EPAPER

Harsha Sai: హర్ష సాయిపై మరో కేసు నమోదు.. అలా కూడా మోసం చేశాడట!

Harsha Sai: హర్ష సాయిపై మరో కేసు నమోదు.. అలా కూడా మోసం చేశాడట!

Harsha Sai Case: ప్రస్తుతం సినీ పరిశ్రమలో ఒకదాని తర్వాత మరొకటి లైంగిక వేధింపుల కేసులు బయటపడుతున్నాయి. ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తులే ఈ కేసుల్లో నిందితులుగా నిలుస్తున్నారు. అలాగే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నెటిజన్లలో మంచి గుర్తింపు సంపాందిచుకున్నాడు హర్ష సాయి. కొన్నిరోజుల క్రితం హర్ష సాయి తనను లైంగికంగా వేధించాడంటూ ఒక అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. దీంతో హర్ష సాయిపై కేసు నమోదు చేసిన పోలీసులు అప్పటినుండి తనకోసం గాలిస్తూనే ఉన్నారు. ఇంతలోనే తనకు మరొక షాక్ తగిలింది.


మరొక కేసు

కేవలం యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మాత్రమే కాకుండా ఎవరు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నారని తెలిసినా వెంటనే వెళ్లి వారికి సాయం చేసేవాడు హర్ష సాయి. దీంతో మిడిల్ క్లాస్ జనాల్లో హర్ష సాయికి విపరీతమైన పాపులారిటీ పెరిగింది. అసలు అలా కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడం కోసం తనకు డబ్బులు ఎలా వస్తున్నాయి అని కూడా చాలామందిలో అనుమానం కలిగింది. అయినా కూడా అవేమీ పట్టించుకోకుండా ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా చాలామందికి ఆర్థిక సాయం చేయడం మొదులపెట్టాడు. ఇప్పుడు ఆ ఫౌండేషన్‌పైనే కేసు నమోదలయ్యింది. ఇప్పటికే లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న హర్ష సాయి.. మరొక కేసులో చిక్కుకున్నాడు.


Also Read: హర్ష సాయి ఆచూకీ లభ్యం… ప్రపంచ యాత్రికుడితో కలిసి అడ్డంగా బుక్ అయ్యాడుగా

గాలింపు చర్యలు

హర్ష సాయి ఫౌండేషన్‌పై రాచకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. సహాయం చేస్తానని చెప్పి ముందుకు తన దగ్గర రూ.5.4 లక్షలు తీసుకొని మోసం చేశాడని ఒక బాధితుడు రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు హర్ష సాయిపై 406, 419, 420 ఐపీసీ, 66 సీ, 66 డీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే లైంగిక వేధింపుల కేసు విషయంలో హర్ష సాయిపై కేసు నమోదలయ్యి పోలీసులు తనకోసం గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయినా ఇంకా తన ఆచూకీ తెలియలేదు. తను ఎక్కడ ఉన్నాడు అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. హర్ష సాయికి ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో చాలామంది స్నేహితులు ఉన్నారు. అందులో ఎవరో ఒకరి దగ్గరకు వెళ్లి తలదాచుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

న్యాయంగా పోరాడతాను

ఇక హర్ష సాయి లైంగిక వేధింపుల కేసు విషయానికొస్తే.. సోషల్ మీడియాలో పాపులర్ అయిన తను సినిమాల్లోకి రావాలనుకున్నాడు. ‘మెగా’ అనే సినిమాతో హీరోగా లాంచ్ అవ్వాలనుకున్నాడు. దానిని తానే నిర్మించాలని అనుకున్నాడు. ఆ విషయంలోనే ఒక అమ్మాయితో తనకు విభేదాలు వచ్చాయి. అయితే తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని, తన దగ్గర నుండి రూ.2 కోట్లు డబ్బు కూడా తీసుకున్నాడని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు హర్ష సాయిపై కేసు నమోదు చేశారు. బాధితురాలు చేస్తున్నవి అబద్ధపు ఆరోపణలు అని, తాను న్యాయంగా ఈ విషయంలో పోరాడతానని ప్రకటించిన హర్ష సాయి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

Related News

Martin Movie Review : మార్టిన్ మూవీ రివ్యూ…

Fahadh Faasil: 100 కోట్ల హీరో అని చెప్పండ్రా ఈయనకు.. మరీ సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు

Viswam: మాస్ సాంగ్ అదిరింది.. కావ్య అందాలు అయితే నెక్స్ట్ లెవెల్..

Tollywood Heroine: బూరె బుగ్గలతో ముద్దొస్తున్నఈ చిన్నారి.. ఇప్పుడు యమా హాట్ బ్యూటీ.. గుర్తుపట్టండి చూద్దాం

Soundarya: సౌందర్య నిర్మించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా..?

Thiruveer: మసూద హీరో ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’.. చీఫ్ గెస్ట్ గా రానా..

Vettaiyan : రానా మళ్లీ అదే మిస్టేక్ చేస్తున్నాడు.. ఇకనైనా మారండి బాస్..!

Big Stories

×