Divorce : సెలబ్రిటీ కపుల్ డివోర్స్ తీసుకుంటున్నారు అనగానే ముందుగా ఎదురయ్యే ప్రశ్న ఎందుకు?. ఇక ఆ తర్వాత భరణం ఎంత ఇవ్వబోతున్నారు?. తాజాగా స్టార్ సింగర్ తన భార్యతో డివోర్స్ తీసుకోబోతున్నాడు అనే వార్తలు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన డివోర్స్ విషయంలో భారీ భరణాన్ని చెల్లించుకోక తప్పదు అనే టాక్ నడుస్తోంది.
విడాకుల దిశగా జస్టిన్ బీబర్, హేలీ బంధం
తన పాటలతో ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించిన ప్రముఖ పాప్ సింగర్ జస్టిన్ బీబర్ (Justin Bieber). ప్రస్తుతం ఆయన వ్యక్తిగత జీవితం కారణంగా తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. జస్టిన్ బీబర్ తన భార్య హేలీ (Hailey Bieber) విడాకులు తీసుకోవచ్చు అనే వార్తలు విన్పిస్తున్నాయి. నిజానికి ఈ జంట ఏడేళ్ల క్రితం అంటే 2018లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆరు నెలల క్రితమే హేలికి జాజ్ బ్లూస్ బీబర్ అనే కుమారుడు కూడా జన్మించాడు. అయితే కొడుకు పుట్టి ఏడాది కూడా గడవక ముందే ఈ జంట డివోర్స్ తీసుకోబోతున్నారు అనే వార్త అభిమానులను టెన్షన్ పెడుతోంది. అయితే ఈ వార్తలపై ఇప్పటిదాకా ఇటు జస్టిన్ గానీ, అటు హేలీ గానీ స్పందించలేదు.
సమాచారం ప్రకారం హేలీ నుండి విడిపోవాలంటే జస్టిన్ (Justin Bieber) భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. ఎందుకంటే హేలీ అతని నుంచి డివోర్స్ తీసుకోబోతున్న నేపథ్యంలో భరణం కింద 300 మిలియన్ డాలర్లు డిమాండ్ చేయబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే ఈ లెక్క అక్షరాలా రూ. 2627 కోట్లు.
డివోర్స్ కి కారణం ఇదేనా?
కాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట డివోర్స్ తీసుకోవడానికి గల కారణం జస్టిన్ (Justin Bieber) కు ఉన్న అలవాట్లేనని అంటున్నారు. అతను మాదకద్రవ్యాలకు అడిక్ట్ కావడంతో హేలీ జస్టిన్ తో ఫ్యూచర్ కష్టంగా ఉంటుందని భావిస్తోందట. నిజానికి జస్టిన్ హేలీని పెళ్లి చేసుకోవడానికి ముందు అన్నింటికీ దూరంగా ఉంటానని ప్రామిస్ చేశాడట. కానీ రీసెంట్ గా అతను ఇచ్చిన మాటను తప్పడంతో హేలీ బాధపడిందని, అందుకే ఈ షాకింగ్ డెసిషన్ తీసుకుందని అంటున్నారు. ముఖ్యంగా జస్టిన్ తాగాక బిహేవ్ చేసే విధానం హేలీకి నచ్చదని, ఆ ఎఫెక్ట్ బిడ్డపై పడుతుందని ఆమె టెన్షన్ పడుతుందట. అందుకే జస్ట్టిన్ అలవాట్లను పరిగణలోకి తీసుకొని, హేలీ తన బిడ్డ పూర్తి కస్టడీని తనకే ఇవ్వాలని దరఖాస్తు చేసుకోవచ్చని అంటున్నారు. ఈ కారణంగానే భారీగా భరణం డిమాండ్ చేసే ఛాన్స్ ఉందని టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉండగా, 2015 సంవత్సరంలో అంటే 10 సంవత్సరాల క్రితం హేలీ, జస్టిన్ (Justin Bieber) ఒకరినొకరు డేటింగ్ చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో జస్టిన్ వయసు 21, హేలీ వయసు 19 సంవత్సరాలు. అప్పట్లో ఒక సంవత్సరం పాటు డేటింగ్ చేసిన తర్వాత ఇద్దరూ విడిపోయారు. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత, వారిద్దరూ మళ్ళీ ఒకరినొకరు కలుసుకుని, తమ బంధాన్ని పెళ్లి దాకా తీసుకెళ్లారు. మధ్యలో సెలీనా గోమేజ్ ను జస్టిన్ డేట్ చేశాడు.