Chhattisgarh Naxal Attack: ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లాలో కుట్రూ ఖేద్రే రహదారిలో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీ బాంబుతో పేల్చి వేయడంతో 10 మంది జవాన్లు మృతిచెందారు.
మొత్తం వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నారు. అందులో 10 మంది మృతచెందగా.. మరో ఐదుగురు జవాన్లుకు తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భద్రతా బలగాలు సంఘటనా స్థలంకు చేరుకొని గాయపడిన జవాన్లను బీజాపూర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చనిపోయిన పది మందిలో తొమ్మిది మంది దంతెవాడ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ జవాన్లు, ఒక డ్రైవర్ ఉన్నారు. దంతేవాడ, నారాయణపూర్ – బీజాపూర్ జిల్లాల నుంచి DRG బృందాలు పాల్గొన్న జాయింట్ ఆపరేషన్ తర్వాత సిబ్బంది తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది. తిరిగి వస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.
అబూజ్ మడ్ ఏరియాలో మావోయిస్టుల ఏరి వేత కోసం గత నాలుగు రోజులుగా కూంబింగ్ కొనసాగుతుంది. కూంబింగ్ ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో మావోయిస్టులు పక్కా ప్లాన్‌తో మందుపాతరతో దాడి చేశారు. గత మూడు రోజులు బట్టి బీజాపూర్ సుక్మా దంతివాడ కాంకేర్ జిల్లాలకు సంబంధించిన భద్రతా బలగాలు అదే ఏరియాలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన అబూజ్ మడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మృతి చెందారు.
Also Read: Jobs in Canara Bank: సువర్ణవకాశం.. కెనెరా బ్యాంకులో జాబ్స్.. రూ.27లక్షల వరకు జీతం..
ఇటీవల కాలంలో సైనికులు ఇంత పెద్ద సంఖ్యలో చనిపోవడం ఇదే కావటంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయింది. గత ఏడాది పోలీసుల చేతుల్లో సుమారు 260 మంది మావోయిస్టులు వరకు కూడా చనిపోయారు. ఇటీవల కాలంలో జవాన్లపై ఇంత భారీ ఘటన చోటుచేసుకోలేదు. దీంతో బీజాపూర్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మావోయిస్టుల దారుణ ఘటనల వల్ల పోలీస్ అధికారులు, భద్రతా బలగాలు జాగ్రత్తగా ఉండాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.