HBD Balakrishna : టాలీవుడ్ స్టార్ హీరో, నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna) నేడు తన పుట్టినరోజు (Birthday)వేడుకలను జరుపుకుంటున్నారు. జూన్ 10వ తేదీ బాలయ్య పుట్టినరోజు కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఈ పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ నిర్వహించడమే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక బాలయ్య పుట్టినరోజు కావడంతో నిన్ననే బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 సినిమా నుంచి టీజర్ విడుదల చేస్తూ అభిమానులకు మంచి బూస్ట్ ఇచ్చారు.
బసవతారకం హాస్పిటల్…
ప్రస్తుతం అఖండ 2 సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాని ఈ ఏడాది దసరా లేదా డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని సమాచారం. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో వచ్చే సినిమా అంటే బాక్స్ ఆఫీస్ రికార్డులను సృష్టించడం ఖాయం అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇకపోతే బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఎప్పటిలాగే హైదరాబాదులోని బసవతారకం హాస్పిటల్ లో పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఇలా బసవతారకం హాస్పిటల్ కి వెళ్లిన బాలకృష్ణ అక్కడ తన తల్లిదండ్రుల విగ్రహాలకు పూలమాలలు వేసి నమస్కరించుకొని అనంతరం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న క్యాన్సర్ పేషెంట్లకు పండ్లను అందజేశారు.
పిల్లల సమక్షంలో…
ఇక బాలకృష్ణ బసవతారకం హాస్పిటల్ లోనే క్యాన్సర్ పేషెంట్ల సమక్షంలో కేక్ కట్ చేసే స్వయంగా ఆయనే పిల్లలకు కేక్ తినిపిస్తూ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే బసవతారకం హాస్పిటల్ కి బాలకృష్ణ రాబోతున్నారనే విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు బాలయ్య బయట కనిపించగానే ఒక్కసారిగా తనని చుట్టుముడుతూ తనతో సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు.
ఏయ్….. ఫ్యాన్స్‌ని నెట్టకండి.. బాలయ్య మాస్ వార్నింగ్…. 🔥🔥#Balakrishna #Akandha2 #HappyBirthdayNBK #Akhanda2Teaser #Akhanda2Thaandavam #NBKBirthdayMonth #nbkbirthday pic.twitter.com/1bnEoyyO3k
— TeluguOne (@Theteluguone) June 10, 2025
ఇలా అభిమానులు ఒక్కసారిగా తోసుకొని రావడంతో ఆయన బౌన్సర్లు అభిమానులను పక్కకు నెట్టే ప్రయత్నం చేశారు. బౌన్సర్లు అభిమానులను పక్కకు నెట్టుతున్న సమయంలో బాలయ్య తన బౌన్సర్లకు వార్నింగ్ ఇస్తూ.. ఏయ్ ఫ్యాన్స్ ను టచ్ చెయ్యొద్దని చెప్పారు. బాలయ్య ఇలా వార్నింగ్ ఇవ్వడంతో బౌన్సర్లు ఎక్కడికక్కడ ఆగిపోయారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఇక ఈ వీడియోలు చూసిన అభిమానులు బాలయ్య మంచి మనసుకు ఫిదా అవుతున్నారు. సాధారణంగా బాలయ్య తనపైకి అభిమానులు దూసుకు వస్తే తానే స్వయంగా అభిమానులను ఒక దెబ్బ కొడతారే తప్ప తన బౌన్సర్ల చేత అభిమానులను ఎప్పుడు కొట్టించరు. ఇలా ఒకరికి దెబ్బ పడితే మిగిలిన వారందరూ సైలెంట్ అవుతారని అందుకే నేనే కొడతాను అంటూ పలు సందర్భాలలో బాలయ్య ఈ విషయాన్ని తెలియచేసారు.