Jabardast Varsha..జబర్దస్త్ వర్ష (Jabardast Varsha).. ఒకప్పుడు సీరియల్స్ లో నటించి తనకంటూ ఒక ఇమేజ్ అందుకున్న ఈమె.. జబర్దస్త్ కామెడీ షోలోకి అడుగుపెట్టిన తర్వాత విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తోటి కమెడియన్ ఇమ్మానుయేల్ (Immanuel) తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ పండిస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా జబర్దస్త్ షోలో సుధీర్ – రష్మీ ఎలా అయితే పాపులారిటీ సొంతం చేసుకున్నారో.. ఇమ్మానుయల్ – వర్షా కూడా అంతే పాపులారిటీ దక్కించుకున్నారని చెప్పవచ్చు. అటు జబర్దస్త్ , ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో కూడా కనిపిస్తూ సందడి చేస్తూ ఉంటుంది ఈ జంట. ఇకపోతే జబర్దస్త్ లో ఉన్న ప్రతి ఒక్కరి జీవితం వెనుక ఎంతో విషాదగాధలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే ఆ విషయాలన్నీ ఒక్కొక్కరిగా వారే స్వయంగా బయట పెడితే తప్పా తెలియని పరిస్థితులు. ఈ క్రమంలోనే తాజాగా తన బాధను బయటపెట్టి అందరి చేత కన్నీళ్లు పెట్టించింది వర్ష.
రెండు ముఖాలు తీసుకోలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయా – వర్ష
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె తాజాగా బిగ్ టీవీ నిర్వహిస్తున్న ‘కిస్సిక్ టాక్స్’ అనే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.. సరదాగా మరో యాంకర్ గా జూనియర్ సమంత గా పేరు దక్కించుకున్న అషు రెడ్డి (Ashu Reddy) ను సరదాగా ఇంటర్వ్యూ చేసి.. ఆ తర్వాత కన్నీళ్లు పెట్టించేలా తన మనసులో బాధను బయటపెట్టింది. ప్రస్తుతం మూడవ ఎపిసోడ్ మొదలవగా.. అందులో అషు రెడ్డితో తన బాధలు పంచుకుంది వర్ష. అసలు విషయంలోకి వెళ్తే.. అషు రెడ్డి మాట్లాడుతూ.. ఎందుకు ప్రతి చిన్న దానికి ఓవర్ ఎమోషన్ అయిపోతావు.. అసలు ఏంటి? అని ప్రశ్నించగా వర్షా మాట్లాడుతూ..” నేను ఒక కంటెస్టెంట్ గానే చేసి ఉండొచ్చు.. ఒక చిన్న చిన్న షోలు మాత్రమే చేసి ఉండొచ్చు. కానీ నేను ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బు, ఎక్కువ పేరు వచ్చింది. అలాంటి సమయంలోనే వ్యక్తుల నుంచి రెండు ముఖాలు చూసేసరికి పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.
ఒక బెగ్గర్ ఇంట్లో పుట్టినా బాగుండేదేమో – వర్ష
నా దగ్గర డబ్బు, ఫేమ్ ఉన్నప్పుడు వర్షా నువ్వు గ్రేట్, తోపు అంటూ నన్ను చాలా పొగిడేశారు. కానీ సందర్భం మారిపోయిన తర్వాత వారిలో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. ఎవరైతే నన్ను పొగిడారో ఆ తర్వాత వారే నన్ను చూడగానే అసహ్యించుకునేవారు. ముఖ్యంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఫోన్ చేస్తే.. ఆ అవునా సరే మళ్లీ ఫోన్ చేస్తా అని ఫోన్ పెట్టేసేవారు. అలా ఒకప్పుడు నన్ను ప్రేమించిన వారు ఇప్పుడు నన్ను ద్వేషిస్తుంటే ఆ బాధను తట్టుకోలేకపోయాను. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోనే ఇలా ఉంటుందేమో అనిపించింది. ముఖ్యంగా ఆన్ స్క్రీన్ ఆర్టిస్టులు వేరు.. ఆఫ్ స్క్రీన్ ఆర్టిస్టులు వేరు.. వారి నుండి రెండు ఫేస్ లను నేను తీసుకోలేకపోయాను. ఇప్పటికీ వారి నుంచి నేను ఆ ప్రేమను పొందలేకపోతున్నాను. ముఖ్యంగా ఆన్ స్క్రీన్ లో నాపై పంచులు వేసేవారు.. నన్నే ట్రిగర్ చేసేవారు.. అప్పుడు కూడా నేను చాలా జోవియల్ గానే తీసుకున్నాను. కానీ అదే ఆన్ స్క్రీన్ లో అన్నవారు ఆఫ్ స్క్రీన్ లో భలే తిట్టాను.. దాన్ని భలే చేశాను అని చెప్పేసరికి తీసుకోలేకపోయాను. అందుకే దేవుడిని నేను ఎప్పుడూ ఒకటే కోరుకుంటున్నాను. ఎందుకు నాకు ఈ లైఫ్ ఇచ్చావు. ఎవరైనా “ఒక బెగ్గర్ ఇంట్లో పుట్టినా బాగుండేదేమో”. డబ్బు ఉన్నా సుఖం లేదు.. పేరు ఉన్నా సుఖం లేదు.. అందరూ ఉన్నా సుఖం లేదు. మళ్లీ నాకు ఈ లైఫ్ వద్దు. ఈ ఫీల్డ్ కి రావద్దు.. మళ్లీ జన్మంటూ ఉంటే అసలు మనిషిగానే పుట్టొద్దు” అంటూ తాను ఎమోషనల్ అవ్వడమే కాకుండా అందరిని కంటతడి పెట్టించింది వర్ష. ఇక వర్ష బయటికి నవ్వుతూ కనిపించినా..ఈమె గుండె లోతుల్లో ఇంత బాధ ఉందా అని అటు అషు రెడ్డి కూడా ఆశ్చర్యపోయింది. ఇక ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.