Karan Arjun: ఒకప్పుడు బాలీవుడ్ ఖాన్స్ కలిసి నటించి ఎన్నో క్లాసిక్ హిట్స్‌ను అందుకున్నారు. అలాంటి క్లాసిక్ హిట్స్‌లో ఒకటి ‘కరణ్ అర్జున్’ (Karan Arjun). రాకేశ్ రోషన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోలుగా నటించారు. ఈ మూవీ విడుదలయ్యి దాదాపు 30 ఏళ్లు అవుతుండడంతో ఇప్పుడు రీ రిలీజ్‌కు సిద్ధమయ్యింది. ఈ రీ రిలీజ్ సందర్భంగా హృతిక్ రోషన్ ఒక స్పెషల్ పోస్ట్‌ను షేర్ చేశాడు. హృతిక్ రోషన్ (Hrithik Roshan)కు ఈ సినిమాతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ‘కరణ్ అర్జున్’తోనే తను మొదటిసారి తన తండ్రిగా అసిస్టెంట్‌గా పనిచేశాడు.
నాన్నకు అసిస్టెంట్‌గా
అప్పట్లో ‘కరణ్ అర్జున్’ సినిమాకు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలో సల్మాన్, షారుఖ్‌తో కలిసి తను దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు హృతిక్ రోషన్. ‘ది కరణ్ అర్జున్ ఎక్స్‌పీరియన్స్. నేను కరణ్, అర్జున్‌లతో కలిసి యంగ్ కబీర్‌లాగా కనిపిస్తున్నానని నాకు తెలుసు. ఒక అసిస్టెంట్‌గా ఈ సినిమా రిలీజ్‌కు మినర్వాను మెయిన్ థియేటర్‌గా ఫిక్స్ చేశాం. నేను, మా నాన్న మరో అసిస్టెంట్ అనురాగ్.. ఇద్దరం రిలీజ్‌కు ప్రింట్‌ను వేసుకొని చూశాం. అది చూసి మేము అందరం చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఎందుకంటే ఆ ప్రింట్ చాలా డల్‌గా, డార్క్‌గా ఉంది’ అంటూ విడుదల సమయంలో కష్టాలను గుర్తుచేసుకున్నాడు హృతిక్ రోషన్.
Also Read: పెళ్లికి ముందే తమన్నా షాకింగ్ నిర్ణయం..?
దుమ్ము దులిపాం
‘స్క్రీన్ మురికిగా ఉండడం వల్లే ప్రింట్ అలా కనిపిస్తుందని అర్థమయ్యింది. అందుకే మేము ఆ స్క్రీన్ మొత్తం కడిగాం. ఆ దుమ్ము మొత్తం పెద్ క్లాత్‌కు అంటుకుంది. ఎన్నో ఏళ్లుగా ఈ స్క్రీన్‌కు ఉన్న దుమ్ము ఇప్పుడు వదిలిపోయింది అని మ్యానేజర్ చెప్పడం నేను విన్నాను. ఇంకొక ఫన్నీ విషయం ఏంటంటే.. భంగ్డా పాలే అనే పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒకరోజు అర్థరాత్రి షారుఖ్, సల్మాన్ తమ టీమ్స్‌తో కలిసి సరిస్కా నుండి ఢిల్లీకి కారులో బయల్దేరారు. ఉదయం వరకు అక్కడికి చేరుకుంటాననే మాటిచ్చారు. నేను ఎటూ తోచక కార్ ఇంజెన్‌పైన దూకాను. వాళ్లను ఆపాలనుకున్నాను. ఉదయం 6 గంటలకే షూటింగ్ మొదలవ్వాలి. మా నాన్నకు ఒక్కరోజు కూడా వేస్ట్ అవ్వకూడదు అన్నదే నా ఉద్దేశ్యం. అనుకున్నట్టుగానే వేస్ట్ అవ్వలేదు’ అని చెప్పుకొచ్చాడు హృతిక్.
మరోసారి థియేటర్లలో
‘17 ఏళ్ల వయసులో సల్మాన్, షారుఖ్ యాక్టింగ్ చూసి నేనే ఎంతో నేర్చుకున్నాను. ఏ యాక్టింగ్ స్కూల్‌లోనూ నేర్చుకోలేనిది నేను ప్రాక్టికల్‌గా ఈ సినిమా సెట్‌లోనే నేర్చుకున్నాను. కరణ్ అర్జున్ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది’ అని ఫ్యాన్స్‌కు తెలిపాడు హృతిక్ రోషన్. ‘కరణ్ అర్జున్’ నవంబర్ 22న మరోసారి రీ రిలీజ్ అయ్యింది. ముందుగా అజయ్ దేవగన్, షారుఖ్ ఖాన్‌తో ఈ సినిమా చేయాలనుకున్నారు రాకేశ్ రోషన్. ఆ తర్వాత అమీర్ ఖాన్, సల్మాన్‌ను సంప్రదించారు. ఫైనల్‌గా సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్‌లతో ‘కరణ్ అర్జున్’ వర్కవుట్ అయ్యింది.
The Karan Arjun experience …Ha, I look like a young Kabir with Karan and Arjun .
As an assistant , I remember minerva being the main theatre on release day. Me and dad’s other assistant Anurag ( 2nd pic in the white sweatshirt)), screened the print before the release and we… pic.twitter.com/buJKkkQQgo
— Hrithik Roshan (@iHrithik) November 23, 2024