Pet Cockroach| మంచి చేద్దామనుకొని ఒక యువకుడిని సాయం చేసేందుకు వెళ్లిన ఒక యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. పైగా ఆ యువకుడు ఆమెపై కోపడ్డాడు. ఆమెపై ఆగ్రహంగా అరిచాడు. ఈ విచిత్ర ఘటన థాయ్ ల్యాండ్ దేశంలో జరిగింది. ఆ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆ వైరల్ వీడియోలోని దృశ్యాల చూస్తే.. మంకీ క్యాప్ లాంటి మాస్క్ ధరించిన ఒక ఫారిన్ యువకుడు థాయల్యాండ్ మార్కెట్ లో తిరుగుతూ కనిపించాడు. అతని తలపై పెద్ద కాక్రోచ్ ఉండగా.. దాన్ని గమనించిన ఓ స్థానిక యువతి.. ఆ యువకుడి తలపై నుంచి ఆ కాక్రోచ్‌ని తొలగించడానికి తన చేత్తో అతని తలపై విదిలించింది. అంతే ఆ యువకుడు ఒక్కసారిగా ఆమెపై కోపడ్డాడు. ఎగిరి గంతేసి.. తన మాస్క్‌ను ఒక్కసారిగా తొలగించి.. “ఏం చేస్తున్నావ్? అది నా పెట్ (నా పెంపుడు జంతువు). నా బేబీ”, అని గట్టిగా అరిచాడు. ఆ తరువాత కింద పడిపోయిన తన కాక్రోచ్ కోసం ఆందోళన పడుతూ వెతకడం ప్రారంభించాడు. అది కనబడ్డాక శాంతించి దాన్ని తిరిగి తన శరీరంపై ఎక్కించుకునేందుకు తన చేయిని ఆ కాక్రోచ్ కు అందించాడు. ఆ కాక్రోచ్ మెల్లగా అతని చేయిని తాకుతూ అనతి భుజంపైకి ఎక్కేసింది.
Also Read: తేనెటీగలు లేకపోతే మనుషలు లేరు.. పర్యావరణానికి పొంచి ఉన్న ప్రమాదం
ఈ వీడియో చూసి నెటిజెన్లంతా షాకైపోయారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా నవ్వు ఆపుకోలేని విధంగా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోపై ఒక యూజర్ కామెంట్ చేస్తూ.. “థ్యాక్ గాడ్ అది చీమ కాదు. లేకపోతే.. దాన్ని జీవితమంతా వెతికేందుకు సరిపోయేది”. ఇంకొకరైతే.. “అతను ఎగిరి గంతేశాడు. ఎలాగో అది అతని కాళ్ల కింద నలిగిపోలేదు.” అని రాస్తే.. మరకొ యూజర్.. “మా దేశంలో ప్రతి ఇంట్లో అతని పెంపుడు జంతువులు ఉన్నాయి. మరిచిపోయి వదిలివెళ్లిపోయాడు. దయచేసి తీసుకెళ్లమని చెప్పండి” అని కామెంట్ చేశాడు.
ఇలా ఇంకో యూజర్ అయితే.. “కనీసం పబ్లిక్ లో వెళ్లేటప్పుడు దానికి మెడకు ఒక బెల్ట వేయొచ్చు కదా.. ముందే రోజులు బాగోలేవు” అని చాలా ఫన్నీ కామెంట్ చేశాడు. ఒక చైనా యూజర్ అయితే.. “ఎలాగో ఈ ఘటన చైనాలో జరగలేదు లేకపోయి ఉంటే ఆ కాక్రోచ్ ని చైనాలో ఆహారంగా తినేసేవారు” అని రాశాడు. ఇంతకీ ఒక కాక్రోచ్ ని పెంపుడు జంతువుగా పెంచుకోవచ్చా? మీ అభిప్రాయమేంటి?