Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ రేంజ్ కి ఎదిగారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎదిగారు. ఆ సినిమా తర్వాత శంకర్ సినిమా గేమ్ చేంజర్ లో నటించారు. ఆ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలై మంచి రెస్పాన్స్ ని అందుకుంది. పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ డీసెంట్ హిట్ ని అందుకుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా తీయడానికి దర్శకులు పోటీ పడుతున్నారు. ఆయన ఓకే అంటే సినిమా తీయడానికి రెడీగా ఉన్నారు. అయితే రామ్ చరణ్ దగ్గర క్యూ కడుతున్న ఆ దర్శకులు ఎవరు? గ్లోబల్ స్టార్ ఎవరికి అవకాశం ఇవ్వనున్నారు..
పెద్ది తరువాత ..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజెర్ సినిమా తర్వాత, ఉప్పెన డైరెక్టర్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా టైటిల్ను రిలీజ్ చేశారు మూవీ టీం. రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వం లో వస్తున్న సినిమా పెద్ది. ఈ సినిమా తరువాత రామ్ చరణ్ సుకుమార్ కి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే సుకుమార్ కథ సిద్ధం చేయడానికి సినిమా తీయడానికి సంవత్సరం పట్టే అవకాశం ఉన్నందున ఈలోపే రామ్ చరణ్ మరో దర్శకుడు కి అవకాశం ఇస్తారని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న డైరెక్టర్స్ మెగా పవర్ స్టార్ ఇంటికి క్యూ కడుతున్నారు. ఇప్పటికే స్టోరీ లైన్ తో, రామ్ చరణ్ కి కథ చెప్పడానికి వెళ్తున్న డైరెక్టర్స్ లిస్టు పెరిగిపోతుంది. గత మూడు సంవత్సరాలుగా ఈ టాప్ డైరెక్టర్ అంతా చరణ్ తో ప్రాజెక్టు చేయడానికి, ఆయన్ని సంప్రదిస్తూనే ఉన్నట్లు సమాచారం. రామ్ చరణ్ ఏ డైరెక్టర్ తో ఎవరితో ఓకే చెప్పినా, ఆయనతో సినిమా తీయడానికి టాలీవుడ్, కోలీవుడ్ నుంచి నిర్మాతలు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఒక్క హీరో కోసం .. ఇంత పోటీ నా ..
ఆ లిస్టులో మొదటి పేరు నిఖిల్ నగేష్ గా వినిపిస్తుంది. కిల్ సినిమాతో ఆకట్టుకున్న ఈ దర్శకుడు ఇప్పుడు రామ్ చరణ్ కు ఒక స్టోరీ లైన్ వినిపించినట్లు తెలుస్తుంది. అదే లిస్టులో ప్రశాంత్ నీల్ పేరు వినిపిస్తుంది. సలార్ సినిమాతో ప్రభంజనం సృష్టించిన ఈ డైరెక్టర్ ఇప్పుడు రామ్ చరణ్ తో సినిమా సినిమా చేయడానికి రెడీ అయినట్టు సమాచారం. ఇదే లిస్టులో మరో టాప్ డైరెక్టర్ పేరు వినిపిస్తుంది ఆయనే సందీప్ రెడ్డి వంగా, అర్జున్ రెడ్డి తో మన ముందుకు వచ్చి, రణబీర్ కపూర్ తో యానిమల్ సినిమా చేసి టాప్ డైరెక్టర్ ల లిస్టులో నిలిచిన సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు రామ్ చరణ్ కి ఒక స్టోరీ లైన్ వినిపించినట్లు సమాచారం. ఇక ఇదే లిస్టులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేరారు. చరణ్ కు స్టోరీ లైన్ వినిపించినట్లు తెలుస్తుంది. వీరితోపాటు రాజు హిరని, నర్తన్, లోకేష్ కనకరాజ్, కూడా చేరినట్లు తెలుస్తుంది. ఇంతమంది టాప్ డైరెక్టర్స్ రామ్ చరణ్ తో సినిమా చేయడానికి పోటీ పడుతుంటే చరణ్ ఏ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తాడా అని, అభిమానులు ఎదురుచూస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న పెద్ది సినిమా రీసెంట్ గా వచ్చిన గ్లింప్స్ వీడియో తో చరణ్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాడు.
Akkada Ammayi ikkada Abbayi : కమెడియన్ కాళ్లు మొక్కిన రామ్ చరణ్… షాక్ అయిన ప్రదీప్