EPAPER

Telangana Cabinet: దసరా లోపే క్యాబినెట్ విస్తరణ… వీళ్లకు మంత్రులుగా ఛాన్స్!

Telangana Cabinet: దసరా లోపే క్యాబినెట్ విస్తరణ… వీళ్లకు మంత్రులుగా ఛాన్స్!

– ఖర్గేను పరామర్శించిన సీఎం
– కేసీ వేణుగోపాల్‌తో కీలక భేటీ
– రాష్ట్ర రాజకీయాలపై లోతైన చర్చ
– దసరా లోపే క్యాబినెట్ విస్తరణ
– నామినేటెడ్ పోస్టులపైనా క్లారిటీ


న్యూఢిల్లీ, స్వేచ్ఛ: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీబిజీగా సాగుతోంది. ఢిల్లీలో పలువురు కాంగ్రెస్‌ పెద్దలను కలవనున్నారు. మంగళవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో సమావేశం ముగిసింది. అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన ఖర్గేను సీఎం మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై జాతీయ అధ్యక్షుడితో చర్చించారు. జమ్మూ కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ అనుకోకుండా అనారోగ్యానికి గురై, చికిత్స పొందుతున్న ఖర్గేను పరామర్శించేందుకే సీఎం ఢిల్లీ వెళ్లారని సీఎంఓ వర్గాలు తెలిపాయి. హర్యానా, కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో హైకమాండ్ నేతలు బిజీగా ఉన్నందున ఈ పర్యటనలో వారితో సీఎం సమావేశమయ్యే అవకాశం లేదని పేర్కొన్నాయి.

Also Read: అక్కకు జరిగిన అవమానం అది.. వకీలుగా తమ్ముడు కోర్టుకు ఈడుస్తాడు : ఎంపీ రఘునందన్‌


కేసీ వేణుగోపాల్‌తో భేటీ..

మంగళవారం ఆయన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో టీపీసీసీ కార్యవర్గ కూర్పుతో బాటు క్యాబినెట్ విస్తరణ, పెండింగ్ నామినేటెడ్ పోస్టుల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. బీసీ కులగణన, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ ప్రణాళికల వంటి అంశాలనూ ముఖ్యమంత్రి కేసీ వేణుగోపాల్‌కు వివరించినట్లు తెలుస్తోంది. నూతన టీపీసీసీ చీఫ్ వచ్చిన తర్వాత జిల్లాల వారీగా చేపట్టిన సమీక్షలు, రాష్ట్రంలోని వర్తమాన రాజకీయ పరిస్థితులు, పొంగులేటి మీద జరిగిన ఈడీ దాడుల గురించి సీఎం కేసీ వేణుగోపాల్‌కు వివరించినట్లు సమాచారం.

దసరాలోపు మంత్రివర్గ విస్తరణ

మరోవైపు..తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న క్యాబినెట్ విస్తరణపై ఇప్పటికే అధిష్ఠానం క్లారిటీ ఇచ్చిందనీ, హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత క్యాబినెట్ విస్తరణ ఖాయమని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబరు 8న హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలు రానున్నందున, అక్టోబరు 12 నాటికి మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అదే సమయంలో పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టులపైనా ఈ పర్యటనలో క్లారిటీ రానుందని, అక్టోబరు 8 తర్వాత మరోసారి ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి పెండింగ్ అంశాలకు ఆమోదముద్ర వేయించుకుని రానున్నారని టీపీసీసీ నేతలు చెబుతున్నారు.

Also Read: మూసీ కూల్చివేతలు షురూ!.. కానీ, అక్కడికి బుల్డోజర్లు వెళ్లలేని పరిస్థితి.. మరి వాటిని కూల్చివేయడం ఎలా..?

Related News

Malla Reddy – CM Revanth: సీఎం రేవంత్‌ని కలిసిన మల్లారెడ్డి.. రాజకీయాలపై చర్చ

TG DSC 2024: తెలంగాణలో కొత్త టీచర్లకు నియామక పత్రాలు, సీఎం రేవంత్ న్యూరికార్డ్

Revanth On Musi River: విపత్తులు అరికట్టాలంటే తప్పదు.. అందరికీ న్యాయం చేస్తామన్న సీఎం రేవంత్

Saddula Bathukamma 2024: కన్నుల పండుగగా సద్దుల బతుకమ్మ…ప్రాముఖ్యత ఇదే !

Hyderabad Metro Rail: మెట్రో రెండో దశ ప్రాజెక్టు ప్రతిపాదనలు.. 5 కారిడార్లకు రూ.24,269 కోట్ల వ్యయం

Harishrao: పండుగ సమయంలోనూ జీతాలివ్వరా..? ఇదేనా ప్రజా పాలన..? : హరీష్ రావు

SC Sub-Categorisation: ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్.. 2011 జనాభా లెక్కల ప్రకారమే..

×