Guru Randhawa: సినిమాలు తెరకెక్కిస్తున్నప్పుడు మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా యాక్షన్ స్టంట్స్ చేయాలంటే లెక్కలేనన్ని జాగ్రత్తలు తీసుకుంటే కానీ చేయలేదు. ఒకప్పుడు ఇలాంటి యాక్షన్ సీన్స్‌లో నటించడానికి హీరోలకు డూప్స్ ఉండేవారు. కానీ గత కొన్నేళ్లలో ఈ యాక్షన్ సీన్స్ కూడా తామే చేస్తామంటూ హీరోలు ముందుకొస్తున్నారు. దానివల్ల గాయాలు అయినా కూడా పట్టించుకోవడం లేదు. అలా ఏవేవో స్టంట్స్ చేయబోయి ఒక ప్రముఖ బాలీవుడ్ పంజాబీ సింగర్ హాస్పిటల్ బెడ్‌పై పడ్డాడు. ఎన్నో ఆల్బమ్ సాంగ్స్‌తో హిందీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు గురు రాంధవా. తాజాతా తను హాస్పిటల్ బెడ్‌పై గాయాలతో ఉన్న ఫోటోలు షేర్ చేయడంతో ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు.
ఆ ఒక్క పాటతో
మామూలుగా బాలీవుడ్‌లో ఆల్బమ్ సాంగ్స్‌కు ఉండే క్రేజే వేరు. అది కూడా హిందీ, పంజాబీ కలిపి ఫ్యూజన్ చేస్తే దానికి మ్యూజిక్ లవర్స్ ఫిదా అయిపోతుంటారు. అలా ఒక పంజాబీ సింగర్‌గా ఫ్యూజన్ మ్యూజిక్ చేయడానికి బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు గురు రాంధవా. అందరి లాగానే తను కూడా పాటలు పాడుతూ వాటిని యూట్యూబ్‌లో, మ్యూజిక్ యాప్స్‌లో విడుదల చేశాడు. అలా తన కెరీర్ ప్రారంభించిన కొన్నాళ్ల తర్వాత ‘లాహోర్’ అనే పాటను రిలీజ్ చేశాడు. ఆ సాంగ్ విడుదలయిన తర్వాత రాంధవా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇన్‌స్టాంట్‌గా రాక్‌స్టార్ అయిపోయాడు. అలా బాలీవుడ్‌లో గురు రాంధవాకు ఫ్యాన్ బేస్ కూడా బాగా పెరిగింది.
చాలా కష్టం
గురు రాంధవా (Guru Randhawa) ఆల్బమ్ సాంగ్స్‌కు ఫిదా అయిన బాలీవుడ్ మేకర్స్.. వాటిని తమ సినిమాల్లో ఉపయోగించుకోవడం మొదలుపెట్టారు. తను ఏ పాట పాడినా కూడా అందులో తనే యాక్ట్ చేసి తన స్టైల్‌తో అందరినీ ఆకట్టుకునేవాడు రాంధవా. అలా తనకు హీరోగా మొదటి సినిమా అవకాశం దక్కింది. ఆ సినిమా సెట్‌లో గాయం కారణంగానే తాను హాస్పిటల్ బెడ్‌పై ఉన్నానని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చాడు ఈ ఫేమస్ సింగర్. ‘నా మొదటి స్టంట్, నా మొదటి గాయం, కానీ నా ధైర్యం మాత్రం అలాగే ఉంది. ఇది షౌంకీ సర్దార్ సినిమా సెట్స్‌లో మిగిలిపోయే ఒక జ్ఞాపకం. యాక్షన్ చేయడం చాలా కష్టం. కానీ నా ఆడియన్స్ కోసం ఏదైనా చేస్తాను’ అని చెప్పుకొచ్చాడు రాంధవా.
Also Read: కంగనా సోదరిపై మండిపడ్డ తాప్సీ.. అసలేమైందంటే.?
నవ్వుతూ ఫోటో
గురు రాంధవా గాయాల నుండి త్వరగా కోలుకోవాలని తన ఫ్యాన్స్ అంతా కామెంట్స్ పెడుతున్నారు. అయినా కూడా తను నవ్వుతూ బాగానే ఉన్నానంటూ తన ఫ్యాన్స్‌కు హామీ ఇస్తున్నాడు ఈ సింగర్. ముఖ్యంగా పంజాబీ సింగర్స్‌కు బాలీవుడ్‌లో బాగా క్రేజ్ ఉంది. వారు పాటల వరకే పరిమితం అయినా కూడా వారిని హీరోలుగా మార్చి బీ టౌన్ ప్రేక్షకులకు పరిచయం చేస్తారు మేకర్స్. ఇప్పుడు ఆ లిస్ట్‌లో గురు రాంధవా కూడా యాడ్ అవ్వనున్నాడు. త్వరగా తను కోలుకొని తన సినిమా సెట్‌లో అడుగుపెడితే చూడాలని ఉందంటూ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
Take care of yourself, man! You're way too precious for us to see you like this, Why are you hurting yourself for a movie? 😞 I know you give your best in everything you do, but this is really concerning..@GuruOfficial #GuruRandhawa pic.twitter.com/yX6Zd87pr7
— 𐙚 (@khushi751) February 23, 2025