BigTV English

Sreeleela: పటౌడీ వారసుడితో శ్రీలీల.. బాలీవుడ్ కు కొత్త జంట దొరికిందిరోయ్

Sreeleela: పటౌడీ వారసుడితో శ్రీలీల.. బాలీవుడ్ కు కొత్త జంట దొరికిందిరోయ్

Sreeleela:  ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఎదగాలనే చూస్తారు. అవకాశాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకోవడం కూడా  తెలివైన పనే. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని ఈతరం నాయికలు కొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్నారు. ఒక భాషలో ఎంట్రీ ఇచ్చామా.. హిట్ కొట్టామా.. వేరే భాషలోకి  వెళ్లిపోయామా   అన్నట్లు ఉంటున్నారు. ఒకే భాషలో పాతుకుపోవడం కానీ.. నాలుగు భాషల్లో ఎంట్రీ ఇస్తే.. ఇంకా ఎక్కువ సంపాదించొచ్చు అనే భావనలో ఉన్నారు. ఇలా అనుకుంటున్న హీరోయిన్స్ లో శ్రీలీల కూడా ఒకరు.


పెళ్లి సందD సినిమాతో ఈ బ్యూటీ తెలుగు పరిచయమైంది. మొదటి సినిమాతోనే అమ్మడు తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది.  ఇక ఆ ఆతరువాత ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. ఒకటి కాదు రెండు కాదు.. అరడజను సినిమాలతో అసలు ఖాళీ దొరకనంతగా పనిచేసింది.

Director Bobby: తారక్ గురించి బాలయ్య మాట్లాడలేదు.. మాకు కవర్ చేయాల్సిన అవసరం లేదు


కుర్ర హీరోలు, సీనియర్ హీరోలు అని తేడా లేకుండా వర్క్ చేసినా.. చిన్నదానికి  మాత్రం హిట్ దక్కింది లేదు. ఇక  దీంతో శ్రీలీల రూట్ మార్చింది. ఒకపక్క తెలుగు సినిమాల్లో నటిస్తూనే తమిళ్ లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైంది.

ఇక ఇప్పుడు ఈ బ్యూటీ చూపు బాలీవుడ్ మీద పడింది. గత కొన్ని రోజులుగా  శ్రీలీల బాలీవుడ్  ఎంట్రీ ఇస్తుందని వార్తలు వినిపిస్తున్న విషయం  తెల్సిందే. ఇక తాజాగా ఆ వార్త నిజమే అని కన్ఫర్మ్ అయ్యింది. శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీకి సిద్దమయ్యింది. అది కూడా అల్లాటప్పా హీరోతో కాదు. పటౌడీ వారసుడితో శ్రీలీల డెబ్యూ  ఇస్తుంది. స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ నట వారసుడు ఇబ్రహీం ఆలీఖాన్ డెబ్యూకు రంగం సిద్దమయిన విషయం విదితమే. ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.

Nagavamsi: ఆ ఇద్దరు హీరోయిన్లు కొట్టించుకోవడానికి ఒప్పుకోలేదు.. ఊర్వశీ ఒప్పుకుంది..

ఇక ఈ సినిమా తరువాత ఇబ్రహీం కొత్త కథను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. స్త్రీ 2 తో మంచి హిట్ అందుకున్న మ్యాడాక్ ఫిలిమ్స్ లో ఒక హర్రర్  కథను వీరిద్దరూ చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తుందని, దాని కోసమే ఈ జంట ఆ ఆఫీస్ కు వెళ్లి వచ్చారని అంటున్నారు. ఇక ఇబ్రహీం, శ్రీలీల జంట ఎంతో చూడముచ్చటగా ఉంది. ఇద్దరు చాలా క్యాజువల్ లుక్స్ లో కనిపించారు.

ముఖ్యంగా ఇబ్రహీం చేతిలో స్క్రిప్ట్ బుక్ ను పట్టుకొని కనిపించాడు. ఇందుకు సంబంధించిన  ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ జంటను  చూసిన మీడియా.. బాలీవుడ్ కు కొత్త జంట దొరికింది అని చెప్పుకొస్తున్నారు. ఇక త్వరలోనే ఈ సినిమాకు  సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఇకపోతే శ్రీలీల చేతిలో ప్రస్తుతం రాబిన్ హుడ్, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలతో ఈ చిన్నది ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×