Prabhas: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కానీ ఒకప్పుడు తెలుగు అభిమానులు ముద్దుగా ప్రభాస్ ను డార్లింగ్ అని పిలుచుకునేవారు. డార్లింగ్ అనే పదానికి ప్రభాస్ బ్రాండ్ అంబాసిడర్ అని కూడా చెప్పొచ్చు. అందుకే దర్శకుడు కరుణాకర్ డార్లింగ్ అనే టైటిల్ తో ప్రభాస్ హీరోగా సినిమా చేసి మంచి సక్సెస్ అందించాడు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కింది. ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కటం అనేది ఆనందకరమైన విషయమే. కానీ ఇదివరకు ప్రభాస్ లో ఉండే ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఈ మధ్యకాలంలో కంప్లీట్ గా మిస్ అయిపోయింది. ప్రభాస్ కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ముఖ్యంగా బుజ్జిగాడు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
కాంట్రవర్సీకి దూరంగా
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రభాస్ బుజ్జిగాడు సినిమా చేస్తున్న తరుణంలో, జగన్ ను ప్రభాస్ డార్లింగ్ డార్లింగ్ అంటూ పిలిచేవాడు. అయితే ప్రభాస్ నన్ను మాత్రమే డార్లింగ్ అని పిలుస్తున్నాడు అంటూ పూరి జగన్నాథ్ తెగ ఫీల్ అయిపోయారు. కట్ చేస్తే ప్రభాస్ అందర్నీ అలానే పిలుస్తాడు అని తెలుసుకున్నారు. ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో ప్రభాస్ సినిమాలు కాంట్రవర్సీకి గురి అవుతున్నాయి. తను నటించిన ఆదిపురుష్ సినిమా అప్పట్లో కాంట్రవర్సీకి గురి అయింది. కానీ దానిలో పెద్దగా ప్రభాస్ పేరు కూడా వినిపించలేదు. ఇప్పుడు స్పిరిట్ సినిమా విషయంలో కూడా చాలా వివాదం నడిచింది. హీరోయిన్ సందీప్ రెడ్డివంగా తొలగించారు. ఇప్పుడు కూడా ప్రభాస్ పేరు బయటకు రాలేదు. తన సినిమా కాంట్రవర్సీ అయినా కూడా ప్రభాస్ వీటికి దూరంగా ఉండటమే చాలామంది అభిమానులకు నచ్చిన విషయం. అందుకే ప్రభాస్ నిజమైన డార్లింగ్ అనేది వాళ్ళ అభిప్రాయం.
అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ తో బిజీ
ఇక ప్రభాస్ విషయానికొస్తే ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరో లేనంత బిజీగా మారిపోయాడు. ఒకేసారి చాలామంది దర్శకులకు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో జరగబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అలానే మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ సినిమాల్లో ఇది ముందుగా విడుదల అయ్యే అవకాశం ఉంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు ప్రభాస్. ఈ సినిమాలో ప్రభాస్ ను సందీప్ ఎలా చూపించబోతున్నాడు అని క్యూరియాసిటీ చాలామందికి ఉంది.
Also Read : Pawan Kalyan : అన్నంత పని చేసిన పవన్ కళ్యాణ్, జనసేన నేత పై వేటు