Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (SS Thaman) చేసిన కామెంట్స్ వివాదాస్పదం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తమన్ కామెంట్స్ పై రామ్ చరణ్ గుర్రుగా ఉన్నారని, ఆ కోపాన్ని ఇన్స్టా లో తమన్ ను అన్ ఫాలో చేసి వెల్లడించారని తెలుస్తోంది.
తమన్ ను అన్ ఫాలో చేసిన చెర్రీ
విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా పొలిటికల్ ఎంటర్టైనర్ ‘గేమ్ ఛేంజర్’. బడా నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాలతో 2025 జనవరి 10న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ అదే స్థాయిలో నిరాశ పరిచింది. నిజానికి మొదటి నుంచి ఈ సినిమా అడ్డంకులను ఎదుర్కొంది. దాదాపు మూడేళ్ల పాటు సెట్స్ పై ఉన్న ఈ మూవీ కనీసం యావరేజ్ టాక్ కూడా తెచ్చుకోకపోవడం మెగా అభిమానులను అసంతృప్తికి గురి చేసింది. ఈ నేపథ్యంలోనే ఎన్నోసార్లు మెగా అభిమానులు డైరెక్టర్ శంకర్ ను టార్గెట్ చేశారు. కానీ ఇప్పటిదాకా మూవీ గురించి రాంచరణ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
కానీ తాజాగా తమన్ ఓ ఇంటర్వ్యూలో ‘గేమ్ ఛేంజర్’ సాంగ్స్ కు వ్యూస్ పెద్దగా రాకపోవడానికి కారణం ఏంటో వెల్లడించారు. ఈ సినిమాలోని ఒక్క పాటలో కూడా హుక్ స్టెప్ లేకపోవడం వల్లే మ్యూజిక్ పెద్దగా ఎఫెక్ట్ చూపలేదని తమన్ కొరియోగ్రాఫర్ ని బ్లేం చేస్తూ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. ఈ నేపథ్యంలోనే తమన్ వ్యాఖ్యలపై రామ్ చరణ్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక చెర్రీ ఆ అసంతృప్తితోనే తమన్ ను ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసినట్టు సమాచారం. దీంతో ఈ విషయంపై చరణ్ ఫాన్స్ కూడా ట్వీట్స్ చేస్తూ సోషల్ మీడియాలో విషయాన్ని వైరల్ చేస్తున్నారు.
‘గేమ్ ఛేంజర్’ కొరియోగ్రఫీపై తమన్ అసంతృప్తి
తమన్ ‘గేమ్ ఛేంజర్’ కొరియోగ్రఫీ గురించి కామెంట్ చేసినప్పుడు, ‘అల వైకుంఠపురంలో’ ప్రస్తావన తీసుకురావడం కూడా హాట్ టాపిక్ గా మారింది. ఈ రెండు సినిమాలకు ఆయన లింక్ పెట్టలేదు గానీ, అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురంలో’ మూవీలో ప్రతి సాంగ్ లో హుక్ స్టెప్ ఉందని గుర్తు చేశారు. అలాగే తాజాగా మరో డాన్స్ షోలో కూడా ‘గేమ్ ఛేంజర్’ కంటే ఈ షోలో చేసిన డ్యాన్స్ 1000 రెట్లు బాగుందని కామెంట్ చేశారు. మొత్తానికి మూవీపై తమన్ ఇలా ఓపెన్ గా అసంతృప్తిని వ్యక్తం చేయడం ఆయనకు కొత్త చిక్కులను తెచ్చి పెట్టింది. మరి చెర్రీ కోపాన్ని తమన్ ఎలా కూల్ చేస్తాడో చూడాలి.