Karthi: ఈరోజుల్లో చాలామంది హీరోలు వైవిధ్యభరితమైన సినిమాలు, పాత్రలు ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఒక కమర్షియల్ సినిమాలో నటించగానే వెంటనే దానికి సంబంధం లేని మరో కథతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలాంటి ప్రయోగాలు కొన్నిసార్లు ఫెయిల్ అయినా కూడా వాటినే ఫాలో అవుతున్న వారు చాలామంది ఉన్నారు. అందులో తమిళ హీరోలు సూర్య, కార్తి కూడా ఉంటారు. ముఖ్యంగా కార్తి అయితే ఒకసారి పనిచేసిన దర్శకుడితో మళ్లీ పనిచేయకుండా తన కెరీర్‌ను ముందుకు నడిపిస్తున్నాడు. ఇక తన అన్నయ్యకు ‘కంగువా’ వల్ల తగిలిన దెబ్బను చూసి కూడా తాను కూడా అలాంటి ప్రయోగమే చేయడానికి సిద్ధపడ్డాడట కార్తి.
మర్చిపోలేని డిశాస్టర్
సూర్య (Suriya) హీరోగా నటించిన చివరి చిత్రమే ‘కంగువా’. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. తమిళంలో మాత్రమే కాకుండా ఇతర సౌత్ భాషల్లో కూడా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీని ఎలాగైనా హిట్ చేయడం కోసం ప్రతీ భాషలో తానే స్వయంగా వెళ్లి మరీ ప్రమోషన్స్ చేశాడు సూర్య. కానీ విడుదలయిన మొదటి రోజు నుండే ‘కంగువా’కు ఫ్లాప్ టాక్ రావడం మొదలయ్యింది. అలా మొదటి వీకెండ్ లోపు ఈ మూవీ డిశాస్టర్ టాక్‌ను మూటగట్టుకుంది. అలా కలెక్షన్స్ విషయంలో కూడా వెనకబడిపోయింది. ఇదంతా చూసి కూడా మళ్లీ అలాంటి కథతోనే ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తానంటున్నాడు కార్తి.
అదే స్టోరీ
ప్రస్తుతం కార్తి అసలు తీరిక లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇంతలోనే తన కెరీర్‌లోని 29 చిత్రాన్ని సైన్ చేశాడని కోలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇది రామేశ్వరం, శ్రీలంక బోర్డర్‌లో ఉండే పైరేట్స్ జీవితకథ ఆధారంగా తెరకెక్కే సినిమా అని సమాచారం. ఇప్పటికే ‘కంగువా’ (Kanguva) లాంటి ఒక పైరేట్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగిన పీరియడ్ కథతో వచ్చిన సూర్య అతిపెద్ద డిశాస్టర్‌ను మూటగట్టుకున్నాడు. అది చూసిన తర్వాత కూడా కార్తి మళ్లీ అలాంటి ప్రయోగమే చేస్తున్నాడంటే తన ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతున్నారు. ‘కంగువా’ కూడా దాదాపు ఇదే స్టోరీ లైన్‌తో తెరకెక్కింది కదా అని మరోసారి గుర్తుచేసుకుంటున్నారు.
Also Read: ‘రాజా సాబ్’లో రెండు ట్విస్టులు.. ఆడియన్స్ మైండ్‌ని బ్లాస్ట్ చేయబోతున్న డైరెక్టర్.!
భారీ లైనప్
ప్రస్తుతం కార్తి (Karthi).. నలన్ కుమారసామి దర్శకత్వంలో ‘వా వాతియార్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదలయ్యింది. ఇందులో కార్తి.. ఎమ్‌జీఆర్‌కు వీరాభిమానిగా కనిపించనున్నాడు. ఈ మూవీ విడుదల అవ్వకముందే పీఎస్ మిథ్రన్ దర్శకత్వంలో ‘సర్దార్ 2’ను ప్రారంభించాడు. తాజాగా ‘సర్దార్ 2’ కూడా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది. దీని తర్వాత ‘ధనాకరణ్ తమిళ్’, ‘ఖైదీ 2’ చిత్రాలను లైన్‌లో పెట్టాడు కార్తి. వీటన్నింటిలో మధ్యలో ‘కంగువా’ లాంటి ప్రయోగం అవసరమా అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.