Tamannaah Bhatia:మిల్కీ బ్యూటీ..ఈ పేరు చెప్పగానే అందరికీ వినిపించే హీరోయిన్ ఒకే ఒక్కరు తమన్నా భాటియా (Tamannaah Bhatia).. ఇండియన్ సినీ చరిత్రలో మిల్కీ బాయ్ గా మహేష్ బాబు(Maheshbabu), మిల్కీ బ్యూటీగా తమన్నాకి ఎంతో గుర్తింపు ఉంది. అయితే అలాంటి తమన్నా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి రెండు దశాబ్దాలు దాటినా కూడా ఇంకా వరుస అవకాశాలతో కెరీర్ లో దూసుకుపోతోంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే తన నటనతో అందర్ని ఆకర్షించిన తమన్నా ఆ తర్వాత స్టార్ హీరోల సరసన జతకట్టి ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా మారిపోయింది.
కెరియర్ పై తమన్నా కామెంట్స్..
అయితే చాలామంది హీరోయిన్లు సినిమాల్లోకి వచ్చే ముందే కొన్ని కండిషన్లు పెట్టుకొని వస్తారు. అలా బోల్డ్ సీన్స్, లిప్ లాక్ సీన్లు వంటివి చేయకూడదని కండిషన్లు పెట్టుకుంటారు.కానీ ఇలాంటి సీన్స్ లో చేయకపోతే వారిని దర్శక నిర్మాతలు పక్కన పెట్టేస్తారు. ముఖ్యంగా ఇప్పటి జనరేషన్లో.. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ యూత్ ఎక్కువగా రొమాంటిక్ సీన్స్ ఉంటేనే సినిమాలను చూడడానికి ఇష్టపడుతున్నారు. అయితే అచ్చం తమన్నా కూడా ఇండస్ట్రీకి వచ్చే ముందు ఇలాగే కొన్ని కండిషన్స్ పెట్టుకుందట. కానీ ఆ కండిషన్స్ పక్కన పెట్టాకే సినిమాల్లో ఎక్కువ ఆఫర్స్ వచ్చాయట. మరి ఇంతకీ తమన్నా పెట్టుకున్న ఆ కండిషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
అలా కండిషన్స్ పెట్టుకొని అవకాశాలు కోల్పోయాను – తమన్నా
ఉత్తరాది భామ అయినటువంటి తమన్నా భాటియాకి సౌత్ లోనే ఎక్కువ గుర్తింపు ఉంది. అయితే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నాకే నార్త్ కు వెళ్ళింది. నార్త్ లో కూడా కొన్ని సినిమాలు చేసినప్పటికీ తమన్నాకి సౌత్ లోనే ఎక్కువ అభిమానులు ఉంటారు. అయితే తమన్నా సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నో కిస్ పాలసీ పెట్టుకుందట. అయితే తమన్నా సినిమాలు హిట్ అవ్వడంతో చాలానే ఆఫర్స్ వచ్చాయట. కానీ ఆ సినిమాల్లో రొమాంటిక్ సీన్స్, కిస్ సీన్స్ వంటివి ఉండడంతో నేను అవి చేయలేనని చెప్పేసిందట. అలా చెప్పడం వల్ల పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలను కోల్పోయిందట.
రూల్స్ బ్రేక్ చేయడానికి కారణం వారే..
అలా అవకాశాలు కోల్పోతున్న సమయంలో.. మళ్లీ సినిమాలలో అవకాశం రావాలి అంటే రూల్స్ బ్రేక్ చేయాలి తెలిపింది. దాంతో అవకాశాలు తగ్గిపోయాయి. మళ్ళీ నో లిప్ కిస్ రూల్ ని బ్రేక్ చేసింది.అలా జీ కార్డా, లస్ట్ స్టోరీస్ 2తో పాటు కొన్ని ఐటమ్ సాంగ్ లలో అవకాశాలు వచ్చాయి. ఇలా రూల్స్ బ్రేక్ చేయడానికి విజయ్ వర్మ కారణమని అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఆ రూల్స్ పక్కన పెట్టడం వల్లే వరుసగా అవకాశాలు – తమన్నా
ఈ విషయం గురించి తమన్నా తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”నో కిస్ పాలసీ వల్ల నేను నా కెరియర్ ను చాలా వరకు కోల్పోయాను.దానివల్ల పెద్ద సినిమాలు మిస్ చేసుకున్నా. కానీ నో కిస్ పాలసీని పక్కన పెట్టినప్పుడే నాకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. అలా నా కెరియర్ గాడిన పడింది. ఒకరకంగా చెప్పాలంటే నాకు నేను పెట్టుకున్న కండిషన్స్ వల్ల కోల్పోయిన కెరియర్ ని ఈ కండిషన్స్ పక్కన పెట్టడం వల్ల మళ్ళీ తిరిగి నిర్మించుకోగలిగాను. నో కిస్ పాలసీని పక్కనపెట్టి గ్లామరస్ రోల్స్ చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత నా కెరియర్ పూర్తిగా మారిపోయింది. చాలా సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి” అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది తమన్నా.. తమన్నా ఈ మధ్య కాలంలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించడం లేదు. అయితే యంగ్ హీరోయిన్లు వస్తున్నారనో లేక ఆమె పర్సనల్ కెరీర్ గురించి వస్తున్న రూమర్స్ వల్లనో కానీ ఈ హీరోయిన్ ని కేవలం స్పెషల్ సాంగ్ ల కోసం, గ్లామరస్ పాత్రల కోసం మాత్రమే తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రెండు మూడు సంవత్సరాలలో తమన్నా ఎక్కువగా స్పెషల్ సాంగ్ లకే పరిమితమైపోయింది.
తమన్నా వ్యక్తిగత జీవితం..
ఇక తమన్నా పర్సనల్ విషయానికి వస్తే.. విజయ్ వర్మ (Vijay varma) తో ప్రేమలో పడి 3 సంవత్సరాలు డేటింగ్ చేసింది. కానీ ఈ మధ్యనే వీరి మధ్య బ్రేకప్ అయినట్టు తెలుస్తోంది.. బ్రేకప్ బాధలో ఉన్న తమన్నా తన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం కోసం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో కలిసి పుణ్యక్షేత్రాలు దర్శించుకుని శాంతియుత వాతావరణంలో గడపడానికే ఎక్కువ ట్రై చేస్తోంది.
ALSO READ:Mammootty: అనారోగ్యంతో మమ్ముట్టి.. ఒక పోస్టుతో క్లారిటీ ఇచ్చిన మోహన్ లాల్!