Laser Weapon : ఆత్యాధునిక ఆయుధాలు, సాంకేతికతలతో అగ్రగామి దేశంగా ఉన్న ఆమెరికా.. ఇప్పుడు మరో సూపర్ పవర్ ఆయుధాన్ని ప్రయోగించింది. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి ఇంటర్ నెట్లో వైరల్ గా మారగా.. ఈ ఆయుధానికి సంబంధించిన వివరాలు ఆమెరికా అధికారిక సంస్థ నుంచి సైతం అందుబాటులోకి వచ్చాయి. సముద్రం మధ్యలో యూఎస్ నేవీ అత్యంత శక్తివంతమైన లేజర్ ఆయుధాన్ని ప్రయోగించింది. ఈ లేజర్ ఆయుధాన్ని హేలియోస్ అని పిలుస్తున్నారు. అంటే.. హైఎనర్జీ లేజర్ ఇంటిగ్రేటెడ్ ఆప్టికల్ డాజ్‌లర్ అండ్ సర్వైలెన్స్ అని అర్థం. కాగా.. ఇది అత్యంత శక్తివంతమైన లేజర్ కిరణాల్ని ప్రయోగించి శత్రువులపై మెరుపు దాడులు చేయగలదని తెలుస్తోంది. దీనికి సంబంధించి అనేక వార్తా కథనాలు ప్రసారం అవుతుండగా.. ఈ ఆయుధం గురించి యూఎస్ సెంటర్ ఫర్ కౌంటర్‌మెజర్స్ వార్షిక రిపోర్టులో ఈ ఆయుధం గురించిన వివరాలు ఉన్నాయి. అందులోనూ.. ఈ ఆయుధానికి హై ఎనర్జీ లేజర్ ఉందని తెలుపగా, ఇతర సాంకేతిక విషయాల్ని వెల్లడించలేదు.
నిరంతరం ఆధునిక ఆయుధాల కోసం అన్వేషించే ఆమెరికా.. తన నౌక దళం కోసం ఈ ఆధునిక లేజర్ ఆయుధాన్ని సిద్ధం చేస్తోంది. దీని అభివృద్ధిని లాక్‌హీడ్ మార్టిన్ సంస్థ చూస్తోంది. కాగా..ఇది అధునాతన లేజర్ ఆయుధ వ్యవస్థగా చెబుతున్నారు. దీనిని యుద్ధ నౌకలపై అమర్చి.. తీర ప్రాంతాల్లో నుంచి వచ్చే ముప్పులను సమర్థవంతంగా నిరోధించాలని భావిస్తున్నారు. ఇటీవల పెరిగిపోతున్న డ్రోన్ల దాడులను ఈ లేజర్ తో సమర్థవంతంగా నిరోధించవచ్చని చెబుతున్నారు. అలాగే.. శత్రువుల ఆయుధాలు, క్షిపణులు, నిఘా పరికరాల్ని దెబ్బ తీసేందుకు ఈ ఆయుధం సమర్థవంతంగా పని చేస్తుందని తెలుపుతున్నారు.
ఈ వ్యవస్థలో 60 కిలోవాట్ సామర్థ్యంతో హైఎండ్ ఎనర్జీ లేజర్ ప్రసరిస్తుంది. ఇది కాంతి వేగంతో లక్ష్యాల్ని చేధిస్తుంది. అయితే.. దీన్ని మూడు రకాలుగా వినియోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని హై ఎనర్జీ లేజర్ ను ప్రయోగించి.. శత్రు లక్ష్యాలను నాశనం చేయవచ్చు. అంటే డ్రోన్లు, ఇతర లక్ష్యాల్ని కాల్చి వేయవచ్చు. అలాగే.. ఇంటిగ్రేటెడ్ ఆప్టికల్-డాజ్లర్ పద్ధతిలో శత్రు దేశాల నౌకలు, విమానాలు, యుద్ధ విమానాల్లోని సెన్సర్లు, ఇతర కెమెరాలను నిర్వీరం చేసేందుకు వీలవుతుంది. అంటే.. అవి పూర్తిగా కనపించకుండా అంధకారం చేసేందుకు వీలవుతుంది.
దాంతో పాటే.. సర్వైలెన్స్ సామర్థ్యం సైతం ఈ లేజర్ ఆయుధానికి ఉన్న మరో ప్రత్యేకత అంటున్నారు. అంటే.. ఈ పద్ధతిలో శత్రు కార్యకలాపాలను గుర్తించి, ట్రాక్ చేయవచ్చని చెబుతున్నారు. ఇలా.. ఒకే ఆయుధంతో అనేక రకాల ప్రయోజనాలు పొందొచ్చు. అంతే కాదు.. ఈ లేజర్ టెక్నాలజీ అత్యంత చౌక అని చెబుతున్నారు. కేవలం ఒక్క పిజ్జా ఖర్చుతోనే ఒక క్షిపణిని, లేదా డ్రోన్ ను పూర్తిగా నిర్వీరం, నాశనం చేయవచ్చు. అదే.. ఆయుధాలు వినియోగించాల్సి వస్తే.. వేలాది డాలర్లు ఖర్చవుతాయి. ఓ అంచనా ప్రకారం.. ఈ ఆయుధాన్ని ఒక్కసారి ప్రయోగించేందుకు కేవంల రెండు డాలర్లు ఖర్చవుతుంది.
లేజర్ టెక్నాలజీలో భారత్ ఏం చేస్తోంది..
భారత్ సైతం రక్షణ రంగంలో లేజర్ ఆయుధాల్ని ప్రవేశపెట్టేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోంది. భారత రక్షణ పరిశోధనా, అభివృద్ధి సంస్థ DRDO లేజర్ ఆధారిత ఆయుధాలను అభివృద్ధి చేస్తోంది. అందులో భాగంగా.. Directed Energy Weapons అభివృద్ధి అవుతున్నాయి. 10 కిలోవాట్ సామర్థ్యం నుంచి 100 కిలోవాట్ శక్తితో అత్యంత శక్తివంతమైన లేజర్ ఆయుధాల్ని అభివృద్ధి చేస్తున్నారు. అలాగే.. ఆదిత్య అనే పేరుతో ఓ ప్రాజెక్ట్ చేపట్టిన డీఆర్డీఓ.. డ్రోన్లు, చిన్నసైజు లక్ష్యాలను కూల్చే సామర్థ్యంతో ఓ ఆయుధానికి రూపకల్పన చేస్తోంది. అలాగే.. KALI-5000 అనే ప్రయోగాత్మక ప్రాజెక్ట్‌ను భారత్ అటామిక్ రిసెర్ట్ సెంటర్ అభివృద్ధి చేస్తోంది. ఇది.. ఆయుధాలను కాకుండా శత్రు దేశాల శత్రు ఉపగ్రహాలు, ఎలక్ట్రానిక్ వ్యవస్థలను దెబ్బతీసే శక్తివంతమైన లేజర్ వ్యవస్థ. యుద్ధ సమయాల్లో ఆయా దేశాల ఉపగ్రహాల్ని కూల్చేస్తే.. ఆయుధాలు, క్షిపణుల నావిగేషన్ నుంచి ఎయిర్ ఫోర్స్ విమానాలకు దిశానిర్దేశం చేయడం చాలా కష్టమవుతుంది.
Also Read :