్థ పై నాకు నమ్మకం లేదు..
“ముఖ్యంగా న్యాయ వ్యవస్థను నేను నమ్మను. పోలీసులపై నమ్మకం లేక మౌనంగా ఉండిపోయాను. నేనే కాదు నా లాంటి ఎంతోమంది మహిళలు బంధంలో నలిగిపోతున్న.. బయటకు మాత్రం నోరు విప్పి మాట్లాడరు. ముఖ్యంగా సమాజం మాలాంటి వాళ్లను లక్ష్యంగా చేసుకొని చిత్ర విచిత్రంగా ప్రశ్నిస్తారు..? ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నావు.? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు..? అంటూ.. మనం ఏ విషయం గురించైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ముందుకొచ్చి ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పగలం. అలా ధైర్యం లేనప్పుడు ఎదుటి వారికి కూడా చెప్పలేని పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి ఎన్నో దారుణమైన సంఘటనలను నేను ఎదుర్కొన్నాను”.. అంటూ ఎరికా చెప్పుకొచ్చింది మొత్తానికైతే రిలేషన్షిప్ లో తాను పడ్డ కష్టాల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు ఎరికా.. ప్రస్తుతం ఈమె కష్టాలు విని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ఆ బాధ నుంచి బయటపడి ఇండస్ట్రీలోకి రావాలని కోరుకుంటున్నారు. మరి ఎరికా నెక్స్ట్ స్టెప్ ఏ రకంగా ఉంటుందో చూడాలి.