Jabardasth Santhi Kumar: తెలుగులో స్టాండప్ కామెడీ షోలు అనేవి అంత ఫేమస్ కాదు అనుకున్న సమయంలోనే మొదటిసారి తెలుగులో అలాంటి షో ఒకటి స్టార్ట్ అయ్యింది. అదే ‘జబర్దస్త్’. ఆ షో వల్ల అప్పటివరకు ఇండస్ట్రీలో గుర్తింపు రాని ఆర్టిస్టులు ఎంతోమందికి గుర్తింపు లభించింది. అంతే కాకుండా ప్రతీ ఒక్కరి పేరుకు ముందు జబర్దస్త్ అనే ట్యాగ్ అయ్యింది. అదే వారికి గుర్తింపుగా మారింది. అలాంటి ఆర్టిస్టుల్లో ఒకరు శాంతి కుమార్. ఎన్నో ఏళ్లుగా మిమిక్రీ ఆర్టిస్టుగా స్టేజ్ పర్ఫార్మెన్స్‌లు ఇచ్చిన శాంతి కుమార్.. జబర్దస్త్‌లో అడుగుపెట్టిన తర్వాత కమెడియన్‌గా మారాడు. తాజాగా బిగ్ టీవీకి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో తన భార్యతో కలిసి పాల్గొన్న శాంతి కుమార్.. తన పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను కూడా బయటపెట్టాడు.
అవును.. నిజమే..
బిగ్ టీవీకి శాంతి కుమార్ ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. అందులో ముందుగా ‘రెబెల్ స్టార్, పవన్ స్టార్, సూపర్ స్టార్, మెగా స్టార్’ అంటూ శాంతి కుమార్ గురించి యాంకర్ పరిచయం చేయగానే.. ‘‘ఇన్ని స్టార్స్‌ను ఎందుకు కలిపారు అని ఫ్యాన్స్ అనుకుంటే నన్ను ముందుగా స్టార్స్‌లో కలిపేస్తారు’’ అంటూ మొదట్లోనే కామెడీ మొదలుపెట్టేశారు శాంతి కుమార్. ఆ తర్వాత తనకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి అంటే ఇండస్ట్రీలో వినిపిస్తున్న వార్తలపై ఒక క్లారిటీ ఇచ్చాడు. ‘‘మూడు పెళ్లిళ్ల మాట వాస్తవమే. అందులో ఒకరు నా పక్కన ఉన్నారు. ఒకరు నా మనసులో ఉన్నారు. ఒకరు నా పర్సులో ఉన్నారు’’ అని అన్నాడు.
ఎందుకు పెళ్లి చేసుకున్నారు?
శాంతి కుమార్ భార్య కూడా స్టేజ్ ఆర్టిస్టే. ఇద్దరూ స్టేజ్ పర్ఫార్మెన్స్‌లు ఇస్తున్న సమయంలోనే ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ ఆ ప్రేమ, పెళ్లి ఆమె ఇంట్లోవారికి ఇష్టం లేదు. అందుకే శాంతి కుమార్‌ను పెళ్లి చేసుకోవడానికి ఆమె ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది. దాని గురించి కూడా ఆమె బయటపెట్టారు. ‘‘ఆయనలో ఎవరికీ కనిపించనిది నాకు కనిపించింది. ఆయనను పెళ్లి చేసుకుంటే జీవితాంతం సరదాగా ఉంటానని అనుకున్నాను. కానీ..’’ అంటూ చెప్పడం ఆపేశారు శాంతి కుమార్ భార్య. ఆ తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు శాంతి కుమార్. అసలు తనకు ఆ ఫీల్డ్‌లో బ్రేక్ ఎలా వచ్చిందో చెప్పుకొచ్చాడు.
Also Read: అసలు ఈ ‘ప్రేమ ఖైదీ’ హీరో ఏమయ్యాడు.? జీవితం మీద వైరాగ్యం వచ్చిందా.?
దైవభక్తి ఉంది కానీ..
ముందుగా సీనియర్ ఎన్‌టీఆర్ వాయిస్‌ను మిమిక్రీ చేయడం వల్ల తనకు గుర్తింపు లభించిందంటూ గ్లింప్స్ చూపించాడు శాంతి కుమార్. ఆ తర్వాత ప్రకాశ్ రాజ్, సునీల్ వాయిస్‌లు కూడా మిమిక్రీ చేసి చూపించాడు. పైగా తనకు, అమ్మవారికి చాలా అనుబంధం ఉందని, బయటికి చూపించేదే భక్తి కాదని తాను నమ్ముతానని అభిప్రాయం వ్యక్తం చేశాడు. తనకు కోపం ఉన్న వ్యక్తుల గురించి అమ్మవారితో చెప్పుకుంటాను కానీ ఇంకేమీ చేయను అని అన్నాడు. మిమిక్రీ ఆర్టిస్ట్ నుండి కమెడియన్‌గా మారాలని అనుకున్నప్పుడు తన జీవితంలో చాలా అవమానాలు ఎదుర్కున్నానని కూడా చెప్పుకొచ్చాడు శాంతి కుమార్. తను చూడడానికి అస్సలు బాలేడని తనకు మొదట్లో ఆఫర్లు ఇవ్వలేదని గుర్తుచేసుకున్నాడు.