Meenakshi Chaudhary: ఇండస్ట్రీలో పుకార్లు సర్వసాధారణమే. ఒక సినిమా హిట్ అయితే.. ఆ జంట కలిసి కనిపిస్తే వారిద్దరి మధ్య ఏదో ఉందని పుకార్లు మొదలవుతాయి. ఇద్దరు ఎయిర్ పోర్ట్ లో కనిపిస్తే వెకేషన్ కు వెళ్తున్నారని, రెస్టారెంట్ లో కనిపిస్తే ప్రేమలో ఉన్నారని.. ఇలా ఇష్టమొచ్చినట్లు సెలబ్రిటీల గురించి సోషల్ మీడియాలో రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు.
తాజాగా వచ్చిన ఒక పుకారు సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. అదేంటంటే.. అక్కినేని మేనల్లుడు సుశాంత్ తో స్టార్ హీరోయిన్ మీనాక్షీ చౌదరీ పెళ్లి అని.. ఏం మాట్లాడుతున్నార్రా.. ? అసలు అర్థంపర్థం ఉందా.. ? అంటే అలాంటి అర్దాలు లేకుండా పుకార్లు పుట్టించేవారే సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటారు.
వ్యూస్ కోసం, లైక్స్ కోసం.. తమ పేరు ఫేమస్ అవ్వడం కోసం ఇండస్ట్రీలో పరిచయం లేనివాళ్లకు కూడా సంబంధాలు అంటగట్టి.. జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు. అలా ఇప్పుడు వీరి పెళ్లి వార్త ట్రెండింగ్ గా మారింది. మీనాక్షీ చౌదరీ.. సుశాంత్ హీరోగా నటించిన ఇచట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో సుశాంత్- మీనాక్షీ జంట ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. అయితే ఈ సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
ఇక ఈ సినిమా నుంచే వీరి పరిచయం మొదలయ్యిందని, ఇప్పుడు ఈ జంట ఇంట్లో ఒప్పించి పెళ్ళికి రెడీ అయ్యారని రెండు మూడు రోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి. మొదట కెరీర్ లో వరుస ప్లాపులను అందుకున్న మీనాక్షీ లక్కీ భాస్కర్ సినిమాతో లక్కీ లేడీగా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు 4 సినిమాలు ఉన్నాయి. పెద్ద పెద్ద స్టార్స్ సరసన నటిస్తోంది. ఇలాంటి టైమ్ లో ఆమె పెళ్లి చేసుకుంటే కెరీర్ కు బ్రేక్ పడినట్లే. ఆ చిన్న ఆలోచన కూడా లేకుండా మీనాక్షీ ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందా.. ? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
Shivanna: జోరు తగ్గించని సీనియర్ హీరో.. స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్
అయితే అసలు నిజం ఏంటంటే.. ఇందులో ఎలాంటి నిజం లేదు. వీరి ప్రేమ, పెళ్లి అంతా ఫేక్. లైక్స్ కోసం, వ్యూస్ కోసం కొన్ని మీమ్ పేజీస్ ఇలా క్రియేట్ చేసాయని తెలుస్తోంది. ఈ వార్తలను మీనాక్షీ పీఆర్ టీమ్ అబద్ధాలని కొట్టిపడేసింది. సోషల్ మీడియాలో వచ్చిన పెద్ద పుకారు ఇదే అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.
ఇక సుశాంత్ కెరీర్ విషయానికొస్తే అక్కినేని హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. స్టార్ హీరోగా ఎదగడానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. ప్రస్తుతం అతని చేతిలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ పుకార్లు విన్న మీనాక్షీ ఫ్యాన్స్.. నోటికీ హద్దు అదుపు లేదారా.. ? ఎలా పడితే అలా రాసేస్తారా ..? అంటూ ఫైర్ అవుతున్నారు. మరి ఈ పుకార్లపై మీనాక్షీ కానీ, సుశాంత్ కానీ స్పందిస్తారేమో చూడాలి.