BigTV English

Vidudhala 2 Twitter Review: ‘విడుదల 2’ ట్విటర్ రివ్యూ.. విజయ్ సేతుపతి హిట్ కొట్టాడా.?

Vidudhala 2 Twitter Review: ‘విడుదల 2’ ట్విటర్ రివ్యూ.. విజయ్ సేతుపతి హిట్ కొట్టాడా.?

Vidudhala 2 Twitter Review: డిసెంబర్ 20న పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధపడ్డాయి. అందులో విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘విడుదల 2’ ఒకటి. మామూలుగా ఒక సినిమా హిట్ అయితే దాని సీక్వెల్ కచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ ఉంది. చాలావరకు సినిమాలకు అదే పరిస్థితి కలిగింది కూడా. కానీ ‘విడుదల 2’ మాత్రం అలా జరగదు అని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. 2023లో విడుదలయిన ‘విడుదల’ చిత్రానికి ఇది ప్రీక్వెల్‌గా తెరకెక్కింది. ‘విడుదల’లో విజయ్ సేతుపతి కేవలం గెస్ట్ రోల్‌లోనే కనిపించాడు. కానీ ‘విడుదల 2’ సినిమా మాత్రం పూర్తిగా తనపైనే ఆధారపడి ఉంటుంది. మరి ఈ హీరో ‘విడుదల 2’తో హిట్ కొట్టాడా? లేదా?


ప్రీక్వెల్ ఎలా ఉంది.?

తమిళంలో డిఫరెంట్ సినిమాలు తెరకెక్కిస్తూ కాంట్రవర్సీలకు భయపడని డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు వెట్రిమారన్. అందుకే తనకు తమిళంలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా భారీ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమాల్లో ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడం వెట్రిమారన్ స్పెషాలిటీ. అలాగే ఏడాది క్రితం ఒకప్పుడు పోలీసులు ఎలా ఉండేవారు, వారిని ఎదిరించడానికి మావోయిస్టులు ఏం చేసేవారు అనే కథతో ‘విడుదల’ను తెరకెక్కించాడు. ఆ సినిమా ఏ అంచనాలు లేకుండా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అప్పుడే ఈ మూవీకి ఒక ప్రీక్వెల్ కూడా ఉంటుందని అనౌన్స్ చేశారు మేకర్స్. అలా ఏడాది తర్వాత ‘విడుదల 2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.


Also Read: ‘ముఫాసా’ ట్విటర్ రివ్యూ.. ఈ ప్రీక్వెల్ ప్రేక్షకులను అలరించిందా.?

మావోయిస్ట్ కథ

‘విడుదల’లో సూరి ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. అలాగే విజయ్ సేతుపతి (Vijay Sethupathi) మావోయిస్ట్‌గా గెస్ట్ రోల్‌లో కనిపించాడు. ఆ సినిమాలో విజయ్ సేతుపతి కేవలం క్లైమాక్స్‌లో మాత్రమే కనిపిస్తాడు. అయితే తను మావోయిస్ట్‌గా మారడానికి కారణాలు ఏంటి, పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎలా అవుతాడు అనే అంశాలపై ‘విడుదల 2’ (Vidudhala 2) ఉండబోతుందని అప్పుడే క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇక ఈ ప్రీక్వెల్‌లో విజయ్ సేతుపతికి జోడీగా మంచు వారియర్ నటించింది. వీరిద్దరి మధ్య ఒక క్యూట్ లవ్ స్టోరీని కూడా యాడ్ చేశాడు దర్శకుడు వెట్రిమారన్. అలా ఈ సినిమాలో మరెన్నో అంశాలు ఆకట్టుకునేలా ఉన్నాయని ప్రేక్షకులు అంటున్నారు.

అంచనాలు అందుకుందా.?

‘విడుదల’లాగానే ‘విడుదల 2’ కూడా థ్రిల్లంగ్ ఎలిమెంట్స్‌తో నిండిపోయిందని ఆడియన్స్ పాజిటివ్ రివ్యూ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా హైప్ క్రియేట్ చేయడం కోసం విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి కలిసి చాలానే ప్రమోషన్స్ చేశారు. ‘విడుదల’ చూసిన తెలుగు ప్రేక్షకులు.. ఈ ప్రీక్వెల్ కూడా బాగుంటుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. చాలావరకు ఈ సినిమాకు ట్విటర్‌లో పాజిటివ్ రివ్యూలే కనిపిస్తున్నాయి. కానీ కొందరు ఆడియన్స్ మాత్రం సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయని, ఆ అంచనాలను అందుకోలేకపోయిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×